ఖర్జూరం కేక్ | బెస్ట్ కేక్ కావాలంటే ఖర్జూరం కేక్ ట్రై చేయండి
పట్టుకుంటే మెత్తగా తింటే వెన్నలా ఉండే కేక్ కోసం చూస్తున్నారా అయితే ఈ ఖర్జూరం కేక్ మీ కోసమే! బెస్ట్ టీ టైమ్ కేక్ రెసిపి వివరంగా స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
కేక్ అంటే అందరికీ ఇష్టమే! అదే కేక్స్ ఇంట్లో చేస్తుంటే అదో సరదా కదా! ఆలాంటి సరదాగా ఉండే సూపర్ ఈసీ కేక్ ఈ ఖర్జూరం కేక్! రుచి ఫ్లేవర్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయ్.
మెత్తగా మృదువుగా ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది ఈ ఖర్జూరం కేక్! ఈ కేక్ ఎగ్లెస్ కాదు. ఎగ్ చేసిన కేక్స్ రుచి రూపం చాలా బెస్ట్గా ఉంటుంది, అయినా ఎందుకు ఏగ్లెస్ అడుగుతున్నారు అని ఫాలోవర్స్ ని అడిగితే కేక్ చాలా మెత్తగా ఉన్నా ఎగ్ స్మెల్ వస్తుంది అని చెప్పారు! కానీ ఈ ఖర్జూరం కేక్ అలా ఉండదు, అస్సలు ఎగ్ వాసన రాదు.
 
 
 
    టిప్స్
ఖర్జూరం: నేను అందరికీ అందుబాటులో ఉండే తీపి పండు ఖర్జూరం వాడాను, మీరు కావాలంటే కిమియా ఖర్జూరం కూడా వాడుకోవచ్చు
వెనీలా ఎసెన్స్: ఎగ్ బీట్ చేసేప్పుడు వెనీలా వేసి బీట్ చేస్తే ఎగ్ స్మెల్ అస్సలు రాదు.
బేకింగ్ :
- 
180 డిగ్రీల దగ్గర 10 నిమిషాలు ప్రీహీట్ చేసి కేక్ టీన్ మధ్య రేక్లో ఉంచి 25 నిమిషాలు బేక్ చేసుకోవాలి. నేను otg ఓవెన్ వాడను. OTG వాడే వారు పైన కింద రాడ్ ఇంకా ఫాన్ ఆన్ చేసి బేక్ చేసుకోవాలి. 
- 
నా ఓవెన్ క్యపాకిటి కి 25 నిమిషాలలో బేక్ అయ్యింది, మీ ఓవెన్ క్యపాసిటీని బట్టి టైమ్ పర్వగవచ్చు తగ్గవచ్చు. కాబట్టి టూత్పిక్ గుచ్చి క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. 
- 
కేక్ బేక్ అయిన తరువాత టీన్లోనే పూర్తిగా చల్లార్చి తరువాత డీ-మౌల్డ్ చేసుకోండి. 
ఖర్జూరం కేక్ | బెస్ట్ కేక్ కావాలంటే ఖర్జూరం కేక్ ట్రై చేయండి - రెసిపీ వీడియో
Dates Cake | How to make simple Dates Cake | Spongy DATES CAKE | Sponge cake recipe
- Prep Time 10 mins 
- Cook Time 25 mins 
- Total Time 35 mins 
- Servings 6 
కావాల్సిన పదార్ధాలు
- 10 - 12 పండు ఖర్జూరం
- 175 ml నీళ్ళు (3/4 cup)
- 1 గుడ్డు
- 75 gm పంచదార (1/3 Cup + 1 tsp)
- 1 tsp వెనీలా ఎసెన్స్
- 3/4 cup మైదా (90 gm)
- 1 tsp బేకింగ్ సోడా
- 75 gm బటర్/ నూనె (1/3 కప్పు)
- 90 ml ఖర్జూరం ఉడికించిన నీళ్ళు
విధానం
- 
          
           
            ఖర్జూరం లో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి, వడకట్టి ఖర్జూరాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఖర్జూరం ఉడికించిన నీళ్ళని పక్కనుంచుకోండి 
           
                      
- 
          
           
            బౌల్లో ఎగ్, పంచదరా, వెనీలా వేసి నురగ నురగా వచ్చేదాకా బీట్ చేసుకోండి. పంచదార కరిగి నురగ నురగా అవ్వాలి 
           
                      
- 
          
           
            జల్లేడలో మైదా, వంట సోడా వేసి జల్లించి, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసి విస్కర్తో బీట్ చేసుకోవాలి. 
           
                      
- 
          
           
            బీట్ అయిన కేక్ పిండిలో ఖర్జూరం ఉడికించుకున్న నీళ్ళు, ఖర్జూరం పేస్ట్ వేసి కట్ & ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. 
           
                      
- 
          
           
            6 అంగుళాల కేక్ టీన్లో బటర్ పూసి మైదా వేసి తట్టి కేక్ పిండి టీన్లో పోసి 3-4 సార్లు తట్టి ప్రీహీట్ చేసిన ఓవెన్లో 180 డిగ్రీల దగ్గర 25 నిమిషాలు బేక్ చేసుకోండి.
           
                      
- 
          
           
            బేక్ అయిన కేక్ని  ఓవెన్ నుండి బయటకి తీసి టీన్లోనే పూర్తిగా చల్లార్చి తరువాత డీ-మౌల్డ్ చేసి ముక్కలుగా చేసుకోండి. 
           
                      
 
 
 రెసిపీ ప్రింట్ చేయడానికి
రెసిపీ ప్రింట్ చేయడానికి 
Leave a comment ×
2 comments