ఈజీ చికెన్ పులావు కుక్కర్లో
పర్ఫెక్ట్ చికెన్ పులావ్ చేయడం చాలా ఈసీ. కొన్ని కచ్చితమైన కొలతలు పద్ధతులు పాటిస్తే ఎప్పుడు చేసినా బెస్ట్ చికెన్ పులావ్ వస్తుంది.

టిప్స్
చికెన్:
• మాంసం లేతది అంటే కిలో లోపు ఉన్న కోడి వాడితే ముక్కకి ఫ్లేవర్స్ బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది పులావ్.
• మాంసం కూడా కాస్త పెద్దముక్కలు ఉంటే పులావ్ కి బాగుంటుంది.
• చికెన్ వండడానికి ముందు ముప్పై నిమిషాలు 1 tbsp ఉప్పు వేసిన నీళ్ళలో నానబెడితే ముక్క సాఫ్ట్ అవుతుంది • చికెన్ నూనెలో వేపేటప్పుడు హై-ఫ్లేమ్ మీద వేపితే చికెన్ లోని నీరు వదిలి ముక్క మగ్గుతుంది. అలా నీరోదిలి చికెన్ ముక్కలోని చెమ్మారే దాకా వేపుకోవాలి.
బాస్మతి బియ్యం:
• నన్ను అందరూ మీరు ఏ బ్రాండ్ బాస్మతి బియ్యం వాడతారు అని అడుగుతుంటారు. నేను బ్రాండ్ పేరు చెప్పడం కంటే సంవత్సరం కంటే పాత బియ్యం వాడతాను అని చెప్తాను. మార్కెట్ లో మాంచి బ్రాండ్ బాసమతి బియ్యం ఉన్నాయి. దాదాపుగా పేరున్న అన్నీ బ్రాండ్లు మంచివే.
• బియ్యంని బాగా కడిగి 30 నిమిషాలు నానబెడితే చక్కగా పొడిపొడిగా ఉడుకుతుంది
• చికెన్ పులావ్ కుక్కర్లో బాస్మతి బియ్యంతో అయితే 1:1/2 నీళ్ళు సరిపోతాయి
• ఇదే సోనా మసూరి బియ్యం అయితే 1: 2 నీళ్ళు అవసరమవుతాయ్
పులావ్ పొడిపొడిగా రావాలంటే:
• బాస్మతి బియ్యం సంవత్సరం కంటే పాతవి అయి ఉండాలి.
• బాస్మతి /సోనా మసూరి ఏ బియ్యాన్ని అయినా 30 నిమిషాలు నానబెట్టాలి
• బాస్మతి బియ్యం కుక్కర్లో హై-ఫ్లేమ్ మీద రెండు కూతల్లో ఉడికిపోతుంది. సోనా మసూరి అయితే 2 కూతలు హై మీద 1 కూత చిన్న మంట మీద రానివ్వాలి
• కుక్కర్ కూతలు అయ్యాక స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి. ఆ తరువాత అడుగు నుండి అట్లకాడతో నిదానంగా కలిపితే మెతుకు విరగకుండా పొడిపొడిగా వస్తుంది.
ఆఖరుగా ఒక్క మాట :
• నేను చేస్తున్న పులావ్ మీడియం స్పైస్ తో ఉంటుంది. ఉప్పు కారాలు మీకు తగినట్లుగా మార్చుకోవచ్చు.

ఈజీ చికెన్ పులావు కుక్కర్లో - రెసిపీ వీడియో
Easy Chicken Pulao in Pressure Cooker | Homemade Chicken Pulao Recipe
Prep Time 5 mins
Cook Time 15 mins
Resting Time 15 mins
Total Time 35 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 1/2 kilo చికెన్
- 250 gms బాసుమతి బియ్యం (1.5 cup)
- 1/4 cup పెరుగు
- 1 ఉల్లిపాయలు
- 1 టమాటో
- 2 tsp పుదినా తరుగు
- 2 tsp కొత్తిమీర తరుగు
- 1 tsp కారం
- ఉప్పు
- 1/2 tsp పసుపు
- 1 tbsp అల్లం వెల్లులి పేస్టు
- 5 లవంగాలు
- 4 యాలకలు
- 1 inch దాల్చిన చెక్క
- 1 బిరియాని ఆకు
- 1 tsp షాహీజీరా
- 1/2 tsp గరం మసాలా
- 1 tsp ధనియాల పొడి
- 1 tsp వేయించిన జీలకర్ర పొడి
- 2 1/4 cups నీళ్ళు
- 3 tbsps నూనె
విధానం
-
కుక్క ర్లో నూనె వేడి చేసి అందులో లవంగాలు, చెక్క, యాలకలు, షాజీర, బిరియాని ఆకు వేసి మంచి సువాసనోచ్చేదాక వేపుకోండి
-
ఇప్పుడు ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి
-
మంచి కలర్ వచ్చాక అప్పుడు అల్లం వెల్లూలి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మసలాల్ని బాగా వేపుకోండి.
-
టమాటో ముక్కలు వేసి టమాటో మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి.
-
గంటపాటు ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టిన చికెన్ వేసి బాగా కలిపి 4-5 నిమిషాలు పాటు హై ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి. తరువాత 2 కప్స్ నీళ్ళు పోయాలి.
-
గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి చిలికిన పెరుగు, పుదినా తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి హై-ఫ్లేం మీద 2 విసిల్స్ హై ఫ్లేం మీద రానివ్వండి, ఆ తరువాత స్టవ్ ఆపేసి 30 నిమిషాలు వదిలేయండి
-
30 నిమిషాల తరువాత అడుగునుండి కలుపుకొండి. అంతే పర్ఫెక్ట్ చికెన్ పులావ్ రెడీ.

Leave a comment ×
12 comments