ఎగ్లేస్ రవ్వ కేక్

Baking
5.0 AVERAGE
2 Comments

బేకింగ్ అంటే ఓ సైన్స్. ఏది ఏమాత్రం ఎక్కువగా వేసినా దాని రుచి మరోలా ఉంటుంది. సైన్స్ అంటే రాకెట్ సైన్స్ ఏమి కాదు. సిమ్పుల్ సైన్స్.

కేక్ అంటే అందరికి ఇష్టమే కానీ చేయాలంటే కంగారు, అన్నీ ఫాలో అయినా కొన్ని సార్లు సరిగా రాదు. అది ఎందుకు రాదో, వాటి కారణాలేంటో వివరంగా కింద టిప్స్ లో ఉంది చుడండి.

ఎప్పుడు కేక్స్ చేసినా పక్కా కొలతలు అవసరం, బేకింగ్ కి కప్స్ కొలతల కంటే, గ్రాముల కొలత పర్ఫెక్ట్ గా వస్తుంది. కానీ ఈ రవ్వ కేక్ కి ఏ కప్స్ అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉండే కప్స్ తోనే కొలిచి చేసుకోవచ్చు.

ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే ఈ కేక్ కనీసం 4-5 రోజులు నిలవుంటుంది.

Eggless Semolina Cake | Eggless Rava Cake | How to make Rava Cake

టిప్స్

  1. రవ్వ అంటే బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ

  2. రవ్వ ని ఏ కొలత తో తీసుకున్నారో అదే కప్ తో మిగిలినవి కోలుచుకోండి

  3. కేక్ కోసం వాడే పాలు పెరుగు లేదా ఇతర పదార్ధాలన్నీ రూమ్-టెంపరేచర్ లోనే ఉండాలి. ఫ్రిజ్ లోనివి పనికిరావు.

  4. నేను కేక్ కోసం, రిఫైండ్ నూనె వాడను, మీరు కావాలంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు. సెనగ నూనె ఇలాంటివి బాగుండవు

  5. రవ్వ పోసాక గడ్డలు లేకుండా కలిపెసుకోవాలి, లేదంటే గడ్డలుగా మిగిలిపోతుంది

  6. పంచదార రవ్వలో కరగడం కాస్త కష్టం అందుకే పంచదార పొడి వేసుకోండి. లేదా బ్రేక్ఫాస్ట్ షుగర్ దొరుకుతుంది అది వాడుకోండి

  7. పంచదార పోసాక కచ్చితంగా రవ్వలో కలిసి కరిగిపోవాలి అందాక కలుపుకోవాలి

  8. నేను కప్ పంచదార వాడను.1.1/4 కప్పుల రవ్వకి కప్ పంచదార బాలన్స్ గా ఉంటుంది. కాస్త తీపి తినాలనుకుంటే 1/4 కప్ పంచదార ఎక్కువ వేసుకోండి.

  9. ఇందులో నేను పాల పొడి వాడను, పాల పొడి వేయడం వల్ల కేక్ చాలా రుచిగా ఉంటుంది. నచ్చని వారు వదిలేయండి

  10. పిండి జల్లించాక కట్&ఫోల్డ్ మెథడ్ లోనే పిండిని కలపాలి మాములుగా కలిపేస్తే కేక్ లోపల ఉండే గాలి పోయి కేక్ పొంగదు

  11. కేక్ లో నేను వెనీలా ఎసెన్స్ వేసాను, మీరు కావాలంటే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు

  12. డ్రై ఫ్రూట్స్ ఏవి కేక్లో వేసినా కొద్దిగా మైదా పిండిలో కలిపి వేసుకోవాలి లేదంటే అడుగుకి వెళ్ళిపోతాయ్, నేను టూటి ఫ్రూటీ వాడాను, మీరు కావాలంటే మరింకేదైనా డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు.

కేక్ బేక్ చేసే టిన్ ఎలా ఉండాలి

  1. కేక్ ఓవెన్ లో చేసే వారు మైక్రో సేఫ్ మౌల్డ్ లు దొరుకుతాయ్, అవే వాడాలి. ఆ గిన్నెలు కుక్కర్ లో కూడా వాడుకోవచ్చు, సిలికాన్ వి కుక్కర్ లో పనికి రావు.

