పెళ్ళిళ్ళ స్పెషల్ బెండకాయ 65 | మా టిప్స్ తో బెండకాయ ఫ్రై చేసి చుడండి మర్చిపోలేరు

Curries
5.0 AVERAGE
3 Comments

బెండకాయ 65 ఆంధ్రా పెళ్ళిళ్ళ స్పెషల్. 65 అనగానే దేశమంతా ఇష్టంగా తినే మద్రాస్ స్టైల్ 65 రెసిపీ తీరులో ఉండదు. అలా ఉండకపోయిన ఎందుకు ఆ పేరు, వచ్చిందో మాత్రం తెలియదు. పేరు మాట ఎలా ఉన్నా, చారు, పప్పు చారు, సాంబార్, పప్పు లోకి నంజుడుగా తింటుంటే ఆ మాజా మాటల్లో చెప్పలేము.

ఒక మాట చెప్పేదా బెండకయంటే ఇష్టం లేనివారు కూడా ఇలా చేసిస్తే ఒక్కరే కూరంతా లాగించేస్తారు! ఇది వేడి వేడి నెయ్యన్నం తోనూ చాలా బాగుంటుంది.

Bhindi 65 | Bendakaya 65 | Okra 65 | Vendakkai 65 | How to make Bhindi 65

టిప్స్

బెండకాయలు:

  • బెండకాయలు లేతవి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా బెండకాయ ముక్కలు అంగుళం పైన ముక్కలుగా కోసుకుంటే నూనె వేగాకా మరీ చిన్నవిగా అవ్వవు.

బెండకాయ వేపుడు కరకరలాడుతూ రావాలంటే:

  • బెండకాయ ముక్కల పైన కోటింగ్ కాస్త గట్టిగా ఉంటేనే నూనెలో వేసిన కోటింగ్ విడిపోదు, పల్చగా ఉంటే నూనెలో వేశాక విడిపోతుంది.

ఈ రెండు మీ ఇష్టం:

  • పకచికొబ్బరి తురుము, వెల్లూలీ ఆప్షనల్, కొబ్బరి వేస్తే రుచి, వెల్లూలీ ఉంటే సువాసన. నచ్చని వారు వెల్లూలీ వదిలేవచ్చు.

పెళ్ళిళ్ళ స్పెషల్ బెండకాయ 65 | మా టిప్స్ తో బెండకాయ ఫ్రై చేసి చుడండి మర్చిపోలేరు - రెసిపీ వీడియో

Bhindi 65 | Bendakaya 65 | Okra 65 | Vendakkai 65 | How to make Bhindi 65

Curries | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 15 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 500 gms బెండకాయలు
  • 2 కరివేపాకు
  • 1/4 cup వేరు సెనగపప్పు
  • 1/4 cup బియ్యం పిండి
  • 1/4 cup సెనగపిండి
  • 1/2 tsp గరం మసాలా
  • 2 tbsps పచ్చి కొబ్బరి
  • సాల్ట్
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp కారం
  • 6 వెల్లులి
  • 1 ఇంచ్ అల్లం
  • 5 పచ్చిమిర్చి
  • నూనె- వేయించడానికి

విధానం

  1. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లూలి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  2. ఇప్పుడు లేత బెండకాయ ముక్కల్లో బియ్యం పిండి, సెనగపిండి, ఉప్ప, కారం, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసి ముందు ముక్కలకి బాగా పట్టించండి.
  3. తరువాత 2 tbsps నీళ్ళు పోసి బెండకాయలకి బాగా పట్టించండి, పిండి బాగా గట్టిగా ఉండాలి.
  4. నూనె వేడి చేసి అందులో పల్లీలు వేపుకుని పక్కనుంచుకోండి, తరువాత కరివేపాకు వేపి పక్కనుంచుకోండి.
  5. బెండకాయ ముక్కలని వేసి కేవలం మీడియం ఫ్లేం మీద మాత్రమే ఎర్రగా వేపుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ రాగానే హై ఫ్లేం మీద వేపుకోండి క్రిస్పీ గా వేగుతాయ్.
  6. ఆఖరున వేపుకున్న బెండకాయ ముక్కల్లో వేడిగా ఉన్నప్పుడే గరం మసాలా, వేరు సెనగపప్పు, కరివేపాకు, పచ్చి కొబ్బరి వేసి బాగా కలుపుకొండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

Bhindi 65 | Bendakaya 65 | Okra 65 | Vendakkai 65 | How to make Bhindi 65