టమాటో చికెన్ | మా స్టైల్ లో టమాటో చికెన్ వండి చుడండి మళ్ళీ కావాలంటారు
ఒక్కోసారి చిన్న మార్పులతో అందరి మెప్పు పొందవచ్చు అలాంటిదే ఈ టొమాటో చికెన్ రెసిపీ. ఈ సింపుల్ చికెన్ కర్రీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
వీకెండ్ వస్తే అందరు నాన్ వెజ్ కోసం చూస్తారు. కానీ ఎప్పుడు ఒకేలాంటి నాన్ వెజ్ కర్రీ తిని విసిగిపోతే నా స్టైల్లో టొమాటో చికెన్ పర్ఫెక్ట్ కర్రీ. ఈ చికెన్ కర్రీ చేయడం చాలా తేలిక. అట్టు, చపాతీ, పూరీ లేదా వేడి వేడి అన్నం లోకి చాలా బాగుంటుంది. పెద్దగా టైం కూడా పట్టదు. ఎప్పుడు చేసినా అందరికి నచ్చేస్తుంది. తప్పక ట్రై చేయమని రికమండ్ చేస్తున్నాం

టిప్స్
• ఈ టొమాటో చికెన్ కురకి కాస్త నూనె ఎక్కువుంటేనే రుచి
• నాటు టొమాటోలు వాడితే పులుపుగా కారంగా చాలా బాగుంటుంది.
• రుచి చూసి టొమాటోల పులుపుకి తగినట్లు ఉప్పు కారం సరి చేసుకోండి
• టమాటోలు బాగా మగ్గితేనే అసలు రుచి, లేదంటే పచ్చి వాసన వస్తూ అంత రుచిగా ఉండదు.
టమాటో చికెన్ | మా స్టైల్ లో టమాటో చికెన్ వండి చుడండి మళ్ళీ కావాలంటారు - రెసిపీ వీడియో
Tomato Chicken | Thick Gravy Chicken Curry | How to make Spicy Tomato Chicken Curry with Thick gravy
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 500 gms చికెన్ (30 పాటు ఉప్పు నీటిలో నానబెట్టినది)
- 1/2 kilo నాటు టమాటోలు
- 150 gms ఉల్లిపాయ తరుగు
- 3 పచ్చిమిర్చి చీలికలు
- 1 రెబ్బ కరివేపాకు
- 2 tsp కొత్తిమీర తరుగు
- 1/2 tsp ఆవాలు
- 1/2 tsp జీలకర్ర
- 2 -3 ఎండు మిర్చి
- ఉప్పు
- 1/2 tsp పసుపు
- 2 tsp కారం
- 1 tsp గరం మసాలా
- 1.25 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- 1/3 cup నూనె
విధానం
-
నూనె వేడి చేసి అందులో 2 పండిన టమాటో పెద్ద ముక్కలు వేసి 3 నిమిషాలు ఫ్రై చేసి తీసి పక్కనుంచుకోండి
-
అదే నూనె లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేపుకోండి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే అప్పుడు అల్లం వెల్లూలి పేస్టు వేసి 1 నిమిషం పాటు వేపుకోండి
-
ఇప్పుడు మిగిలిన టొమాటోల పేస్టు వేసి టమాటోలలోంచి పచ్చివాసన పోయి కూర దగ్గర పడే దాకా ఫ్రై చేసుకోండి. దీనికి కాస్త టైం పడుతుంది.
-
టమాటో గుజ్జు బాగా మగ్గి దగ్గర పడ్డాక అప్పుడు పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలుపుకోండి
-
తరువాత చికెన్ వేసి బాగా కలుపుకుని 4 నిమిషాల పాటు హై ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి
-
చికెన్ ముక్కల్లోంచి నీరు వదిలిన తరువాత అప్పుడు పావు లీటర్ నీళ్ళు పోసి మీడియం- ఫ్లేం మీద కూర దగ్గర పడేదాకా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి.
-
కూర సగం పైన మగ్గాక అప్పుడు మొదటగా ఫ్రై చేసి పక్కనున్చుకున్న టమాటో ముక్కలు కరివేపాకు వేసి కూరలోంచి నూనె పైకి తేలేదాకా లో-ఫ్లేం మీద కుక్ చేసుకోండి
-
నూనె పైకి తేలాక అప్పుడు కొత్తిమీర చల్లుకుని దిమ్పెసుకోండి

Leave a comment ×
6 comments