  2. బేకింగ్కి తీసుకునే గిన్నె కేక్ పిండి పోస్తే మౌల్ద్ లో 3/4 భాగం కంటే తక్కువుండాలి, సగం కంటే ఎక్కువుండాలి. ఎక్కువగా ఉంటె కేక్ పొంగిపోతుంది, తరువాత మధ్యలో దిగిపోతుంది, తక్కువుంటే పల్చగా అయిపోయి మధ్యలో దిగిపోతుంది

  3. బేకింగ్ చేసే ముందు బటర్ లేదా ఆయిల్ తో మౌల్ద్ కి పూయాలి లేదంటే ఈ రవ్వ కేక్ సులభంగా రాదు. లేదా బటర్ పేపర్ కూడా వాడుకోవచ్చు

ఎలా బెక్ చేయాలి:

  1. కుక్కర్ లేదా మూకుడులో బెక్ చేసే వారు ముందు పొయ్యి మీద ఖాళీ పాత్ర ఉంచి దాని మీద మూత పెట్టి హై ఫ్లేం మీద 10 నిమిషాలు వేడి చేయండి. ఇది ప్రీ హీటింగ్.

  2. తీసుకున్న పాత్రలోంచి వేడి బయటకి పోకుండా ఉండేలాంటి మూత ఉండాలి. లేదంటే కేక్ సరిగా బెక్ అవ్వదు. ఎంత సేపు బెక్ చేసినా కేక్లో కొంత భాగం బేక్ అవుతుంది ఇంకొంత మాడిపోతుంది

  3. 10 నిమిషాల తరువాత మూత తీసి లోపల స్టాండ్ పెట్టి కేక్ మౌల్ద్ ఉంచి 45 నిమిషాలు లేదా టూత్ పిక్ క్లీన్ గా వచ్చేదాకా లో-ఫ్లేం మీద బెక్ చేసుకోవాలి.

  4. ఓవెన్ లో అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాలు ప్రేహీట్ చేసి మిడిల్ రాక్ లో మౌల్ద్ ఉంచి 180 డిగ్రీల దగ్గర 40 నిమిషాలు లేదా టూత్ పిక్ క్లీన్ గా వచ్చేదాకా బేక్ చేసుకోవాలి.

ఎగ్లేస్ రవ్వ కేక్ - రెసిపీ వీడియో

Eggless Semolina Cake | Eggless Rava Cake | How to make Rava Cake

Baking | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 40 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr 15 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup పెరుగు
  • 1/2 cup పాలు
  • 1 1/4 cup బొంబాయ్ రవ్వ
  • 1 cup పంచదార
  • 1/2 cup మైదా
  • 2 tbsp పాల పొడి
  • 1/2 tsp బేకింగ్ పౌడర్
  • 1/2 tsp బేకింగ్ సోడా
  • 1/8 tsp ఉప్పు
  • 1/4 cup టూటి ఫ్రూటి
  • 1 tsp వెనీలా ఎసెన్స్

విధానం

  1. 7 ఇంచెస్ కేక్ మౌల్డ్ లో నూనె పూసి కొంచెం మైదా వేసి కోట్ చేసి పక్కనుంచాలి.
  2. మిక్సింగ్ బౌల్ లో నూనె పెరుగు పాలు వేసి బాగా కలిసేదాకా కలుపుకోవాలి.
  3. బొంబాయ్ రవ్వ వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.
  4. రవ్వ కలిసాక పంచదార వేసి కరిగేదాకా కలుపుకోవాలి.
  5. రవ్వ పైన జల్లెడ పెట్టి మైదా, పాల పొడి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉప్పు వేసి జల్లించి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నిదానంగా కలుపుకోవాలి
  6. వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి.
  7. ఆఖరున టూటి ఫ్రూటి లో కొంచెం మైదా వేసి కలిపి పిండి లో నిదానంగా కలుపుకోవాలి.
  8. కలుపుకున్న పిండిని కేక్ టిన్ లో పోసి ప్రీ హీట్ చేసిన కుక్కర్ లేదా ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో పెట్టి 40 నిమిషాలు లేదా టూత్ పిక్ గుచ్చితే క్లీన్ గా వచ్చేదాకా బేక్ చేసుకోవాలి.
  9. టూత్ పిక్ క్లీన్ గా వస్తే కేక్ ని బయటకి తీసి 10 నిమిషాలు చల్లార్చి తరువాత క్లాత్ కప్పి 30 నిమిషాలు వదిలేయాలి, ఆ తరువాత కట్ చేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

Eggless Semolina Cake | Eggless Rava Cake | How to make Rava Cake