తాటిముంజుల షర్బత్ | ఐస్ ఆపిల్ షర్బత్ | సమ్మర్ స్పెషల్ తాటి ముంజల షర్బత్
తాటి ముంజలు పాయసంవేసవిలో విరివిగా దొరికే తాటి ముంజలని నాన్నారి షర్బత్ ని కాస్త బరక గ్రైండ్ చేసి అందులో సోడా ఐసు ముక్కలు వేసి చేసే అద్భుతమైన షర్బత్ తయారీకి రెండంటే రెండే నిమిషాల సమయం పడుతుంది.
తాటిముంజలని ఏదాతధంగా తినడం అందరికి ఎంతో ఇష్టం, అదే ఆ ముంజలని ఇలా సింపుల్ గా షర్బత్ చేసుకుని తాగితే ఎంతో సేద తీరియునా అనుభూతి కలుగుతుంది. తప్పక ప్రయత్నించి కామెంట్ చేసి చెప్పండి.

తాటిముంజుల షర్బత్ | ఐస్ ఆపిల్ షర్బత్ | సమ్మర్ స్పెషల్ తాటి ముంజల షర్బత్ - రెసిపీ వీడియో
2 mins Ice apple sharbath | Tati Munjala Sharbath | Summer Special Ice Apple Sharbat
Summer Recipes
|
vegetarian
Prep Time 1 min
Total Time 1 min
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 6 లేత తాటిముంజలు
- ½ cup సుగంధిపాల పాకం
- 2 tbsp నానబెట్టిన సబ్జా
- 750 ml చల్లని నీరు/సోడా
- 10 ఐసు ముక్కలు
- 1 ½ - 2 tbsp నిమ్మరసం
విధానం
-
సబ్జా గింజల్ని బోలెడన్ని నీరు పోసి నానబెట్టుకోండి.
-
చెక్కు తీసుకున్న తాటి ముంజలలో నాన్నారి షర్బత్ పాకం పోసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి.
-
గిన్నెలో ఐసుముక్కలు తాటిముంజల మిశ్రమం నానబెట్టుకున్న సబ్జా గింజలు చల్లని నీరు/సోడా నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వ్ చేసుకోండి.
-
సోడా కలిపితే వెంటనే సర్వ్ చేసుకోండి. నీళ్లు పోసుకుంటే ఫ్రిజ్లో ఉంచి కూడా సర్వ్ చేసుకోవచ్చు.

Leave a comment ×
1448 comments