టమాటో రైస్ | టమాటో పులావ్

అన్నం మిగిలిపోతే ఎంతో సింపుల్గా తయారయ్యే ఈ టమాటో రైస్ చేస్తే క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. పుల్లగా కారంగా మాంచి ఎర్రటి రంగుతో తినడానికి చూడ్డానికి భలేగా ఉంటుంది.

ఇంటికి గెస్ట్స్ వస్తున్నప్పుడు ఒక్కోసారి ఏ రెసిపీ చేసి ఇంప్రెస్స్ చేయాలా అని ఆలోచనల్లో పడతారు, అలాంటప్పుడు ఈ సింపుల్ టమాటో పులావ్ ఎంతో ఉపయోగపడుతుంది. అన్నం వండి ఉంచుకుంటే 15 నిమిషాలు అంతే పులావ్ తయారవ్వడానికి.

ఈ టమాటో పులావ్ మాములుగా కుక్కర్లో మసాలాలతో పాటు అన్నీ వేసీ మామూలు పులావ్ మాదిరీ చేసుకోవచ్చు లేదా ఇలా మిగిలిపోయిన అన్నం, విడిగా వండుకుని ఉంచుకున్న అన్నంతోనూ చేసుకోవచ్చు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుఆలూ బటానీ పులావ్

నేను చెప్పిన రెండు విధానాలు కింద టిప్స్లో వివరంగా ఉంది చుడండి.

టిప్స్

టమాటో:

  1. టమాటోలు పండినవి ఎర్రగా ఉన్నవి నాటువి వాడుకోండి. నాటు టొమాటోలు వాడితే పులుపు వస్తుంది. ఒక వేళా నాటు టమాటోలు దొరకనట్లైతే హైబ్రిడ్ టొమాటోలు వాడుకోండి, ఆఖరున నిమ్మరసం పిండుకోండి.

పులావ్ కుక్కర్లో వండుకోడానికి:

  1. అంతా నేను చేసినట్లే కానీ మాసాలు టమాటో పేస్ట్ ముక్కలు మగ్గిన కుక్కర్లో బియ్యం వేసి మసాలాలు 2 నిమిషాలు వేపి గంట సేపు నానిన బాస్మతి అయితే కప్పుకి కప్పున్నర నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి 20 నిమిషాలు వదిలేయాలి.

  2. అదే మామూలు బియ్యంతో చేసుకోదలిస్తే అంత పై పద్ధతే బియ్యం నానబెట్టుకోవడం వండుకోవడం ...కానీ, ఎసరుకి నీళ్లు కప్పుకి 2 కప్పులు నీళ్లు 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానిచ్చి 20 నిమిషాలు వదిలేయాలి. తరువాత సర్వ్ చేసుకోవాలి.

టాస్ చేసే తీరు:

  1. పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని అట్లకాడతో హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి. అట్లకాదా వాడకపోతే మెతుకు విరిగిపోతుంది, హై ఫ్లేమ్ మీద టాస్ చేయకపోతే మెతుకు వేడెక్కదు.

టమాటో రైస్ | టమాటో పులావ్ - రెసిపీ వీడియో

Tomato rice | Tomato Pulav | Tomato Pulao recipe | How to make Tomato Rice

Leftover Rice Recipes | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 15 mins
  • Total Time 30 mins
  • Serves 3

కావాల్సిన పదార్ధాలు

  • 2 tbsp నెయ్యి
  • 2 tbsp నూనె
  • 1/2 tbsp షాహీ జీరా
  • 2 లవంగాలు
  • 2 యాలకలు
  • ¼” దాల్చిన చెక్క
  • 1/4 Cup ఉల్లిపాయ చీలికలు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 Cup టమాటో పేస్ట్
  • 1/2 Cup టమాటో ముక్కలు
  • 1(185) Cup (gms) పొడిపొడిగా వండుకున్న అన్నం
  • 1 tbsp కారం
  • 1/2 tbsp గరం మసాలా
  • 1/2 tbsp ధనియాల పొడి
  • ఉప్పు
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. నూనె నెయ్యి వేడి చేసి అందులో మసాలా దినుసులు షాహీ జీరా, దాల్చిన చెక్క, లవంగాలు ,యాలకలు వేసి ఒక నిమిషం వేపుకోండి
  2. వేగిన మసాలాలో ఉల్లిపాయ సన్నని తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. వేగిన ఉల్లిలో తాజా అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి.
  3. ఉల్లి వెల్లులి వేగిన తరువాత టమాటో పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చివాసన పోయాక కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి నూనె పైకి తేలేదాక వేగనివ్వాలి.
  4. తరువాత టమాటో ముక్కలు వేసి టమాటో ముక్కలు మెత్తబడే దాక వేపుకోవాలి. టమాటో ముక్కలు మెత్తబడ్డాకా ఉడికించిన అన్నం వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి.
  5. అన్నానికి మసాలాలు బాగా పట్టించిన తరువాత కొత్తిమీర తరుగు వేసి కలిపి మరో సారి టాస్ చేసి తీసుకోండి. ఈ టమాటో పులావ్ కమ్మని చల్లని ఆనియన్ లేదా కీరా రైతాతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments