పనీర్ ఫ్రైడ్ రైస్
ఒక సింపుల్ రెసిపీ అన్నం మిగిలినా, స్పెషల్గా ఏదైనా చేయాలనుకున్నా, సరిగ్గా రెస్టారెంట్ టెస్ట్తో ఇంట్లోనే చేయాలనుకున్నా పనీర్ ఫ్రైడ్ రైస్ పరెక్ట్.
సింపుల్ ఇండో చైనీస్ పనీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి
చేయడానికి సమయం పట్టదు చేసినది ఖాళీ చేయడానికి అంత కంటే సమయం పట్టని రెసిపీ పనీర్ ఫ్రైడ్ రైస్. ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్ రెసిపీస్ అందరి ఫేవరెట్. అందుకేనేమో కొత్త కొత్త ఫ్రైడ్ రైస్ రెసిపీ పుట్టుకొచ్చేస్తున్నాయి.
ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మిగిలిన అన్నంతో లేదా స్పెషల్ ఆకేషన్స్ కోసం కూడా ట్రై చేయవచ్చు. ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది ఈ పనీర్ ఫ్రైడ్ రైస్.

టిప్స్
-
అన్నం ఉడికించేప్పుడు కొంచెం ఉప్పు వేసి వండితే అన్నానికి ఉప్పు పడుతుంది
-
అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నని 90% వండి వెంటనే అన్నని వడకట్టి జల్లేడలో వేసి గాలికి ఆరనిస్తే పొడి పొడిగా వస్తుంది. పూర్తిగా ఉడికిస్తే ముద్దగా అవుతుంది
-
పనీర్ హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం టాస చేస్తే చాలు ఎక్కువగా టాస్ చేస్తే పనీర్ గట్టిగా అవుతుంది
పనీర్ ఫ్రైడ్ రైస్ - రెసిపీ వీడియో
Paneer Fried Rice Recipe | Chinese Style Fried Rice | Cottage Cheese Fried Rice
Prep Time 2 mins
Cook Time 10 mins
Total Time 12 mins
Servings 2
కావాల్సిన పదార్ధాలు
- 200 gm పనీర్
- 2 చిటికెళ్లు కారం
- 1 tsp టమాటో సాస్
- 2 tsp నూనె
-
ఫ్రైడ్ రైస్ కోసం
- 1 cup పొడిపొడిగా వండుకున్న బాస్మతి రైస్ (150 gm)
- 2 tsp నూనె
- ఉప్పు
- 1/2 tsp ఆరొమేట్ పౌడర్
- 1/2 tsp వైట్ పెప్పర్
- 1/2 tsp నల్ల మిరియాల పొడి
- 1/4 cup కేరట సన్నని తరుగు
- 1/4 cup బీన్స్ సన్నని తరుగు
- 1 tsp లైట్ సోయా సాస్
- 2 tbsp ఉల్లి కడల తరుగు
విధానం
-
నూనెలో పనీర్ కారం టొమాటో సాస్ వేసి 2 నిమిషాలు టాస్ చేసి పనీర్ పక్కనుంచుకోండి
-
నూనె వేడి చేసి అందులో కేరట్ బీన్స్ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం టాస్ చేసుకోవాలి
-
నిమిషం తరువాత రైస్తో పాటు మిగిలిన పదార్ధాలు అన్నీ వేసి ఒక నిమిషం టాస్ చేసుకోవాలి
-
ఆఖరున ఉల్లికాడల తరుగు వేసి కలిపి దింపేసుకోండి

Leave a comment ×
97 comments