కేరెట్ రైస్ | లంచ్ బాక్సులకి తిన్న కొద్దీ తినాలనిపించే బెస్ట్ రెసిపీ

అన్నం మిగిలినా, లేదా లంచ్ బాక్సులకి తిన్న కొద్దీ తినాలనిపించే బెస్ట్ రెసిపీ కావాలంటే కేరట్ రైస్ తే బెస్ట్. ఎప్పుడు చేయండి సూపర్ హిట్ అంతే!!! నా ఫెవేరేట్ కేరట్ రైస్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

కేరెట్ రైస్ ఇది చాలా ఆరోగ్యం చాలా త్వరగా అయిపోతుంది కూడా. నా స్టైల్ కేరట్ రైస్ అల్లం వెల్లులి ఘాటుతో ఉండదు. కొంచెం మసాలా దీనుసులున్నా అవి ఎక్కువగా ఉండవు. చాలా కొద్దిగా ఉంటాయ్. ఈ రైస్ తింటున్నప్పుడు నోటికి తిన్నాక పొట్టకి హాయిగా అనిపిస్తుంది.

ఈ కేరట్ రైస్ ఘుమఘుమలాడిపోతూ భలేగా ఉంటుంది. నిజానికి ఇంటికి బందువులొస్తున్నప్పుడు ఏదైనా సింపుల్గా ట్రై చేయాలంటే కేరట్ రైస్ పర్ఫెక్ట్.

Carrot Rice | Easy Lunch Box recipe in 5 mins | How to make Carrot Rice

టిప్స్

  1. అన్నం పొడి పొడిగా ఉండడం అవసరం. అన్నం వండేప్పుడే కొద్దిగా ఉప్పెసి వండితే మెతుకుకి ఉప్పు పడుతుంది. ఆఖరున వేస్తే సరిగా కలవదు.

  2. వేసే ఆ కొద్ది సాంబార్ పొడి రైస్కి మాంచి రుచి రుచిని సువాసననిస్తుంది

కేరెట్ రైస్ | లంచ్ బాక్సులకి తిన్న కొద్దీ తినాలనిపించే బెస్ట్ రెసిపీ - రెసిపీ వీడియో

Carrot Rice | Easy Lunch Box recipe in 5 mins | How to make Carrot Rice

Flavored Rice | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 7 mins
  • Total Time 17 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup రైస్ (పొడి పొడిగా కాస్త ఉప్పు వేసి ఉడికించుకోండి)
  • 1 cup కేరట్ తురుము
  • 2 tbsp పచ్చి కొబ్బరి తురుము
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 2 tbsps కొత్తిమీర
  • 1 tbsp నిమ్మరసం
  • 1 tsp సాంబార్ పొడి
  • ఉప్పు
  • 3 tbsps నూనె
  • 15 జీడి పప్పు
  • 1 inch దాల్చిన చెక్క
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • 1 బిరియాని ఆకు

విధానం

  1. నూనె వేడి చేసుకుని అందులో యాలక, లవంగాలు, జీడిపప్పు, బిరియాని ఆకు వేసి మంచి సువాసనోచ్చేదాక దాక వేపుకొండి.
  2. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాకా వేపుకోండి.
  3. ఇప్పుడు కేరట్ తురుము వేసి 3 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే దాక వేపుకోండి.
  4. ఇప్పుడు ఉప్పు, సాంబార్ పొడి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకుని, ఉడికిన్చుకున్న అన్నం వేసి బాగా కలుపుకోండి.
  5. దింపే ముందు ½ చెక్క నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని దిమ్పెసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

8 comments

Carrot Rice | Easy Lunch Box recipe in 5 mins | How to make Carrot Rice