వైట్ చిత్రాన్నం | సబ్సిగే సొప్పు చిత్రాన్నం | కర్ణాటక స్టైల్ సబ్సిగే సొప్పు రైస్

తాలింపులో కొబ్బరి సొయ కూర ఆకులు వేసి వేపి అన్నంతో కలిపి దింపేసే అద్భుతమైన లంచ్ బాక్స్ రెసిపీ కర్ణాటక స్పెషల్ వైట్ చిత్రాన్నం. సొప్పు అంటే కన్నడలో సోయ కూర.

కమ్మని కొబ్బరి తురుము, సొయా కూర పరిమళంతో తెలిసి తెలియని పిలుపుతో చాలా రుచిగా ఉంటుంది సొప్పు రైస్.

అన్నీ సిద్ధం చేసి ఉంచుకుంటే వైట్ చిత్రాన్నం తయారు చేయడానికి పెట్టె సమయం కేవలం ఐదే నిమిషాలు. పిల్లల లంచ్ బాక్సులకి, ఆఫీసులకు వెళ్లే వారికి తక్కువ టైంలో తయారయ్యే గొప్ప రెసిపీ ఇది. ఇందులో పొట్ట హాయినిచ్చే పద్దార్దాలు మాత్రమే ఉన్నాయ్.

రైస్ రెసిపీస్ పేరుతో రోజూ అల్లం వెల్లులి పేస్ట్ గరం మసాలాలు వేసి చేసే రైస్ రెసిపీస్ నాకు అంతగా ఇష్టం ఉండదు. అందుకే ఈ సొప్పు రైస్ నాకు చాలా ఇష్టం.

White Chitrannam | Karnataka Style Sabsige Soppu Chitranna

టిప్స్

సొయ కూర:

  1. కొద్దిగా వేసినా చాలా పరిమళం ఈ సోయ ఆకు తరుగు. ఆకు 2-3 నిమిషాలు బాగా వేగాలి అప్పుడు సొయా కూరలోని పసర వాసనా ఘాటు పరిమళం తగ్గి రుచిగా ఉంటుంది.

ఇంకొన్ని టిప్స్:

  1. సొయా కూర దొరకని వారు మెంతి కూర, పాల కూర ఆకు తరుగు, తోటకూర తరుగు వేసి వేపి కూడా ఇదే తీరులో చేసుకోవచ్చు.

  2. ఉల్లిపాయ తినని వారు స్కిప్ చేసుకోండి.

వైట్ చిత్రాన్నం | సబ్సిగే సొప్పు చిత్రాన్నం | కర్ణాటక స్టైల్ సబ్సిగే సొప్పు రైస్ - రెసిపీ వీడియో

White Chitrannam | Karnataka Style Sabsige Soppu Chitranna

Leftover Rice Recipes | vegetarian
  • Prep Time 30 mins
  • Cook Time 5 mins
  • Total Time 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం - పొడి పొడిగా వండుకున్నది (185 grams)
  • 4 tbsps నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 tbsp పచ్చి సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1/2 tsp మిరియాలు
  • 3 పచ్చిమిర్చి చీలికలు
  • 2 ఎండు మిర్చి
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు
  • 12 - 15 జీడిపప్పు
  • 3 tbsp వేరుశెనగగుండ్లు
  • 1 cup పచ్చికొబ్బరి తురుము
  • 1 tbsp నిమ్మరసం
  • 1/3 cup సొయకూర ఆకు తరుగు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేరుశెనగగుండ్లు వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
  2. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర సెనగపప్పు మినపప్పు మిరియం గింజలు ఎండుమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద తాలింపు ఎర్రగా వేపుకోవాలి.
  3. కచ్చితంగా తాలింపు ఎర్రగా వేగాక పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి.
  4. ఉల్లిపాయ గులాబీ రంగులోకి మారిన తరువాత సాయకూర ఆకు తరుగు వేసి 2-3 నిమిషాలు వేపుకోండి.
  5. వేగిన ఆకులోని పసరు వాసన పోతుంది అప్పుడు ఉడికిన అన్నం పచ్చికొబ్బరి తురుము వేసి మంట హై-ఫ్లేమ్ లోకి పెంచి మెతుకు వేడెక్కేదాకా కలుపుకోండి.
  6. దింపే ముందు వేపి పక్కనుంచుకున్న జీడిపప్పు పల్లెలు నిమ్మరసం పిండి కలిపి దింపేసుకోండి.
  7. ఈ రైస్ లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

White Chitrannam | Karnataka Style Sabsige Soppu Chitranna