Snacks
5.0 AVERAGE
4 Comments

“కారా బూంది” మాంచి టైం పాస్ స్నాక్, చాలా ఈజీ, జస్ట్ 5 నిమిషాలు చాలు అంతకంటే టైం కూడా పట్టదు. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వస్తుంది.

చాలా మంది చేస్తూనే ఉంటారు వారికి అంత క్రిస్పీగా చక్కటి ముత్యాల్లాంటి షేప్ రావు బూందీ ! ఏంటో, మనకు రావు అనుకుని వదిలేస్తుంటారు, షాప్ నుంచి తెచ్చిన బూందిని చూసి. కాని, నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ టెస్ట్, షేప్ గారంటీ!

ఓ సారి చేసి డబ్బాలో ఉంచుకుంటే కనీసం 15 రోజులు నిలవ ఉంటాయి. ఇవి వేడి వేడి అన్నం లో నెయ్యేసుకుని పిడికిడు బూంది పోసుకుని కలుపుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా పప్పు, పప్పుచారు, పెరుగన్నం లోకి చెప్పాలా ప్రేత్యేకంగా, అదుర్స్ అంతే!!! నేనైతే కమ్మని చల్లని ఫ్రిజ్ లోని పెరుగులో బూందీ వేసుకుని తింటుంటా ట్రై చేయండి చాలా నచ్చుతుంది.

Kara Boondi | How to make Kaara Boondi at home

టిప్స్

• బూందీ దూయడానికి ముందు సెనగపిండిని జల్లించుకుంటే గడ్డలు లేకుండా ఉంటుంది.

• సెనగపిండిలో వేసే కొద్ది బియ్యం పిండి బూందీ ని కరకరలాడేట్టు చేస్తుంది

• బూందీ వేపే నూనె ఎప్పుడూ మాంచి సెగ మీద ఉండాలి. అప్పుడే దూసియం బూందీ నూనెలో పడి చుయ్ మంటూ పైకి తేలి ఎర్రగా గుల్లగా వేగుతాయ్, లేదంటే చతికలపడతాయ
• బూందీ వేపే మూకుడు అడుగు లోతుగా ఉంటే ముత్యాల్లాంటి షేప్ వస్తాయి. ఇంకా బూందీ దుసాక, బూందీ గరిటని బోర్లించి శెనగపిండి లో ఉంచితే ఎక్స్ట్రా పిండి కిందికి జారుతుంది

• బూందీ దూసేప్పుడు పిండి పోసి బూందీ గరిటని తడితే సరైన షేప్లో బూందీ రాదు. అందుకే ఆటలు పోసినట్లు బూందీ గరిట మీద పిండి పోసి తిప్పితే బూందీ ముత్యాల్లా జారుతుంది.

బూందీ బంగారు రంగులోకి వేపుకోడానికి :

• బూందీ ఒక వాయి అయ్యాక నూనె వేడి ని బట్టి కాసేపు ఆగి నూనెని బాగా వేడి చేసి బూందీ దూసుకోవాలి . లేదా నూనె బాగా వేడిగా ఉంటే మంట పూర్తిగా తగ్గించి నూనె వేడి తగ్గించి బూందీ దూసి హై ఫ్లేమ్ మీద పెట్టి వేపుకోవాలి.

• బూందీ ఎర్రగా వేగుతోంది అంటే చల్లారేపాటికి నల్లగా అవుతాయ్ . బంగారు రంగులోకి రాగానే తీసి బుట్టలో వేస్తే గాలికి చల్లారి కరకరలాడతాయ్

బూందీ పిండి నూనెలో ముద్దలుగా ఎందుకు పడుతుంది?

• బూందీ నూనెలో పడ్డాక ముద్దలుగా పడుతుంది అంటే పిండి, గట్టిగా అయ్యింది అర్ధం. అప్పుడు ఇంకొన్ని నీళ్ళు కలుపుకుని పలుచన చేసుకోవాలి

చిన్న చిన్న మార్పులు:

• నేను వెల్లూలీ వాడలేదు నచ్చితే కారం తో పాటు వెల్లులి దంచి వేసుకోవచ్చు

• వేరుశెనగపప్పు కి బదులు జీడిపప్పు వాడుకోవచ్చు

• కరివేపాకు నేను నూనెలో వేపాను, మీకు కరివేపాకు పరిమళం కావాలంటే బూందీ వేపి తీసీ తీయగానే కరివేపాకు వేడి బూందీ లో వేసి కలపాలి, అప్పుడు బూందీ వేడికి కరివేపాకు కాస్త మగ్గుతుంది. పూర్తిగా వేగదు, అప్పుడు కరివేపాకు సువాసన బాగా తెలుస్తుంది.

• ధనియాలు, జీలకర్ర పొడి నచ్చకపోతే వదిలేయవచ్చు

కారా బూంది - రెసిపీ వీడియో

Kara Boondi | How to make Kaara Boondi at home

Snacks | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 10

కావాల్సిన పదార్ధాలు

  • 200 gms సెనగపిండి
  • 2 tbsps బియ్యం పిండి
  • 1/2 cup వేరు సెనగపప్పు/జీడిపప్పు
  • 2 కరివేపాకు రెబ్బలు
  • నూనె (వేపడానికి)
  • 1/2 tsp కారం
  • ఉప్పు
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • నీళ్ళు తగినన్ని

విధానం

  1. సెనగపిండి, బియ్యం పిండి, నీళ్ళు పోసి పిండిని గడ్డలు లేకుండా గరిట జారుగా కలుపుకోవాలి.
  2. హై ఫ్లేం మీద నూనె ని మసల కాగనివ్వండి.
  3. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బూంది దూసే గరిట మీద గరిటడు పిండి పోసి, నిదానంగా అట్లు పోసినట్లు పిండిని గరిటతో తిప్పితే , అప్పుడు చక్కగా బూంది గరిట లోంచి కిందికి జారుతుంది.
  4. నూనెలో పడ్డ బూందిని కేవలం హై-ఫ్లేం మీద మాత్రమే వేపుకోవాలి, బూంది ఎర్రగా వేగాక తీసి పక్కనుంచుకోండి.
  5. ఇప్పుడు అదే నూనె లో వేరుసెనగపప్పు, కరివేపాకు వేసి వేపుకుని బూందిలో వేసుకోండి.
  6. తరువాత సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేడి మీద బూందికి బాగా పట్టించండి.
  7. పూర్తిగా చల్లారాక బూందిని డబ్బాలో దాచుకుంటే కనీసం 15 రోజులు నిలవుంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

  • K
    Kalyani Attuluri
    Recipe Rating:
    thank you vismai.... simple and tasty snack recipe....
  • P
    Padmapadmapv
    Recipe Rating:
    Thankyou విస్మయిfood.❤️,రేపు try చేస్తాం!.మీరు చెప్పినట్టు. ఇంతవరకు సరిగ్గా రానేలేదు. తినాలని ఉన్న!
  • H
    Hari
    Recipe Rating:
    Super and simple recipes thank you
Kara Boondi | How to make Kara Boondi at home