కొబ్బరి గారెలు| నిమిషాల్లో తయారయ్యే బెస్ట్ స్నాక్

Snacks
5.0 AVERAGE
2 Comments

తెలంగాణ సంప్రదాయ స్నాక్ రెసిపీ కొబ్బరి గారెలు,అందరికీ నచ్చేస్తాయ్. సాయంత్రాలు బెస్ట్ స్నాక్. తెలంగాణా స్టైల్ కొబ్బరి గారెలు రెసిపీ టిప్స్ ఇంకా వీడియోతో వివరంగా ఉంది చూడండి.

“కొబ్బరి గారెలు” ఇది తెలంగాణా స్పెషల్ రెసిపీ. నిమిషాల్లో తయారయ్యే సులువైన స్నాక్. ఆంధ్రులు చెక్కలు అని తమిళులు తట్టాయి అని అంటారు. దక్షిణ భారత దేశం అంతటా ఈ చెక్కలు రెసిపీ ఉంది. కానీ ఒక్కొరూ ఒక్కో తీరులో చేస్తారు.

తెలంగాణా స్టైల్ కొబ్బరి గారెలు రెసిపీ ఆంధ్రుల చెక్కలు, లేదా తెలంగాణాలోనే పల్లీలు వేసి చెక్కలు మాదిరి చేసే గారెలు (చెక్కలు )లా ఇవి నిలవ ఉండవు. ఇంకా ఇవి మెత్తగా ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ గా పర్ఫెక్ట్.

Telangana Special Coconut Vada | Kobbari garelu| Kobbari Chekkalu  | Coconut Thattai | Quick Snack

టిప్స్

• ఈ గారెలు గట్టిగా ఉండవు, బైట కరకరలాడుతూ లోపల మెత్తగా కాస్త ఉబ్బి ఉంటాయ్. వేడి చల్లారుతున్న కొద్దీ మెత్తగా అవుతాయ్. 2-3 రోజులు నిలవుంటాయ్.

• పిండి గట్టిగా ఉండాలి, అప్పుడు నూనె తక్కువగా పీలుస్తాయ్. లేదంటే నూనె లాగేస్తాయ్

Telangana Special Coconut Vada | Kobbari garelu| Kobbari Chekkalu  | Coconut Thattai | Quick Snack

కొబ్బరి గారెలు| నిమిషాల్లో తయారయ్యే బెస్ట్ స్నాక్ - రెసిపీ వీడియో

Telangana Special Coconut Vada | Kobbari garelu| Kobbari Chekkalu | Coconut Thattai | Quick Snack

Snacks | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 20 mins
  • Total Time 30 mins
  • Servings 25

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం పిండి
  • 1/2 cup పచ్చి కొబ్బరి తురుము
  • 1/2 ఇంచ్ అల్లం
  • 1 tsp జీలకర్ర
  • 4 పచ్చిమిర్చి
  • సాల్ట్
  • వేడి నీళ్ళు తగినన్ని
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. మిక్సీ లో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి మెత్తని పేస్టు చేసుకోండి.
  2. ¾ నీళ్ళని మరిగించండి.
  3. బియ్యం పిండి లో కొబ్బరి తురుము, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్దా వేసి బాగా కలుపుకోవాలి.
  4. వేడి నీళ్ళు కొద్దికొద్దిగా చేర్చుకుంటూ ముందు చెంచా తో కలుపుకుని ఆ తరువాత చేత్తో గట్టిగా పూరి పిండిలా పిండిని కలుపుకోవాలి.
  5. పోలిథిన్ షీట్ మీద 2-3 బొట్లు నూనె వేసి నూనెతో తడి చేసుకున్న చేత్తో పిండి ముద్దని చెక్కల మాదిరి వత్తుకోవాలి, ఇది కావాలంటే నూనె రాసిన పాలిథిన్ షీట్ పెట్టి పూరి ప్రెస్ లో కూడా వత్తుకోవచ్చు.
  6. వత్తుకున్న వీటిని వేడి వేడి నూనె లో వేసి ఎర్రగా వేపుకుని తీసి పక్కనుంచుకోండి.
  7. ఇవి కనీసం 2-3 రోజులు నిలవుంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • V
    Varalakshmi
    Recipe Rating:
    Super
  • R
    Ramisetty varalakshmi
    Recipe Rating:
    Meeru chese Vanni chala baguntai nenu chala try chesanu and fast ga cheptaru sir. Ekkuvaga nonveg try chestanu. Thank you
Telangana Special Coconut Vada | Kobbari garelu| Kobbari Chekkalu  | Coconut Thattai | Quick Snack