కోడిగుడ్డు జున్ను ముక్కాల కూర
చూడ్డానికి తినడానికి పనీర్లా ఉండే ఆంధ్రా స్టైల్ కోడిగుడ్డు జున్ను ముక్కాల కూర ఒక్కటి ఉన్నా చాలు ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది భోజనంలో.
గుడ్డుని స్టీమ్ మీద ఉడికించి పనీర్ ముక్కల్లా కోసి చిక్కని టమాటో ఉల్లిపాయ గ్రేవీలో వేసి చేసే కోడి గుడ్డు జున్ను ముక్కాల కూర ఆంధ్రా స్పెషల్ రెసిపీ. నిజానికి ఆంధ్రా తీరులో ఇలాంటి గ్రేవీ ఉండదు, కానీ కోడిగుడ్డుని జున్నులా స్టీమ్ చేసి మరో తీరులో చేస్తారు.
రెసిపీ చాలా సింపుల్, వేడిగా అన్నంతో, చపాతీ, రోటీ, పూరి ఇంకా పులావ్తో ఎంతో రుచిగా ఉంటుంది. కొన్ని టిప్స్ తెలుసుకుంటే చాలు అందరికీ నచ్చే మెచ్చే తీరులో ఎప్పుడు చేయగలుగుతారు.

టిప్స్
గుడ్డు:
-
గుడ్డుని బాగా గిలకొట్టి కనీసం 12 నిమిషాలు స్టీమ్ చేస్తే చాలు. ఎక్కువగా స్టీమ్ చేస్తే గుడ్డు గట్టిగా రబ్బరులా అయిపోతుంది.
-
గిలకొట్టిన గుడ్డుని లోతుగా పొడవుగా ఉన్న గ్లాస్లో లేదా కేక్ టిన్లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు.
గ్రేవీ:
-
చిక్కని కమ్మని గ్రేవీ కోసం గ్రేవీ నిదానంగా మరగాలి, అప్పుడే మసాలా పరిమళం రుచి అంతా గ్రేవీలోకి దిగుతుంది. లేదంటే అంత రుచిగా ఉండదు గ్రేవీ
-
గ్రీవ్ చిక్కబడ్డాక గుడ్డు ముక్కలు వేసి మూతపెట్టి 7-8 నిమిషాలకంటే ఎక్కువసేపు ఉడికించకండి. గుడ్డు వేసాక ఎక్కువ సేపు ఉడికితే గ్రేవీలోని నీరు గుడ్డు లాగేసి చిక్కుబడిపోతుంది.
-
ఏ కారణం చేతనైన గ్రేవీ చిక్కబడితే కాసిని వేడి నీళ్లు పోసి పలుచన చేసుకోవచ్చు.
గసగసాలు:
గ్రేవీ కోసం వేసిన గసగసాలు గ్రేవీకి కమ్మని రుచి చిక్కదనాన్ని ఇస్తుంది. కొన్ని దేశాల్లో గసగసాలు దొరకవు అలాంటప్పుడు జీడిపప్పు వాడుకోవచ్చు. కానీ ఉంటె గసాలే వాడడండి, గసాల రుచి గసాలదే! ఆ రుచి జీడిపప్పుతో రాదు.
కోడిగుడ్డు జున్ను ముక్కాల కూర - రెసిపీ వీడియో
Egg Cubes Masala | Spicy Egg Junnu Curry
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
కోడి గుడ్డు జున్ను ముక్కాల కోసం
- 6 గుడ్లు
- ఉప్పు - కొద్దిగా
- 1 tsp మిరియాల పొడి
- 1/4 tsp పసుపు
-
గ్రేవీ కోసం:
- 3 tbsp నూనె
- 1/4 tsp మిరియాలు
- 1 tsp జీలకర్ర
- 3 యాలకలు
- 7 - 8 ఎండు మిర్చి
- 1/2 ఇంచ్ దాల్చిన చెక్క
- 3 లవంగాలు
- 1 tbsp గసగసాలు
- 1 tbsp ధనియాలు
- 1 Inch అల్లం
- 4 - 5 వెల్లులి
- 1 రెబ్బ కరివేపాకు
- పెద్ద ఉల్లిపాయ చీలికలు
- 3 పచ్చిమిర్చి
- 2 టమాటోలు
- ఉప్పు
- 1/4 tsp పసుపు
- 1/2 cup పెరుగు
- నీళ్లు - మెత్తని పేస్ట్ చేసుకోడానికి
-
కూర కోసం
- 3 tbsp నూనె
- 1 రెబ్బ కరివేపాకు
- 300 ml నీళ్లు
- 2 tbsp కొత్తిమీర తరుగు
విధానం
-
గుడ్డుని పసుపు ఉప్పు మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి.
-
నూనె రాసిన గ్లాస్లో ముప్పావు భాగం వరకు నింపి మరుగుతున్న నీళ్లలో గ్లాస్ ఉంచి మూతపెట్టి 12 నిమిషాలు స్టీమ్ చేసి తీసి చల్లార్చాలి.
-
ఆవిరి మీద ఉడుకుతున్న గుడ్డు పైకి పొంగుతుంది, చల్లారాక పొంగు దిగుతుంది. చల్లారిన గుడ్డు గ్లాస్ అంచులని కత్తితో వదులు చేసి తీయండి.
-
తరువాత పనీర్ ముక్కల మాదిరి కోసుకోండి.
-
పాన్లో గ్రేవీ కిశోరం ఉంచిన మసాలా దినుసులన్నీ నూనె వేసి మాంచి సువాసన వచ్చే దాకా వేపుకోవాలి.
-
వేగిన మసాలా దినుసుల్లో ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి.
-
మెత్తబడిన ఉల్లి ముక్కల్లో గసగసాలు వేసి చిట్లనివ్వాలి. చిట్లిన గసాల్లో టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి మూతపెట్టి మెత్తగా మగ్గనివ్వాలి.
-
మగ్గిన టమాటోలని పెరుగు నీళ్లు మిక్సీ జార్లో వేసి వెన్నలాంటి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
-
పాన్లో నూనె వేడి చేసి అందులో కరివేపాకు వేసి చిట్లనివ్వాలి తరువాత గ్రేవీ, నీళ్లు పోసి మూతపెట్టి 15 నిమిషాలు మరగనివ్వాలి.
-
మరుగుతున్న గ్రేవీలో గుడ్డు ముక్కలు కొత్తిమీర తరుగు చల్లి మూతపెట్టి ఎనిమిది నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.

Leave a comment ×