స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చిల్లి చికెన్ | చిల్లి చికెన్

పార్టీస్కి లేదా చికెన్తో ఏదైనా స్టార్టర్ అనుకోగానే గుర్తొచ్చే విధంగా ఉంటుంది ఈ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చిల్లీ చికెన్. ఈ క్రిస్పీ చిల్లీ చికెన్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

"చిల్లి చికెన్" ఆ పేరు వింటేనే స్పైస్ ని ఇష్టపడే వారికి నోట్లో నీళ్ళూరుతాయ్! నాక్కూడా. అందులోనూ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అంటే ఇంకా చెప్పాలా లాగించడమే! కారంగా, ఘాటుగా, కరకరలాడుతూ తిన్నకొద్దీ తినిపించేలా ఉంటుంది.

నిజం చెప్పాలంటే చాప్ స్టిక్స్ పట్టుకుని చైనీస్ రెస్టారంట్ లో తినే ఇండో-చైనీస్ చిల్లి చికెన్ కంటే మన స్ట్రీట్స్ లో దొరికే చిల్లీ చికెన్ చాలా ఇష్టం. మనకి తగినట్లుగా కారం మసాలాలు ఉంటాయ్. వేడి వేడిగా అవి తింటుంటే ఆహా అనిపిస్తుంది ఆ క్షణం!

ఇండో- చైనీస్ చిల్లీ చికెన్ కి స్ట్రీట్ ఫుడ్ చిల్లీ చికెన్కి కారాలు, సాసులు, మసాలాలు తేడా అంతే! అంతేనా... అని అలా తక్కువగా అనుకోకండి, ఆ వేసే కొద్ది పదార్ధాలతోనే భలేగా ఉంటుంది రుచి.

స్ట్రీట్ ఫుడ్ కి ఓ ప్రేత్యేకమైన విధానం ఏమి ఉండదు. ఒకరు వేసినవి ఇంకొరు వేయరు, ఒకరి కొలత మరొకరికి ఉండదు. ఏది ఎవరు ఎలా వేసినా రుచి ప్రధానంగా సాగిపోతుంటుంది స్ట్రీట్ ఫుడ్.

నేను ఇది వరకు చాలా స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ చేసాను చుడండి.

Chilli Chicken

టిప్స్

  1. చికెన్ మీరు బోన్లెస్ లేదా బోన్ ఏది తీసుకున్నా 1 tbsp ఉప్పేసిన నీళ్ళలో 30 నిమిషాలు నానబెట్టి ఆ తరువాత వడకట్టి వాడుకోండి. అప్పుడు ముక్క మెత్తబడి ఫ్లేవర్స్ బాగా లోపలిదాక పడతాయ్.

  2. చికెన్కి మైదా, కార్న్ ఫ్లోర్ కోటింగ్ ఏమాత్రం ఎక్కువ కాకుండా ఇవ్వాలి. ఎక్కువైతే సాసులు పై పైనే ఉండిపోయి లోపలి పోవు. అప్పుడు అంత రుచిగా ఉండదు.

  3. పిండి కలుపుకునేప్పుడు నీళ్ళు కొద్దిగా అంటే చెమ్చాలతో వేసుంటూ గట్టిగా పకోడీ పిండిలా కలుపుకోవాలి. అప్పుడు కరకరలాడుతూ వేగుతుంది చికెన్.

  4. ఇంకా గిలకొట్టిన గుడ్డు వేయడం వల్ల కోటింగ్లో జిగురుండి బాగా పట్టుకుంటుంది పిండిని

  5. ముక్కలని బాగా వేడెక్కిన నూనె లో మంట మీడియం ఫ్లేం లోకి పెట్టి ఎర్రగా క్రిస్పీగా వేపుకోవాలి. ఓపికగా వేపితే ఎముకలు కూడా మెత్తబడి నమిలి తినగలిగేంత రుచిగా ఉంటాయ్.

  6. వేసిన ఉల్లిపాయ, కాప్సికం ముక్కలు ఎర్రగా లేదా మెత్తబడే దాక వేపకూడదు. సగం వేగాలి అప్పుడే తినేప్పుడు రుచిగా ఉంటుంది.

