ఏగ్లెస్ టూటీ ఫ్రూటీ కప్ కేక్స్

ఎగ్ లేకుండా చేసే కప్ కేక్స్ కూడా దాదాపుగా ఎగ్ వేసి చేసే కేక్స్ అంత రుచిగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ సామగ్రితో దాదాపుగా ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతో చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ మీకు సరిగ్గా బేకరీ స్టైల్ లో వస్తాయి. చాలా సాఫ్ట్ గా జూసీగా ఉంటాయి.

ఈ కేక్ లో నేను కప్ లేకపోతే ఎలా చేయాలి, ఇంకా కుక్కర్ లో ఎలా చేయాలి లాంటి వివరాలన్నీ వివరంగా ఉంచాను. దీన్ని మీరు కప్స్ లోనే కాదు నచ్చిన మౌల్డ్ లో పోసి కేక్ గా కూడా బేక్ చేసుకోవచ్చు.

గమనిక: (నేను వీడియో లో ఉన్న కొలతలకి డబుల్ చేశాను కొలతలు)

Eggless Tutti Frutti Cup Cakes | Eggless cupcakes | Best Eggless Cake

టిప్స్

బెస్ట్ కేక్ కి కొన్ని టిప్స్:

• పైనాపిల్ ఎసెన్స్ చాలా మాంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కానీ కొద్దిగా వేయాలి. లేని వారు మామూలు వదిలేవచ్చు

కేక్ ఎందుకు పొంగదు?

• కేక్ పిండి కలుపుకోవడానికి ముందు ఓవెన్ ని 180 డిగ్రీస్ దగ్గర 10 నిమిషాలు ప్రీ–హీట్ చేయడం మొదలెడితే పిండి కలుపుకుని రెడీ అయ్యే పాటికి ఓవెన్ పర్ఫెక్ట్ గా ప్రీ హీట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఓవెన్ ప్రీ – హీట్ పూర్తవగానే చల్లారడం మొదలవుతుంది. అందుకే ఓవెన్ ప్రీ-హీట్ అయిపోయింది అని బెల్ మొగగానే కేక్ టీన్ పెట్టేయాలి.

• ఇంకా వాడే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ తాజావి కాకపోయినా కేక్ సరిగా పొంగదు

• బేక్ చేసే మౌల్డ్ చాలా ముఖ్యం. కేక్ బెటర్ మౌల్డ్ కి సగం కంటే పైకి అంటే ¾ భాగమే ఉండాలి. ఎక్కువ పోస్తే బైటికి వచ్చేస్తుంది. తక్కువ పోస్తే పల్చగా వస్తుంది

• మైదా పిండిని ఎప్పుడూ జల్లించింది వాడుకోవాలి • పొడి పిండిని తడిపిండిలో వేశాక ఒకెవైపు కలుపుకోవాలి. ఎక్కువగా కలిపితే వెనిగర్, బేకింగ్ సోడాతో రియాక్ట్ అయి పొంగుతుంది ఆ పొంగు పోతుంది. అప్పుడు కేక్ సరిగా పొంగదు

• బేకింగ్ కి ఎప్పుడూ కప్ కొలతలకంటే మెషరింగ్ స్కేల్ కొలతలతో కచ్చితత్వం ఎక్కువ.

మైదా కి బదులు గోధుమ పిండి వాడుకోవచ్చా?

• వాడుకోవచ్చు కానీ పాలు 2 tbsp ఎక్కువ వేసుకోవాలి

వెనిగర్ కి/ నూనెకి బదులు?

• వెనిగర్ కి బదులు నిమ్మరసం వాడుకోవచ్చు.

• నూనె కి బదులు కరిగించిన బటర్ లేదా నెయ్యి వాడుకోవచ్చు

ఏగ్లెస్ టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ - రెసిపీ వీడియో

Eggless Tutti Frutti Cup Cakes | Eggless cupcakes | Best Eggless Cake

Baking | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Resting Time 20 mins
  • Total Time 45 mins
  • Cupcakes 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup మైదా
  • 1/2 cup పంచదార
  • 1 tsp బేకింగ్ సోడా
  • 1 tsp బేకింగ్ పౌడర్
  • 1 tsp వెనీలా ఎసెన్స్
  • 5 - 6 drops పైనాపిల్ ఎసెన్స్
  • 1/2 cup పాలు
  • 3 tbsps పెరుగు
  • 3 tsps టూటి ఫ్రూటి
  • 1.5 tbsps వెనిగర్
  • 1/4 cup నూనె

విధానం

  1. విస్కర్ తో పంచదార, పెరుగు, నూనె వేసి పంచదార కరిగి క్రీం లా అయ్యేదాకా బాగా బీట్ చేయాలి.
  2. తరువాత వెనీలా, పైనాపిల్ ఎసెన్స్, వెనిగర్ వేసి బీట్ చేసి బౌల్ పైన ఓ జల్లెడలో మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, టూటి ఫ్రూటి వేసి జల్లించాలి, జల్లించగా మిగిలిన టూటి ఫ్రూటి పక్కనుంచండి.
  3. జల్లించిన పిండిని ఒకే వైపు బాగా బీట్ చేసుకోవాలి (రివర్స్ లో అంటే వ్యతిరేకంగా బీట్ చేస్తే లోపల గాలి పోయి కేక్ పొంగదు).
  4. ఆఖరున టూటి ఫ్రూటి వేసి కలిపి కప్స్ లో సగానికి నింపండి.
  5. ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీల దగ్గర 20- 25 నిమిషాలు బెక్ చేసుకుని తీసుకోవాలి.
  6. పూర్తిగా చల్లారాక సర్వ్ చేసుకోవాలి
  7. ఇది కుక్కర్ లో చేసుకోదలిస్తే కుక్కర్ కి ఉండే గ్యాస్ కట్ (రబ్బర్) తీసేసి మూత పెట్టి హై ఫ్లేం మీద 10 నిమిషాలు హీట్ చేసి లోపల ఓ స్టాండ్ పెట్టి దాని మీద ఓ ప్లేట్ ఉంచి కప్స్ పెట్టుకోండి
  8. మూతపెట్టి లో ఫ్లేం మీద 30-40 నిమిషాలు బెక్ చేసుకోండి.
  9. మీ దగ్గర కప్స్ లేకపోతే పేపర్ టీ కప్స్ లో చేసుకోవచ్చు, లేదా పిండి మామూలు కేక్ మౌల్డ్ లో పోసి కూడా బేక్ చేసుకోవచ్చు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    Sujatha
    Sir mee black forest cake recipe utube lo chusanu but website lo ledu
Eggless Tutti Frutti Cup Cakes | Eggless cupcakes | Best Eggless Cake