క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్

ఎప్పుడూ తినే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ కంటే కాస్త కొత్తగా ఇంకెంతో రుచిగా ఉండే ఈ దేశీ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ పార్టీలకి స్పెషల్ డేస్లో చేసి చుడండి సూపర్ హిట్ అయిపోతుంది.

కరకరలాడే చికెన్ ముక్కలు అక్కడక్కడా తగులుతూ, ఘాటైన మన దేశీయమైన గుభాళింపుతో ఘాటుగా భలేగా ఉంటుంది.

ఈ క్రిస్ప్ చికెన్ ఫ్రైడ్ రైస్ నేను కొంత స్ట్రీట్ ఫుడ్ ఇంకొంత ఇండో చైనీస్ ఇంకొంచెం థాయ్ కలగలిపి నా తీరులో చేస్తున్నాను. ఇది మా ఫ్యామిలీ ఎంతో ఇష్టంగా తినే ఫ్రైడ్ రైస్. వీకెండ్స్కి మేము ఎప్పుడు బిర్యానీలు కాకుండా ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము.

ఈ సింపుల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసే తీరు దాదాపుగా మాములు చికెన్ ఫ్రైడ్ రైస్ తీరే, కానీ వేసే పదార్ధాలు కాస్త భిన్నం. కొంచెం కారంగా, కొంచెం తియ్యగా, ఘాటుగా అక్కడక్కడ కారకరలాడే వేపిన పల్లెల ట్విస్ట్తో ఉంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు పల్లీల రైస్

టిప్స్

చికెన్:

  1. లేత బోనెల్స్ చికెన్ వాడుకోండి. లేదంటే చికెన్ రబ్బరులా ఉంటుంది.

  2. మసాలాలు పట్టించిన చికెన్ కచ్చితంగా నానని అప్పుడే ఫ్లేవర్స్ పట్టుకుంటుంది చికెన్

మారినేషన్:

  1. చికెన్ని మసాలాలు పట్టి ఉంచడానికి నేను కార్న్ ఫ్లోర్ వాడాను. మీరు నచ్చితే కొంచెం ఎగ్ వైట్ కూడా వేసుకోండి. అప్పుడు చికెన్ కోటింగ్ అస్సలు ఊడదు, ఇంకా చికెన్ కూడా రుచిగా ఉంటుంది.

  2. చికెన్ కోటింగ్ గట్టిగా ఉండాలి అప్పుడే కోటింగ్ ముక్కని పట్టి ఉంటుంది.

చికెన్ వేపే తీరు:

  1. చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా రంగు మారే దాకా వేపుకోవాలి. చికెన్ ముక్క రంగు మారిన తరువాత హై ఫ్లేమ్లోకి పెట్టి వేపితే అప్పుడు కరకరలాడుతూ వేగుతుంది.

  2. చికెన్ ముక్కలని హై ఫ్లేమ్ మీద వేపితే పైన రంగొస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది.

అన్నం:

  1. బాస్మతి బియ్యాన్ని ఉప్పేసి 90% ఉడికించి అన్నాన్ని వడకట్టి వెడల్పాటి పళ్లెంలో పోసి కొద్దిగా నూనె చల్లి వదిలేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. అన్నాన్ని పూర్తిగా మెత్తగా వండకూడదు.

  2. ఇక్కడ మీరు నచ్చితే మామూలు బియ్యం అదే రోజూ తినే బియ్యం కూడా వాడుకోవచ్చు.

ఇంకొన్ని టిప్స్:

  1. ఈ రెసిపీని థాయ్ క్యూసిన్ ఇన్స్పిరేషన్తో కొన్ని వేపిన పల్లీలు వేశాను. కాస్త కొత్తగా అనిపిస్తుంది కానీ, రుచి చాలా బాగుంటుంది. నచ్చకుంటే వేయకపోయినా పర్లేదు

  2. ఈ ఫ్రైడ్ రైస్ కాస్త అంటే తెలిసినంత తియ్యగా ఉంటుంది స్వీట్ చిల్లీ సాస్ వలన. కంగారు పడకండి నన్ను నమ్మండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్. వద్దనుకుంటే గ్రీన్ చిల్లి సాస్ వేసుకోండి లేదా రెడ్ చిల్లి సాస్ ఇంకొంచెం పెంచుకోండి.

క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్ - రెసిపీ వీడియో

Desi Style Crispy Chicken Fried Rice | Chicken Fried Rice | Chicken Egg Fried Rice

Chinese Non-Veg Recipes | nonvegetarian
  • Prep Time 2 mins
  • Soaking Time 30 mins
  • Cook Time 20 mins
  • Total Time 52 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ మారినేడ్ చేసుకోడానికి:
  • 250 gms బోన్లెస్ చికెన్ ముక్కలు
  • 1 tbsp గరం మసాలా
  • 1/2 tbsp ధనియాల పొడి
  • 1/2 tbsp వేపిన జీలకర్ర పొడి
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 2 tbsp కార్న్ ఫ్లోర్
  • ఫ్రైడ్ రైస్ కోసం:
  • 1/3 Cup నూనె
  • 2 గుడ్లు
  • 1 tbsp అల్లం సన్నని తురుము
  • 1 tbsp వెల్లులి సన్నని తురుము
  • 1 Sprig కరివేపాకు
  • 2 tbsp స్వీట్ కార్న్
  • 1/4 Cup కాప్సికం
  • 1/4 Cup కేరట్ చీలికలు
  • 1/2 Cup కేబేజి చీలికలు
  • 1/4 Cup బీన్స్ సన్నని తరుగు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1 tbsp మిరియాల పొడి
  • 1 tbsp రెడ్ చిల్లి సాస్
  • 1 tbsp స్వీట్ చిల్లి సాస్
  • 1 tbsp డార్క్ సోయా సాస్
  • 1 tbsp అరోమాట్ పొడి
  • 1/2 tbsp వైట్ పెప్పర్ పొడి
  • 1/4 Cup వేపుకున్న పల్లీలు
  • 1/4 Cup ఉల్లి కాడల తరుగు
  • 1.5(185) Cup (gms) ఉప్పేసి పొడి పొడిగా వండుకున్న అన్నం

విధానం

  1. చికెన్కి మసాలాలు కార్న్ ఫ్లోర్ పట్టించి కనీసం 30 నిమిషాలు నానబెట్టుకోండి.
  2. నూనె బాగా వేడి చేసి, నానిన చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి. తరువాత తీసి పక్కనుంచుకోవాలి
  3. మిగిలిన నూనెలో గుడ్లని బాగా బీట్ చేసి పోసి పొంగించండి. పొంగిన గుడ్డుని పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకోండి. తరువాత అల్లం వెల్లులి తరుగు వేసి టాస్ చేసుకోవాలి
  4. తరువాత బీన్స్ కేరట్ కార్న్ క్యాబేజ్ వేసి ఒకే నిమిషం టాస్ చేసుకోండి. తరువాత ఉప్పు మిరియాల పొడి వేసి టాస్ చేసుకోండి
  5. టాస్ చేసుకున్న తరువాత పొడి పొడిగా వండుకున్న అన్నంతో పాటు మిగిలిన సామగ్రీ అంతా వేసి 2-3 నిమిషాలు కేవలం హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి.
  6. ఆఖరుగా వేపుకున్న చికెన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మరో నిమిషం టాస్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • G
    Gaddam shiva kumar
    Recipe Rating:
    I am Al so chef real i like small tips very helpful to improve my dishes i have a food court it's sri Amma food court nizampet Hyderabad