చికెన్ ఫ్రైడ్ రైస్ | రెస్టారెంట్ స్టైల్ ఇండో చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

రెస్టారెంట్ స్టైల్ ఇండో చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చేయడం చాలా ఈసీ. రెస్టారెంట్ స్టైల్ ఈసీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

అందరూ ఎంతో ఇష్టంగా తినే చైనీస్ ఫ్రైడ్ రైస్ నిజానికి చైనీస్ స్టైల్ ఫ్రైడ్ రైస్ కాదు. ఇది ఇండో-చైనీస్ ఫ్రైడ్ రైస్. ఇండియాలో మనకు తగినట్లుగా మారిన ఫ్రైడ్ రైస్.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చాలా సింపుల్. ఉడికించిన చికెన్ తరిగిన వెజిటెబుల్స్ ఉంటే చాలు జస్ట్ 5 నిమిషాలు అంతే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ త్వరలో పోస్ట్ చేస్తా. నిజానికి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రెసిపీ నాకు చాలా ఇష్టం. ఆ స్టైల్ చూడడానికి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆ రెసిపీ త్వరలో పోస్ట్ చేస్తా

రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మంచూరియాన్తో లేదా టొమాటో కెట్చాప్ తో బాగుంటుంది.

ఈ సింపుల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చేసే ముందు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి.

టిప్స్

బాస్మతి రైస్ :

నేను బాస్మతి రైస్ వాడాను, మీరు సోనా మసూరి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇంకా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు.

ఫ్రైస్ రైస్ పొడి పొడిగా రావాలంటే:

  • బియ్యాన్ని మరిగే నీళ్ళలో వేసి అందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం పిండి హై-ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా ఉడికిస్తే అన్నం మరీ మెత్తగా ఉడకదు.

  • 90% ఉడికిన అన్నం వెంటనే వడకట్టి నూనె రాసిన ప్లేట్ లో లేదా జల్లెడలో వేసి గాలికి పూర్తిగా ఆరనిస్తే అన్నం పొడిపొడిగా అవుతుంది.

  • 90% అంటే మెతుకు మెదిపితే తెలుస్తుంది. దాదాపుగా ఉడికి ఆఖరున చిన్న పలుకు తగులుతుంది అది 90% అంటే

రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే :

  • ఇండో- చైనీస్ ఎప్పుడు హై- ఫ్లేమ్ మీద టాస్ చేయాలి. అప్పుడు స్మోకీ ఫ్లేవర్తో రెస్టారెంట్ టెస్ట్ వస్తుంది.

ఆరోమేట్ పౌడర్:

  • ఆరోమేట్ పౌడర్ అజినీమోటోకి బదులుగా వాడాను. ఇది ఆన్లైన్లో సులభంగా దొరుకుతుంది. దొరకని వారు అజీనమోటో (దీన్నే కొందరు టెస్టింగ్ సాల్ట్ అంటారు) వేసుకోవచ్చు. లేదా వదిలేవచ్చు.

కూరగాయలు:

  • సన్నగా ఒకేతీరుగా తరిగిన కూరగాయలు 60% హై ఫ్లేమ్ మీద వేపితే తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ వేగితే గట్టిగా అయిపోతాయ్.

పంచదార:

వేసిన ఆ కొద్దిగా పంచదార ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్స్ చక్కగా బాలెన్స్ చేస్తుంది.

చికెన్ ఫ్రైడ్ రైస్ | రెస్టారెంట్ స్టైల్ ఇండో చైనీస్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ - రెసిపీ వీడియో

Chicken Fried Rice Recipe | Home Style Chicken Fried Rice | Quick Chicken Fried Rice | Restaurant Style Chinese Chicken Fried Rice | How to Make Chicken Fried Rice

Chinese Non-Veg Recipes | nonvegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 10 mins
  • Total Time 25 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బాస్మతి రైస్ - పొడి పొడిగా వండుకున్నది
  • 200 gms బోన్లెస్ చికెన్
  • 1 గుడ్లు
  • 1/4 cup సన్నని కేరట్ తరుగు
  • 1/4 cup సన్నని ఫ్రెంచ్ బీన్స్ తరుగు
  • 1/2 tsp లైట్ సోయా సాస్
  • 1/2 tsp వెనిగర్
  • సాల్ట్
  • 1/2 tsp ఆరోమెటిక్ పౌడర్
  • 1/2 tsp వైట్ పెప్పర్
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1/2 tsp పంచదార
  • 1/4 cup స్ప్రింగ్ ఆనీయన్
  • 3 tbsps నూనె

విధానం

  1. చికెన్ లో నీళ్ళు ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
  2. నూనె బాగా వేడి చేసి అందులో గుడ్లని బాగా బీట్ చేసి హై –ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. (వేగిన గుడ్డుని బాగా కలిపి విరగకోట్టకండి)
  3. సన్నని బీన్స్, సన్నని కేరట్ తరుగు వేసి హై-ఫ్లేమ్ మీద 60 % వేపుకోవాలి.
  4. పొడిపొడిగా వండుకున్న బాస్మతి బియ్యం వేసి బాగా టాస్ చేయండి (పొడిపొడిగా ఎలా వండాలో టిప్స్ చూడండి)
  5. మిగిలిన పదార్ధాలన్నీ వేసి హై-ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి.
  6. ఆఖరున స్ప్రింగ్ అనియన్ తరుగు చల్లి టాస్ చేసి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

90 comments