తెలంగాణా స్టైల్ మసాలా గుడ్డు పులుసు

ఈ గుడ్డు పూలుసు చిక్కని గ్రేవీతో, పుల్లగా కారంగా అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది.

ఈ మసాలా గుడ్డు పులుసు బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఈ గుడ్డు పులుసు అన్నం, చపాతీ, పూరి,అట్టు ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది.

Telangana Style Masala Egg Curry | Egg Gravy Recipe | Thick Masala Egg Gravy Recipe

టిప్స్

  1. తెలంగాణ స్టైల్ గుడ్డు పులుసులో వేసే నువ్వులు, వేరుసెనగపప్పు, కొబ్బరి ఇవి కమ్మని చిక్కని గ్రేవీ ఇస్తుంది. నువ్వులు, పల్లీలు, కొబ్బరిని సన్నని సెగ మీద వేపాలి అప్పుడే గ్రేవీ రుచిగా ఉంటుంది.

  2. నా దగ్గర కొబ్బరి పొడి ఉండి కాబట్టి వాడాను, మీరు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వాడుకోవచ్చు.

  3. గ్రేవీ రుచి పెరగాలంటే ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి అప్పుడే రుచి.

  4. నువ్వులు పల్లీలని మెత్తగా వెన్నలా రుబ్బుకోవాలి, అప్పుడు ఎక్కువ గ్రేవీ వస్తుంది.

  5. గ్రేవీ చల్లారుతున్న కొద్దీ చిక్కబడుతుంది, అందుకే వండేప్పుడే కాస్త పల్చగా చేసుకుంటే, చల్లారినా గ్రేవీ చిక్కదనం సరిగ్గా ఉంటుంది.

  6. ఒకవేళా గ్రేవీ చిక్కగా అనిపిస్తే మరిగే నీళ్ళు పోసి సరిచేసుకోండి.

  7. ఉడికించిన గుడ్లు హై-ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకుంటే చీట్లవు లేదంటే గుడ్డు పగిలి నూనె చిందుతుంది.

  8. ఈ పూలుసులో చింతపండు మితంగా ఉంటే ఒక రుచి కాస్త ఎక్కువగా వేస్తే ఇంకో రుచి, పులుపు ఇష్టపడే వారు ఇంకాస్త ఉప్పు కారం వేసుకోవాల్సి ఉంటుంది.

Telangana Style Masala Egg Curry | Egg Gravy Recipe | Thick Masala Egg Gravy Recipe

తెలంగాణా స్టైల్ మసాలా గుడ్డు పులుసు - రెసిపీ వీడియో

Telangana Style Masala Egg Curry | Egg Gravy Recipe | Thick Masala Egg Gravy Recipe

Egg Recipes | eggetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • పులుసు కోసం
  • 5 ఉడికించిన గుడ్లు
  • 1/3 cup నూనె (80 ml)
  • 1/2 liter నీళ్ళు
  • 2 tbsps కొత్తిమీర తరుగు
  • గ్రేవీ కోసం
  • 1/4 cup వేరుసెనగపప్పు
  • 1/4 cup నువ్వులు
  • 1/4 cup ఎండు కొబ్బరి పొడి
  • 2 tbsp ధనియాలు
  • 1 tsp జీలకర్ర
  • 1/4 tsp మెంతులు
  • 2 పెద్దవి ఉల్లిపాయ తరుగు (150 gms)
  • 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
  • 1/4 tsp పసుపు
  • 1 tbsp కారం
  • ఉప్పు
  • 200 ml చింతపండు పులుసు (60 గ్రాముల చింతపండు నుండి తీసినది)
  • 1/2 liter నీళ్ళు

విధానం

  1. మూకుడులో వేరుసేనగపప్పు , మెంతులు వేసి ఎర్రగా లో- ఫ్లేం మీదే వేపుకోవాలి.
  2. వేరు శెనగపప్పు బాగా వేగాక ధనియాలు, జీలకర్ర, వేసి ఓ నిమిషం వేపుకోవాలి, ఆ తరువాత నువ్వులు వేసి చిటచిటలాడించాలి. ఆఖరున కొబ్బరి పొడి వేసి 30 సెకన్లు వేపి మెత్తని పొడి చేసుకోవాలి
  3. అదే మూకుడులో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. (ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే గ్రేవీ కి చిక్కని రుచి) వేగిన ఉల్లిపాయల్ని మెత్తగా చేసుకున్నపొడి లో వేసుకోవాలి.
  4. అదే మిక్సీ జార్లో పొడితో పాటు అల్లం వెల్లూలి ముద్దా, కారం, ఉప్పు, చింతపండు పులుసు, పసుపు అన్నీ వేసి మెత్తని వెన్నలాంటి పేస్టు చేసుకోవాలి
  5. ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకున్న నూనెలో గుడ్లకి గాట్లు పెట్టి గరిట బోర్లించి తిప్పుతూ హై ఫ్లేం మీద ఎర్రగా వేపి తీసుకోవాలి.
  6. గుడ్లు వేగాక పక్కకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
  7. నూనె పైకి తేలాక 1/2 లీటర్ నీళ్ళు పోసి హై- ఫ్లేం మీద మూత పెట్టి బాగా ఉడుకురానివ్వాలి.
  8. గ్రేవీ ఉడుకుపట్టాక గుడ్లు వేసి మంట తగ్గించి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి, మధ్య మధ్య లో అడుగు నుండి కలుపుకోవాలి.
  9. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Oka manva bhallookam kitchen lo jorrinanduvalana, Noone paiki telaka munde water posanu. Anduvalana konchem chedu gaa vachindi. Em cheddam, kharma
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Ah ! What an amazing taste. I enjoyed the tastes as you described. I wish all the telugites and the rest of India should have enjoy this taste
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Third time done it. Ate with full satisfaction
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Taste is excellent. My daughter also liked it. She kept aside her cookings and ate with this
  • S
    Srinivas
    Recipe Rating:
    Very nice recipe 😋
  • J
    Jhansi
    Recipe Rating:
    U r doing good Respeesce