  7. చికెన్ ముక్కలు సాసుల్లో వేసాక కేవలం హై ఫ్లేం మీదే టాస్ చేయాలి. లో- ఫ్లేం మీద టాస్ చేస్తే ముక్క మెత్తబడిపోతుంది.

  8. చికెన్ ముక్కలు కూడా సాస్ మారీ చిక్కబడకుండా వేస్తేనే పీలుస్తాయ్, లేదంటే పైన కోటింగ్ గా ఉండిపోతుంది. లోపలిదాక సాసులు వెళ్ళవు.

స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చిల్లి చికెన్ | చిల్లి చికెన్ - రెసిపీ వీడియో

Street Food Style Chilli Chicken | Chilli Chicken | Perfect Chili Chicken Recipe at home

Chinese Non-Veg Recipes | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • కోటింగ్ కోసం
  • 300 gms చికెన్ (బోన్/బోన్లేస్స్ చికెన్))
  • 1/2 tsp అల్లం వెల్లూలి పేస్టు
  • 1/2 tsp ఉప్పు
  • 1/4 tsp గరం మసాలా
  • 1/2 tsp కారం
  • 2 చితికేళ్ళు అజినోమోటో
  • 2 tsp గిల కొట్టిన గుడ్డు
  • 2 tsp మైదా
  • 2 tbsp కార్న్ ఫ్లోర్
  • 1/4 cup నీళ్ళు
  • నూనె వేపుకోడానికి
  • టాసింగ్ కోసం
  • 1/4 cup నూనె
  • 4 వెల్లూలి తరుగు
  • 3 పచ్చిమిర్చి తరుగు
  • 2 tbsps ఉల్లిపాయ తరుగు
  • 1/2 కాప్సికం ముక్కలు
  • 1/2 ఉల్లిపాయ ముక్కలు
  • 150 ml నీళ్ళు
  • 1/2 tsp అల్లం వెల్లూలి పేస్టు
  • 1/2 tsp సాల్ట్
  • 1/2 tsp గరం మసాలా
  • 1.5 tbsp కారం
  • 1/2 tsp మిరియాల పొడి
  • 3/4 tsp తెల్ల మిరియాల పొడి
  • 1/4 tsp అజినోమోటో
  • 2 tbsp గ్రీన్/రెడ్ చిల్లి సాస్
  • 1 tbsp డార్క్ సోయా సాస్
  • 1 tbsp వెనిగర్
  • 2 tbsp కొత్తిమీర

విధానం

  1. ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ లో ముందు అల్లం వెల్లూలి ముద్దా, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా పట్టించాలి
  2. గుడ్డు సోన కూడా వేసి బాగా పట్టించి మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి నీళ్ళతో తడి పొడిగా ఉండే గట్టి పిండి ముద్దలా కలుపుకోవాలి
  3. ఆఖరున అజినోమోటో వేసి కలుపుకొండి. నచ్చకపోతే వదిలేయోచ్చు
  4. వేడి నూనె లో చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేం మీద ఎర్రగా క్రిస్పీగా వేపుకోవాలి
  5. పాన్ లో నూనె వేడి చేసి అందులో వెల్లూలి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు, కాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేం మీద 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి.
  6. నీళ్ళు పోసి అల్లం వెల్లూలి పేస్టు వేసి నీళ్ళని తెర్ల కాగనివ్వాలి హై ఫ్లేం మీద.
  7. తెర్లుతున్న నీళ్ళలో మిగిలిన సాసులు కారాలు అన్నీ వేసి బాగా కలిపి కాస్త చిక్కబడనివ్వాలి.
  8. సాసులు చిక్కబడగానే వేపుకున్న చికెన్ వేసి హై మీద బాగా పట్టించాలి. సాసులు పీల్చుకున్నాక, కొత్తిమీర తరుగు చల్లి వేడిగా ఎంజాయ్ చేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

Chilli Chicken