సొరకాయ (bottle gourd ) పప్పు (dal) మామూలు తెలుగు వారి పప్పు తీరు ఘాటుగా కారంగా పుల్లగా ఉండదు. కమ్మగా పొట్టకి హాయిగా ఉంటుంది. ఈ కమ్మని సొరకాయ పప్పు అన్నంతోనే కాదు రొట్టెలతో కూడా చాలా రుచిగా ఉంటుంది.

మామూలుగానే నాకు రోజు భోజనంలో ఉండాల్సిందే, అందుకే మా ఇంట్లో రోజు చేసే పప్పునే పప్పులు మార్చి మార్చి చేస్తుంటాము. అలా మా ఇంట్లో ఎక్కువగా చేసుకుంది అందరికి నచ్చే పప్పు ఈ సొరకాయ పప్పు.

ఈ పప్పు చూడ్డానికి మాములు పప్పులా తెలిసిన పప్పులా అనిపిస్తుంది కానీ ఈ పప్పులో కారాలు నూనెలు చాలా తక్కువగా ఉంటాయి, చింతపండుకి బదులు ఆఖరున నిమ్మరసం పిండుకోవాలి, అప్పుడే రుచి.

ఈ సింపుల్ పప్పుని నాలా అన్నీ కలిఫై కుక్కర్లో వేసి మూడు కూతలు వచ్చే దాకా ఉడికించి తాలింపు పెట్టుకోవచ్చు లేదా ఆరోగ్యంగా అన్నీ పోషకాలు అందాలి అనుకుంటే మరో తీరులోనూ చేసుకోవమీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు పుదీనా పప్పు

టిప్స్

పప్పులు:

  1. నేను పెసరపప్పు కందిపప్పు కలిపి పప్పు చేశాను. మీకు నచ్చితే మొత్తంగా పెసరపప్పు లేదా కందిపప్పు అయినా వాడుకోవచ్చు

  2. పప్పులు కచ్చితంగా బాగా నానితే పప్పు మెత్తగా ఉడుకుతుంది.

కారం:

  1. ఈ పప్పులో కారం చాలా మితంగా ఉండాలి, అప్పుడే సొరకాయ కమ్మదనాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు, ఇంకా చపాతీలతో అన్నంతో పప్పు ఎక్కువగా తినగలుగుతారు

ఆరోగ్యకరమైన తీరు:

  1. సొరకాయ ముక్కలని ఉప్పేసి మెత్తగా విడిగా వండుకోవాలి. పప్పు ఇంకా పప్పులో వేసేవి అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా విడిగా వండుకోవాలి. తరువాత ఉడికిన పప్పుని మెత్తుగా ఎనుపుకుని విడిగా ఉడికించుకున్న సొరకాయ ముక్కలు వేసి కలిపి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేస్తే కోమలమైన సొరకాయ లోని పోషకాలు పరిపూర్ణంగా అందుతాయి.

  2. నిజానికి సొరకాయ బీరకాయ పొట్లకాకాయ లాంటి కోమలమైన కాయలని కుక్కర్లో వండాల్సిన అవసరం లేదు. ఏదో వంట త్వరగా అయిపోవాలని చేసే పని అంతే! ఇలా విడిగా వండి చేస్తే రుచి కూడా చాలా బాగుంటుంది.

చల్ల మిరపకాయాలు:

  1. ఈ పప్పులో మా ఇంట్లో యందు మిర్చికి బదులు చల్ల మిరపకాయలు వాడతారు. చాలా రుచిగా ఉంటుంది. చల్ల మిరపకాయలు వేయడానికి ప్రయత్నం చేయండి, లేనట్లయితే యందు మిర్చి వేసుకోండి.

నెయ్యి/నూనె:

  1. ఈ కమ్మని పప్పుకి నూనె కంటే నెయ్యి తాలింపు పరిమళం చాలా బాగుంటుంది. నచ్చితే నూనె అయినా వాడుకోవచ్చు.

సొరకాయ పప్పు - రెసిపీ వీడియో

Sorakaya Pappu | BottleGourd Dal | Lauki dal

Bachelors Recipes | vegetarian
  • Prep Time 1 hr
  • Cook Time 20 mins
  • Total Time 1 hr 20 mins
  • Serves 6

కావాల్సిన పదార్ధాలు

  • 3 Cups లేత చెక్కు తీసిన సొరకాయ ముక్కలు
  • 1 టమాటో ముక్కలు
  • 1 ఉల్లిపాయ తరుగు
  • 3/4 Cup నానబెట్టిన కంది పప్పు
  • 1/4 Cup నానబెట్టిన పెసరపప్పు
  • 1/4 tbsp పసుపు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 3 Cups నీళ్లు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1 tbsp నిమ్మరసం
  • 1/4 Cup కొత్తిమీర తరుగు
  • తాలింపు కోసం:
  • 2 tbsp నెయ్యి/నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1 tbsp జీలకర్ర
  • 2 Pinches ఇంగువ
  • 2 చల్ల మిరపకాయలు
  • 2 Springs కరివేపాకు
  • 2 దంచిన వెల్లులి

విధానం

  1. కుక్కర్లో ఉప్పు నిమ్మరసం కొత్తిమీర తరుగు తప్పా మిగిలిన సామాగ్రీ వేసి మూడు కూతలు వచ్చే దాకా మెత్తగా ఉడికించుకోవాలి.
  2. ఉడికిన పప్పుని మెత్తగా ఎనుపుకొవాలి
  3. నెయ్యి వేడి చేసి తాలింపు సామాగ్రీ వేసి ఎర్రగా వేపి పప్పులో కలుపుకోవాలి
  4. తాలింపు కలుపుకున్న పప్పులో ఉప్పు నిమ్మరసం కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • K
    Krish
    Thanks for the recipe! Neyyi tho taalimpu nijam gaa chaalaa baagundi.
  • K
    Khaja
    Recipe Rating:
    Lemon juice enhanced the taste of daal . Superb