గార్లిక్ బ్రెడ్ | ఇంట్లోనే పర్ఫెక్ట్ గార్లిక్ బ్రెడ్ ఓవెన్తో ఇంకా ఓవెన్ లేకుండా గాస్ మీద

Snacks
5.0 AVERAGE
2 Comments

ఇంట్లోనే పర్ఫెక్ట్ గార్లిక్ బ్రెడ్ ఓవెన్తో ఇంకా ఓవెన్ లేకుండా గాస్ మీద చేయనుకుంటున్నారా అయితే స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి, బెస్ట్ గార్లిక్ బ్రెడ్ ఎంజాయ్ చేయండి.

“గార్లిక్ బ్రెడ్” అందరూ ఎంతో ఇష్టంగా తినే స్టార్టర్ లేదా స్నాక్ అనవచ్చు. గార్లిక్ బ్రెడ్ ఇప్పుడు దాదాపుగా ప్రతీ బేకరీలో దొరికేస్తుంది, ఒక్కవరిది ఒక్కో తీరు. కానీ, డొమినోస్ వారి గార్లిక్ బ్రెడ్ థీ బెస్ట్ అనిపిస్తుంది నాకు.

నేను మీకు ఈ రెసిపీ డొమినోస్ స్టైల్లోనే చేస్తున్నా! పర్ఫెక్ట్ గార్లిక్ బ్రెడ్ రెసిపీ కోసం నేను చాలా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాను, ఆ తరువాత టెక్నిక్ తెలుసుకున్నా.

హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్ జరిగినప్పుడు అక్కడ ఇటాలియన్ చెఫ్ని నా గార్లిక్ బ్రెడ్ బెస్ట్గా రాకపోవడానికి కారణాలు తెలుసుకున్నాను. తన టిప్స్తో మనకి దొరికే పదార్ధాలతో చివరికి ఓవెన్తో ఇంకా గాస్ మీద కూడా బెస్ట్గా ఎలా చేవచ్చో చెలుసుకున్నా, ఆ రెసిపీనే మీకు చెప్తున్న. నా స్టెప్స్ టిప్స్ పాటిస్తే బెస్ట్ గార్లిక్ బ్రెడ్ వచ్చి తీరుతుంది.

Garlic Bread | Homemade Garlic Bread | How to make Garlic Bread without Oven

టిప్స్

ఈస్ట్: ఈస్ట్ వేడి నీళ్ళలో వేశాక పొంగలేదంటే ఈస్ట్ పనిచేయట్లేదు అని గుర్తు. కాబట్టి కొత్త ఈస్ట్ వాడాలి.

గార్లిక్ పౌడర్ : గార్లిక్ పౌడర్ ఇచ్చే సువాసన పచ్చి వెల్లులి ఇవ్వదు. ఈ రెసిపీకి గార్లిక్ పౌడర్ ఉండి తీరాలి, అప్పుడే అసలైన రుచిని ఆస్వాదించగలరు.

పిండి:ఈస్ట్ వేసిన పిండిని పగుళ్లు లేని మెత్తని ముద్దగా అయ్యేదాకా బాగా వత్తుకోవాలి. పర్ఫెక్ట్ పిండి ముద్ద అంటే పిండి వత్తాక చిన్న పిండి ముద్దతీసి లాగితే చీరగని పలుచని తెరలా సాగాలి అది పర్ఫెక్ట్ పిండిముద్ద అని గుర్తు. దీన్నే విండో టెస్ట్ అంటారు.

పిండి రెస్టింగ్: వత్తుకున్న పిండి డబుల్ అవ్వడం అనేది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. చలికాలంలో కొద్దిగా ఎక్కువ టైమ్ పడుతుంది. వేసవిలో అయితే గంటలోపే పొంగిపోతుంది. పిండిని ఎక్కువసేపు ప్రూఫింగ్ కోసం వదిలేస్తే, నీరు వదిలి సరిగా షేప్ రాదు బ్రెడ్.

కార్న్ మీల్: పిండి ముద్దని మొక్కజొన్న రవ్వ చల్లి వత్తుకుంటేనే గార్లిక్ బ్రెడ్ క్రిస్పీగా వస్తుంది, మొక్క జొన్న రవ్వ లేదంటే బొంబాయ్ రవ్వ అయినా వాడుకోండి.

