ఎగ్ పులావు | అన్నం మిగిలిపోతే 5mins లో ఈ పులావు చేసెయ్యండి

ఎగ్ పులావ్ అంటే చాలా ఇష్టమా అయితే ఈ సింపుల్ పద్ధతిలో చేయండి బెస్ట్ ఎగ్ పలావ్ ని ఎంజాయ్ చేయండి

ఎగ్ పులావ్ చేయడంలో ఒక్కోరిదీ ఒక్కో తీరు, నా స్టైల్ చాలా సింపుల్. ఈ పద్ధతికి ఎక్కువ సమయం కూడా అవసరంలేదు, అన్నం మిగిలినా ఈ స్టైల్లో ఎగ్ పులావ్ చేసుకోవచ్చు.

ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా బాచిలర్స్కి కూడా పర్ఫెక్ట్.

Easy Egg Pulao Recipe | How to make Egg Pulao Recipe | Simple & Easy Egg Pulao Recipe | Leftover Rice Egg Pulao

టిప్స్

బాస్మతి బియ్యం:

నేను ఒక కప్ అంటే 150 గ్రాముల బాస్మతి బియ్యం వాడాను. కావాలంటే మీరు సోనా మాసూరీ బియ్యం కూడా వాడుకోవచ్చు

అన్నం పొడి పొడిగా రావాలంటే బియ్యాన్ని గంట సేపు నానబెట్టి మరిగేనీళ్లలో ఒక tbsp ఉప్పు నానబెట్టిన బియ్యం వేసి 90% ఉడికించి వెంటనే మిగిలిన ఎసరుని ఒంపి పళ్లెంలో వేసి గాలికి పూర్తిగా చల్లారనిస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది

నెయ్యి:

నేను పులావ్ కమ్మటి సువాసన కోసం నెయ్యి వాడాను, కావాలంటే నూనె వాడుకోవచ్చు లేదా నెయ్యి నూనె కలిపి వాడుకోవచ్చు

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు పాయలుగా చేస్సి ఎర్రగా వేపితే పులావ్ రుచి చాలా బాగుంటుంది

ఇంకా...కారం, మసాలాలు మీకు తగినట్లుగా వేసుకోండి

ఎగ్ పులావు | అన్నం మిగిలిపోతే 5mins లో ఈ పులావు చేసెయ్యండి - రెసిపీ వీడియో

Easy Egg Pulao Recipe | How to make Egg Pulao Recipe | Simple & Easy Egg Pulao Recipe | Leftover Rice Egg Pulao

Weekend Special | nonvegetarian|eggetarian
  • Prep Time 2 mins
  • Cook Time 15 mins
  • Total Time 17 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 5 ఉడికించిన గుడ్లు
  • 2 tbsps నెయ్యి
  • 1 tsp షాహీజీర
  • 1 బిరియానీ ఆకు
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • ఉల్లిపాయ సన్నని చీలికలు
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 3 పచ్చిమిర్చి తరుగు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 1/2 tsp పసుపు
  • 1/2 tsp గరం మసాలా
  • 1 cup ఉడికించుకున్న అన్నం (110 gms)
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • పుదీనా తరుగు - కొద్దిగా

విధానం

  1. నెయ్యి కరిగించి, అందులో షాహీజీరా , బిర్యానీ ఆకు, యాలకలు లవంగాలు వేసి వేపుకోండి
  2. సన్నని ఉల్లిపాయ చీలికలు వేసి ఉల్లిపాయ ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి
  3. అల్లం వెల్లులి ముద్దా, పచ్చిమిర్చి , జీలకర్ర పొడి , పసుపు ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి బాగా వేపుకోవాలి
  4. ఉడికించిన గుడ్లు వేసి గుడ్డు పైన ఎర్రగా వేగేదాకా వేపుకోండి.
  5. గుడ్డు వేగిన తరువాత మూకుడులో ఉడికించిన అన్నం కొత్తిమీర పుదీనా తరుగు వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఈ పులావ్ వేడిగా చల్లగా ఎలా అయినా టేస్టీగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

12 comments

Easy Egg Pulao Recipe | How to make Egg Pulao Recipe | Simple & Easy Egg Pulao Recipe | Leftover Rice Egg Pulao