పార్టీకి లేదా వీకెండ్స్లో స్పెషల్ రెసిపీ కావాలానుకున్నప్పుడు క్విక్ అండ్ ఈసీగా అయిపోయె పుదీనా పులావ్ బెస్ట్ ఛాయిస్. ఈ సింపుల్ పుదీనా పులావ్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

ఏ వెజ్ పులావ్ చేయడం అయినా చాలా తేలిక. కూరగాయలు అన్నీ కలిపి చేస్తే వెజ్ పులావ్ అవుతుంది, పుదీనా వేసి చేస్తే పుదీనా పులావ్ అవుతుంది అనే కొంత వరకు నిజమే, కానీ పుదీనా పులావ్ రెసిపీ లో వేసే పదార్ధాలు దాదాపుగా అవే, కానీ చేసే తీరు ఇంకా రుచి కాస్త భిన్నం. కమ్మని చల్లని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.

పులావ్ చాలా తీరుల్లో చేయవచ్చు, నేను చక చక అయిపోయె ఫ్రైడ్ రైస్ మాదిరి టాస్ చేసి చేశాను, ఇది కూడా పులావే.

నా తీరులో అయితే మిగిలిన అన్నంతో కూడా పర్ఫెక్ట్ పులావ్ తయార్. మీరు కావలనుకుంటే మామూలు పులావ్ మాదిరి మసాలాలు అన్నీ వేపి ఎసరు పోసి కూడా చేసుకోవచ్చు. ఏది ఎలా చేసినా ఒకే రుచి. నేను నా ఈసీ విధానాన్ని ఇంకా డైరెక్ట్గా కుక్కర్లో వండే తీరు రెండూ ఈ రెసిపీలో చెప్తాను. డైరెక్ట్ గా వండే తీరు టిప్స్లో ఉంది చూడండి.

టిప్స్

1.రైస్ పొడిపొడిగా రావాలంటే : నేను బాస్మతి రైస్ వాడాను, మీరు సోనా మసూరి కూడా వాడుకోవచ్చు. రైస్ పొడి పొడిగా రావడానికి నానిన బియ్యం లో కొద్దిగా నూనె, ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద 90% ఉడికించి మిగిలిన ఎసరు వంపేయండి, తరువాత నూనె రాసిన ప్లేట్ లో అన్నాన్ని పలుచగా పరిచి గాలికి పూర్తిగా చల్లారనివ్వాలి, అప్పుడు అన్నం పొడిపొడిగా వస్తుంది, ఉప్పు అన్నానికి పడుతుంది. 90% ఉడికిన అన్నం మిగిలిన వేడి మీద ఉడికిపోతుంది.

  1. కుక్కర్లో వండుకునే వారు: ఉల్లిపాయలు మసాలా పేస్ట్ అన్నీ వేసి వేపి, గంటసేపు నానబెట్టుకున్న బియ్యం వేసి 2 నిమిషాలు వేపి తరువాత 1:1 నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక్క విసిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇదే సోనా మసూరి అయితే గంట సేపు నానబెట్టిన బియ్యాన్ని రెండు నిమిషాలు వేపి 1:1.1/2 నీళ్ళు పోసి 2 కూతలు హై ఫ్లేమ్ మీద ఒక కూత లో ఫ్లేమ్ మీద రానిచ్చి స్టీమ్ పోనివ్వాలి. తరువాత సర్వ చేసుకోవాలి.

  2. కారం:పుదీనా పులావ్లో ఎండు కారం కంటే పచ్చిమిర్చి కారం రుచిగా ఉంటుంది.

4.పుదీనా పేస్ట్ : పుదీనా పేస్ట్ కోసం ఆకులని మిక్సీ గ్రైండ్ చేసేప్పుడు చిన్న ఐసు ముక్క లేదా బాగా చల్లని నీళ్ళతో గ్రైండ్ చేస్తే రంగు మారదు. లేదంటే నల్లగా అవుతుంది పుదీనా పేస్ట్.

పుదినా పులావు - రెసిపీ వీడియో

Pudina Rice | Mint Rice Pulao | How to make Pudina Pulao

Flavored Rice | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 5 mins
  • Total Time 20 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 2 tsp నూనె
  • 1 tsp నెయ్యి
  • 1 బిరియానీ ఆకు
  • 1 ఇంచు దాల్చిన చెక్క
  • 5 లవంగాలు
  • 4 యాలకలు
  • 1 పెద్ద ఉల్లిపాయ తరుగు
  • 5 పచ్చిమిర్చి (చీలికలు)
  • 1 tsp గరం మసాలా
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 3 tsp పుదీనా పేస్ట్
  • 1 పుదీనా – చిన్న కట్ట
  • 1 tsp నిమ్మ రసం (ఆప్షనల్)
  • 110 gms బియ్యాన్ని వండుకున్న అన్నం
  • ఉప్పు

విధానం

  1. నూనె-నెయ్యి కలిపి వేడి చేసి అందులో మసాలా దీనుసులన్నీ వేసి వేపుకోవాలి
  2. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి
  3. వేగిన ఉల్లిపాయాలో ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లులి ముద్ద వేసి ఒక నిమిషం వేపుకోవాలి
  4. పుదీనా పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి, నూనె పైకి తేలాక పుదీనా ఆకులు వేసి ఒక నిమిషం వేగనివ్వాలి.
  5. వండుకున్న రైస్ వేసి బాగా టాస్ చేసుకోవాలి. నచ్చితే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఆఖరున 10 తాజా పుదీనా ఆకులు, ఉంటే ఫ్రైడ్ ఉల్లిపాయలు వేసుకోండి చాలా బాగుంటుంది. ఈ పులావ్ చల్లని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.
  6. ఇదే పులావ్ కుక్కర్లో ఎలా చేయాలో టిప్స్లో ఉంది చూడండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • K
    KALPANA NUKALA
    Super and Delicious receipe
  • S
    Smita Katke
    Recipe Rating:
    It must be tasting really very good
  • N
    Neeraja
    We when cook with ur same measure it's tate yummy..our children come fast to me if they listen the word hello foodies... My request is can we get recipe of bun or pav bhaji bun....
Pudina Rice | Mint Rice Pulao | How to make Pudina Pulao