గాస్ మీద:

  1. ముకుడు మీద మూత పెట్టి పెద్ద మంట మీద 15 నిమిషాలు వదిలేయాలి, తరువాత లోపల ఒక స్టాండ్ పెట్టి దాని మీద గార్లిక్ బ్రెడ్ గిన్నె ఉంచి వేడి బయటకి పోకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 30 నిమిషాలు లేదా బంగారు రంగు వచ్చేదాకా బేక్ చేసుకోవాలి.
Garlic Bread | Homemade Garlic Bread | How to make Garlic Bread without Oven

గార్లిక్ బ్రెడ్ | ఇంట్లోనే పర్ఫెక్ట్ గార్లిక్ బ్రెడ్ ఓవెన్తో ఇంకా ఓవెన్ లేకుండా గాస్ మీద - రెసిపీ వీడియో

Garlic Bread | Homemade Garlic Bread | How to make Garlic Bread without Oven

Snacks | vegetarian
  • Prep Time 30 mins
  • Cook Time 25 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 55 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 250 gm మైదా
  • 1 tbsp పాల పిండి
  • 1 tsp గార్లిక్ పౌడర్
  • 1 tsp ఆరిగానో
  • ఉప్పు
  • 1 tbsp వెల్లులి తరుగు
  • 1 tsp బటర్
  • 1 tsp నూనె
  • 85 ml వేడి నీళ్ళు
  • 1 tsp పంచదార
  • 1 tbsp యాక్టివ్ ఈస్ట్ (7 gm)
  • 1/4 tsp మైదా
  • 1/4 cup కార్న్ మీల్ / బొంబాయ్ రవ్వ
  • బ్రెడ్ లోపల పూయడానికి
  • 1 tbsp బటర్
  • 1/2 tsp ఒరేగానో
  • 1/2 tsp గార్లిక్ పౌడర్
  • 1/2 tsp చిల్లీ ఫ్లేక్స్
  • బ్రెడ్ మీద పూయడానికి
  • 1 tbsp బటర్
  • 1/8 tsp చిల్లీ ఫ్లేక్స్
  • 1/8 tsp ఒరీగానో
  • 1/8 tsp గార్లిక్ పౌడర్

విధానం

  1. గోరువెచ్చని నీళ్ళలో పంచదార వేసి కరిగించి అందులో యాక్టివ్ ఈస్ట్, మైదా వేసి కలిపి 5 నిమిషాలు వదిలేస్తే పొంగుతుంది.
  2. బ్రెడ్ కోసం ఉంచిన మిగిలిన పదార్ధాలన్నీ వేసి కలిపి పొంగిన ఈస్ట్ నీళ్ళు పోసి బాగా కలిపి 7-8 నిమిషాలు బాగా వత్తుకోవాలి. 5 నిమిషాల తరువాత బటర్ నూనె వేసి బాగా వత్తుకోవాలి
  3. 8 నిమిషాల తరువాత పిండి ముద్దని లాగితే చిరుగని పలుచని తెరలా సాగాలి. అలా సాగాకా నునుపైన ముద్దలా చేసుకోవాలి
  4. నూనె పూసిన గిన్నెలో పిండి ముద్దని ఉంచి గుడ్డ కప్పి డబుల్ అవ్వనివ్వాలి.
  5. డబుల్ అయ్యాక పంచ చేసి 3 భాగాలుగా చేసుకోవాలి. మొక్కజొన్నరవ్వ చల్లి పిండి ముద్దని కాస్త మందంగా వత్తుకోవాలి.
  6. వత్తుకున్న పిండి మీద బటర్, గార్లిక్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో వేసి పూసి మధ్యకి మడిచి అంచులని లోపలి మడిచి నొక్కాలి అప్పుడు బేక్ అయ్యాక పగలదు
  7. బటర్ రాసిన ట్రేలో గార్లిక్ బ్రెడ్ ఉంచి క్లాత్ కప్పి 30 నిమిషాలు వదిలేస్తే పొంగుతుంది. బటర్ లో బ్రెడ్ పైన పూయడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పొంగిన బ్రెడ్ మీద బటర్ పూసి పీజా కటర్తో గాట్లు పెట్టుకోవాలి
  8. 220 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసిన ఓవెన్ మధ్య రాక్లో పెట్టి 220 డిగ్రీల దగ్గర రెండు రాడ్లు ఆయన చేసి 20-25 నిమిషాలు బేక్ చేసుకోవాలి, లేదా పైన బంగారు రంగు వచ్చేదాకా బేక్ చేసుకోవాలి
  9. గాస్ మీద అయితే హై-హీట్ మీద ప్రీహీట్ చేసి 30 నిమిషాలు 30-35 నిమిషాలు, లేదా బంగారు రంగు వచ్చేదాక బేక్ చేసుకోవాలి.
  10. బంగారు రంగులోకి బేక్ చేసిన గార్లిక్ బ్రెడ్ మీద బటర్ పూసి ముక్కలుగా కట్ చేసుకుని మయోనైస్ లేదా కేట్చాప్తో ఎంజాయ్ చేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • H
    Hareesha
    Recipe Rating:
    Thank you so much Teja garu for detail explaination 😊
  • S
    Savita Krishnan
    Hello, Garlic breads are looking so yummy.planning to make soon. How much instant yeast is to be used instead of active dry yeast? Could I use bread machine to prepare the dough. Thanks Savita
Garlic Bread | Homemade Garlic Bread | How to make Garlic Bread without Oven