ఎగ్ మసాలా ఫ్రై | తక్కువ టైమ్లో చేసకునే బెస్ట్ ఎగ్ కర్రీ | సింపుల్ ఎగ్ ఫ్రై
తక్కువ టైమ్లో చేసకునే బెస్ట్ ఎగ్ కర్రీ కోయం చూస్తున్నారా? అయితే గుంటూర్ ఎగ్ మసాలా ఫ్రై చేయండి. ఈ సింపుల్ ఎగ్ ఫ్రై అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
ఎగ్ ఫ్రై రెసిపీ చాలా తీరుల్లో చేస్తారు. కానీ గుంటూర్ ప్రాంతంలో ఎక్కువగా చేసే ఈ గుడ్డు వేపుడు నాకు చాలా ఇష్టం. ఘుమఘుమలాడే మసాలాతో తిన్న కొద్దీ తినిపించేస్తుంది.

టిప్స్
గసగసాలు:ఈ రెసిపీకి గసగసాలు ప్రేత్యేకమైన రుచినిస్తుంది. లేని వారు జీడిపప్పు వేసుకోవచ్చు. కానీ గసగసాలు ప్రేత్యేకమైన రుచి అని అర్ధం చేసుకోండి.
ఎగ్ మసాలా ఫ్రై | తక్కువ టైమ్లో చేసకునే బెస్ట్ ఎగ్ కర్రీ | సింపుల్ ఎగ్ ఫ్రై - రెసిపీ వీడియో
Egg Masala Fry | Egg Recipes | Easy Egg Masala Fry Recipe | How to make Egg Masala Fry Recipe | Simple & Tasty Egg Masala Fry
Egg Recipes
|
nonvegetarian
Prep Time 10 mins
Cook Time 15 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 4 ఉడికించిన గుడ్లు
- 3 ఉల్లిపాయలు (సన్నని తరుగు)
- 4 పచ్చిమిర్చి చీలికలు
- ఉప్పు
- 1 tbsp కారం
- 1/4 tsp పసుపు
- పుదీనా – కొద్దిగా
- కొత్తిమీర – కొద్దిగా
- 4 tbsp నూనె
-
మసాలా పొడి కోసం
- 2 tbsp ధనియాలు
- 2 tsp గసగసాలు
- 1/4 cup ఎండుకొబ్బరి
- 1 అనాసపువ్వు
- 1 inch దాల్చిన చెక్క
- 3 యాలకలు
- 4 లవంగాలు
విధానం
-
సన్నని సెగ మీద మసాలా దినుసులు అన్నీ ఒక్కోటిగా మాంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి.
-
వేపుకున్న మసాలాలని చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి
-
నూనె వేడి చేసి ఉడికించిన గుడ్లు వేసి మూత పెట్టి కాస్త ఎర్రబడే దాకా వేపుకుని తీసుకోవాలి
-
అదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి
-
తరువాత వేగిన ఉల్లిపాయల్లో పసుపు, కారం అల్లం వెల్లులి ముద్ద వేసి 2 నిమిషాలు వేపుకోవాలి
-
ఉడికించిన గుడ్లని అంగుళం సైజ్ ముక్కలుగా చీరి కూరలో వేసుకోండి ఇంకా మెత్తగా పొడి చేసుకున్న మసాల కూడా వేసి 2 నిమిషాలు వేపి, పైన కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
8 comments