కొబ్బరి అన్నం | ప్రసాదంగా లేదా లంచ్ బాక్సులకి సింపుల్ రైస్ ఐటం

ప్రసాదంగా లేదా లంచ్ బాక్సులకి సింపుల్ రైస్ ఐటం ఏదైనా చేయాలనుకున్న నా స్టైల్ కొబ్బరి అన్నం పర్ఫెక్ట్. ఈ సింపుల్ టేస్టీ కొబ్బరి అన్నం స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.

కొబ్బరి అన్నం అంటే అందరికీ ఇష్టమే! పెళ్ళిళ్ళలో కూడా స్పెషల్ గా వడ్డిస్తారు దక్షిణాది రాష్ట్రాలలో. కొబ్బరి అన్నం ఒక్కొరూ ఒక్కో తీరుగా చేస్తారు. నేను చేస్తున్నది పూర్తిగా మా ఇంట్లో చేసే తీరు.

ఇంకా చెప్పాలంటే తెలుగు వారి పద్ధతి. ఈ సింపుల్ రెసిపీకి కొన్ని టిప్స్ ఉనని అవి చూసి చేస్తే బెస్ట్ కొబ్బరి అన్నం గారంటీ!

Coconut Rice | How to make Coconut Rice | Thengai Sadam | Nariyal Chawal | Kobbari Annam

టిప్స్

  1. కొబ్బరి పాలు:నేను పచ్చి కొబ్బరి ని కాసిని వేడి నీళ్ళు మిక్సీ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి, తరువాత గుడ్డలో వేసి గట్టిగా పిండిన పాలలో కాసిని నీళ్ళు కలిపి పలుచన చేసి వాడాను. ఇలా చేసే పాలనే కొబ్బరి పాలు అంటారు. మీరు టెట్రా ప్యాక్ వాడితే కాసిని నీళ్ళు కలిపి వాడుకోండి.

  2. కప్పు బియ్యనికి 1.3/4 కప్పు కొబ్బరి పాలు ¼ కప్పు నీళ్ళు పోస్తే అన్నం చక్కగా ఉడుకుతుంది.

  3. అన్నం ఉడికాక వెంటనే వేడిమీదే రుచికి సరిపడా ఉప్పు వేస్తే అన్నానికి పడుతుంది. చల్లారాక వేస్తే ఉప్పు కలవదు. బియ్యం ఉడికేప్పుడు ఉప్పు వేస్తే కొబ్బరి పాలు ఒక్కోసారి విరిగిపోతాయ్.

  4. నేను తాలింపులో మిరియాలు, ఇంగువ వేయలేదు నచ్చితే కొద్దిగా మిరియాలు ఇంగువ వేసుకోవచ్చు.

కొబ్బరి అన్నం | ప్రసాదంగా లేదా లంచ్ బాక్సులకి సింపుల్ రైస్ ఐటం - రెసిపీ వీడియో

Coconut Rice | How to make Coconut Rice | Thengai Sadam | Nariyal Chawal | Kobbari Annam

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం
  • 1 3/4 liter పలుచని కొబ్బరి పాలు
  • 1/4 cup నీళ్ళు
  • ఉప్పు
  • తాలింపు కోసం
  • 2 tbsps నూనె
  • 15 జీడిపప్పు
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp శెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • కరివేపాకు – ఒక రెబ్బ
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 1 cup పచ్చి కొబ్బరి తురుము (సగం చిప్ప)
  • కొత్తిమీర – కొద్దిగా

విధానం

  1. బియ్యంలో కొబ్బరి పాలు, నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం - ఫ్లేమ్ మీద రెండు హై - ఫ్లేమ్ మీద ఒక విసిల్ రానిచ్చి స్టీమ్ పోనివ్వాలి
  2. స్టీమ్ పోయాక వెంటనే వేడి మీదే ఉప్పు వేసి కలిపి పక్కనుంచుకోండి
  3. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ముందు జీడిపప్పు వేసి తరువాత ఒక్కోటిగా అన్నీ వేసి ఆఖరుగా కొబ్బరి తురుము వేసి కలిపి 30 సెకన్లు వేపి కొబ్బరి అన్నంలో వేసుకోండి
  4. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి కలిపి సర్వే చేసుకోండి

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

Coconut Rice | How to make Coconut Rice | Thengai Sadam | Nariyal Chawal | Kobbari Annam