ఆలూ బటానీ పులావ్
లంచ్ బాక్సులకి లేదా వీకెండ్స్లో సింపుల్ గా వన్ పాట్ రెసిపీ కావలంటే ఆలూ మటర్ పులావ్ పర్ఫెక్ట్. ఆలూ మటర్ పులావ్ని నేను బద్దకం డేస్ స్పెషల్ అంటుంటాను. ఎందుకంటే పెద్దగా శ్రమ లేకుండా సులభంగా తయారయ్యే రెసిపీ కాబట్టి.
ఈ సింపుల్ రెసిపీ స్పెషల్ రోజుల్లో కూడా చేసుకోవచ్చు. తక్కువ టైమ్లో ఎక్కువ మార్కులు పడే రెసిపీ ఇది. ఎంత సింపుల్ అంటే కుక్కర్లో అన్నీ వేసి 2 విసిల్స్ రానిస్తే తయార్.

టిప్స్
బాస్మతి బియ్యం:
- నేను బాస్మతి బియ్యం వాడాను కాబట్టి కప్పు బియ్యనికి 1.1/4 నీళ్ళు సరిపోతాయ్. అదే మీరు సోనా మసూరి లేదా ఇంకేదైనా బియ్యం వాడితే గంట నానాలి, 2 కప్పుల నీళ్ళు అవసరం అవుతాయ్
ఇంకొన్ని టిప్స్:
- నేను ఫరోజేన్ బటానీ వాడాను కాబట్టి ఆఖరున వేసినా ఉడికిపోతాయ్, అదే మీరు తాజా బటానీ వాడితే ఉల్లిపాయతో పాటు వేసి వేపుకోవాలి
ఆలూ బటానీ పులావ్ - రెసిపీ వీడియో
Potato Peas Rice | Aloo Matar Pulao | Bachelors Special Aloo Matar Pulao | Veg Pulav
Flavored Rice
|
vegetarian
Prep Time 2 mins
Cook Time 15 mins
Resting Time 15 mins
Total Time 32 mins
Servings 2
కావాల్సిన పదార్ధాలు
- 2 tbsp నూనె
- 1 బిరియానీ ఆకు
- 4 లవంగాలు
- 5 యాలకలు
- 1/2 tsp షాహీ జీరా
- 1 ఇంచ్ దాల్చిన చెక్క
- 1 నల్ల యాలక
- 1 మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు
- 1 tsp అల్లం వెల్లులి ముద్ద
- ఉప్పు
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 1 ఆలూ ముక్కలు (చెక్కు తీసినవి)
- 1/2 cup బటానీ
- 1 cup గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం (180 gm)
- పుదీనా తరుగు – కొద్దిగా
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- 1 1/4 cup నీళ్ళు
విధానం
-
కుక్కర్లో నూనె వేడి చేసి అందులో బిర్యానీ అక్కు, యాలకలు, లవంగాలు, షాహీజీరా, నల్ల యాలక వేసి వేపుకోవాలి.
-
ఉల్లిపాయ చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకుని ఆలూ ముక్కలు కూడా వేసి ఆలూ కూడా లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
ఆలూ వేగిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి.
-
ఎసరు నీళ్ళు పోసి అందులో పచ్చిమిర్చి, ఉప్పు, బటానీ వేసి హై ఫ్లేమ్ మీద ఎసరు మరగనివ్వాలి.
-
మరుగుతున్న ఎసరులో గంట సేపు కడిగి నానబెట్టిన బాస్మతి బియ్యం కొత్తిమీర పుదీనా వేసి కలిపి మూత పెట్టి 1 విసిల్ రానిచ్చి స్టవ్ ఆపేసి స్టీమ్ పోయేదాక ఉంచి తీసి చాలల్ని రైతా లేదా స్పైసీ పనీర్ కర్రీతో సర్వ్ చేసుకోండి.

Leave a comment ×
3 comments