పల్లీల రైస్ | లంచ్ బాక్స్ స్పెషల్ | మిగిలిపోయిన అన్నంతో ఇలా చేస్తే చాల ఎంజాయ్ చేస్తారు
లంచ్ బాక్సులకి, సూపర్ ఫాస్ట్ గా అయిపోయె బెస్ట్ రైస్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే పల్లీల రైస్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ సింపుల్ పల్లీల రైస్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
“పల్లీల రైస్” చేయడం చాలా తేలిక. ఆఫీస్లకి వెళ్ళే వారికి, స్కూల్ కి వెళ్ళే పిల్లల లంచ్ బాక్సులకి, అన్నం మిగిలిపోయినా ఇది బెస్ట్. చాలా త్వరగా అవ్వడమే కాదు, చల్లారాక కూడా రుచిగా ఉంటుంది. దీనికి మళ్ళీ చట్నీస్ లాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు.
అన్నం మిగిలితే మా ఇంట్లో దాదాపుగా తెలంగాణ స్టైల్ కారం అన్నం ఇంకా పల్లీల అన్నం ఎక్కువగా చేస్తుంటాము.

టిప్స్
-
పప్పులు అన్నీ ఒక్కోటిగా నిదానంగా సన్నని సెగ మీద వేపుకుంటేనే, గింజ లోపలి దాకా వేగి మాంచి రుచి.
-
తాలింపు ఎర్రగా పప్పులని కరకరలాడుతూ వేపుకుంటే తినెప్పుడు రుచిగా ఉంటుంది.
-
ఎండాల కాలంలో అయితే పచ్చి కొబ్బరి వేసి చేస్తే మధ్యాన్నంకి అన్నం పాడైపోవచ్చు. అలా అని వేయకపోతే రుచి రాదు, అందుకే పచ్చికొబ్బరి కూడా తాళింపులో వేపి వేసుకోండి. అప్పుడు చెడిపోడు అన్నం.
పల్లీల రైస్ | లంచ్ బాక్స్ స్పెషల్ | మిగిలిపోయిన అన్నంతో ఇలా చేస్తే చాల ఎంజాయ్ చేస్తారు - రెసిపీ వీడియో
Peanut Spicy Rice | How to make Peanut Rice | Quick and Easy Recipes | Perfect Lunch Box Recipe
Prep Time 2 mins
Cook Time 15 mins
Total Time 17 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1/4 cup వేరుసెనగపప్పు
- 1/4 cup నువ్వులు
- 4 ఎండు మిర్చి
- 1/4 cup పచ్చి కొబ్బరి
- 1 cup ఉడికిన్చుకున్న అన్నం బియ్యాన్ని వండినది
- ఉప్పు
- 1/4 cup నూనె
- 1/2 tsp ఆవాలు
- 1 tsp మినపప్పు
- 1 tsp సెనగపప్పు
- 2 రెబ్బలు కరివేపాకు
విధానం
-
ముందు మూకుడులో వేరుసెనగపప్పు వేసి కేవలం లో-ఫ్లేం మీద మాత్రమే 3-4 నిమిషాలు రోస్ట్ చేసుకోండి
-
ఆ తరువాత ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, నువ్వులు ఒక్కొటిగా వేసుకుంటూ మంచి సువాసనోచ్చేన్తవరకు వేపుకోండి.
-
చల్లార్చుకుని మిక్సీ లో వేసి పలుకుగా గ్రైండ్ చేసుకోండి.
-
ఇప్పుడు మరో పాన్ నూనె వేడి చేసి తాలింపు సామానంతా వేసి వేయించుకుని ఉడికించిన అన్నం, సాల్ట్, వేరుసెనగపప్పు పొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసెయ్యండి.
-
కాస్త చల్లారాక బాక్స్ లో పెట్టుకోండి. చాలా సింపుల్ అనిపిస్తుంది కాని ఎంతో రుచి ఈ రైస్.

Leave a comment ×
3 comments