డాభా స్టైల్ బెండకాయ మసాలా
బ్యాచిలర్స్, ఆఫీసులకి వెళ్ళేవారు కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపి స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో పాటు వీడియో కూడా ఉంది చూడండి.
“దాభా స్టైల్ బెండకాయ మసాలా కూర” అనగానే ఏదో కొత్త రకం కూర అనుకోకండి. చాలా సింపుల్ కూర కానీ, ఎంతో రుచిగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వారు చేసుకునే నూనె వంకాయ మాదిరి ఉంటుంది.
పంజాబీ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ జస్ట్ 3 స్టెప్స్ లో అయిపోతుంది. కూర చాలా సింపులే. కానీ, కొన్ని టిప్స్ని అర్ధం చేసుకుని చేస్తే ఎప్పుడు చేసినా ఒకే లాంటి అందరూ ఇష్టంగా తినే బెండకాయ కూర తయారవుతుంది.

టిప్స్
బెండకాయ:
• బెండకాయాలు లేతవీ ఉంటే కూర రుచి చాలా బాగుంటుంది.
• బెండకాయ ముక్కలు ఒకటిన్నర అంగుళం ముక్కలుగా చేసుకుంటే వేగాక ముక్క మరీ చిన్నదిగా అవదు.
• బెండకాయ ముక్కలు నూనెలో వేసి హై- ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపితే బెండకాయలలోంచి జిగురు పోతుంది.
• ఈ కూరకి కాస్త నూనె ఉంటేనే రుచి
పర్ఫెక్ట్ బెండకాయ మసాలాకి కొన్ని టిప్స్:
• మసాలాలు నూనెలో వేగి నూనె పైకి తేలాలి, అప్పుడు కూరకి మాంచి రంగూ సువాసన • ఈ కూరలో వేసిన ప్రతీ పదార్ధాన్ని నూనె పైకి తేలేదాకా వేపుకుంటే రుచిగా ఉంటుంది,
• ఈ కూరలో నీళ్ళు వేయకూడదు. కూరంతా నూనెలోనే మగ్గాలి. అవసరమనిపిస్తే మసాలాలు వేపేప్పుడు 1 tbsp నీళ్ళు వేసుకోవచ్చు.
• టొమాటో పేస్ట్ వేసి మసాలాలో కలిపి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేదాకా మగ్గిస్తే మాంచి రంగు వస్తుంది.

డాభా స్టైల్ బెండకాయ మసాలా - రెసిపీ వీడియో
Dhaba style Spicy Okra | Bhindi Masala Curry | How to make Dhaba Style Bhindi Masala
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 250 gms బెండకాయ ముక్కలు
- 5 tbsps నూనె
- 1 tsp జీలకర్ర
- 1/2 tsp ఆవాలు
- 1 cup ఉల్లిపాయ తరుగు (రెండు ఉల్లిపాయలదీ)
- 1 cup టొమాటో పేస్ట్ (రెండు టొమాటోలది)
- 1 tsp అల్లం వెల్లులి ముద్ద
- 1 రెబ్బ కరివేపాకు
- 1 tsp వేయించిన జీలకర్ర పొడి
- 1 tsp ధనియాల పొడి
- 1/2 tsp గరం మసాలా
- 2 పసుపు
- 1 tsp కారం
- ఉప్పు
విధానం
-
2 tbsp నూనె వేడి చేసిన అందులో బెండకాయ ముక్కలు వేసి బెండకాయ ముక్కలు ఎర్రబడే దాకా వేపి తీసుకోండి.
-
అదే మూకుడులో 3 tbsp నూనె వేడి చేసి జీలకర్ర ఆవాలు వేసి వేపుకోవాలి
-
ఉల్లిపాయ సన్నని తరుగు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారుతుండగా కరివేపాకు వేసి వేపుకోండి
-
ఉల్లిపాయలు రంగు మారాక, అల్లం వెల్లులి పేస్ట్ ,మిగిలిన మసాలాలు కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
-
టొమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి
-
నూనె పైకి తేలాక వేపుకున్న బెండకాయ ముక్కలు వేసి 3-4 నిమిషాలు మగ్గిస్తే నూనె పైకి తేలుతుంది అప్పుడు దింపేసుకోండి.
-
ఈ బెండకాయ మసాలా కూర అన్నం రొట్టెలతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
101 comments