ఆవకాయ చికెన్ ధం బిర్యానీ
బిర్యానీలు అంటే ప్రాణం పెట్టె వారికి మరో అద్భుతమైన బిర్యానీ ఆంధ్రా స్పెషల్ ఆవాకాయ బిర్యానీ!!! కారంగా ఘాటుగా ఉండే ఆవకాయ బిర్యానీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
బిర్యానీ అనగానే హైదరాబాదీ బిర్యానీ గుర్తుకొచ్చేస్తుంది బిర్యానీ ప్రియులకి. ఈ ఆవకాయ బిర్యానీ భిన్నంగా ఉంటుంది. కారంగా ఉంటుంది మసాలాల ఘాటు తక్కువగా ఉంటుంది. చికెన్ ముక్కలు ఆవకాయతో ఉడికి చాలా రుచిగా ఉంటుంది.
ఆవకాయ చికెన్ బిర్యానీ నాకు తెలిసి విజయవాడ రెస్టారెంట్లలో పుట్టింది. ఈ ఆవకాయ చికెన్ బిర్యానీ రెసిపీ ఇప్పుడు దాదాపుగా అన్నీ తెలుగు రెస్టారెంట్లలో టాప్ లిస్ట్లో ఉంటోంది అంటే అర్ధం చేసుకోవచ్చు, ఎంతలా ఈ బిర్యానీని ఇష్టపడుతున్నారో.
ఆవాకాయ చికెన్ బిర్యానీతో చల్లని రైతా బెస్ట్ కాంబినేషన్. ఎప్పుడు చేసినా 100% బెస్ట్ రేశాలటస్ రావడానికి కింద టిప్స్ చూడండి.

టిప్స్
చికెన్:
- చికెన్ ఎప్పుడూ బిర్యానీ కట్ ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది బిర్యానీకి
మసాలాలూ:
-
ఈ ఆవకాయ బిర్యానీలో గరం మసాలా దినుసులు చాలా తక్కువగా ఉండాలి అప్పుడే ఆవాకాయ ఫ్లేవర్ని ఆస్వాదిస్తూ తింటారు. ఎక్కువగా మసాలాలు వేస్తే నార్మల్ బిర్యానీ లో ఆవకాయ పచ్చడి వేసినట్లే ఉంటుంది
-
ఈ బిర్యానీకి పుదీనా కొత్తిమీర షాహీజీరా లాంటివి అవసరం లేదు. అవి వేస్తే బిర్యానీ ఫ్లేవర్ మారిపోతుంది. ఆవకాయ పచ్చడి:
-
నేను మామిడి ఆవకాయ పచ్చడి వాడాను. మీరు కావలనుకుంటే ఉసిరి, పచ్చిమిర్చి ఊరగాయ కూడా వాడుకోవచ్చు.
-
ఈ బిర్యానీలో ఉప్పులో ఊరేసిన ఆవకాయ పచ్చడి ఉండటాన తగ్గించి వేసుకోవాలి ఉప్పు.
బాస్మతి రైస్:
-
సంవత్సరం కంటే పాత బాస్మతి రైస్తో బిర్యానీ ఎప్పుడూ బెస్ట్గా వస్తుంది.
-
అన్నాన్ని 70% ఉడికించుకుంటే సరిపోతుంది. 70% అంటే ఒక మెతుకు నోట్లో వేసుకుంటే తెలుస్తుంది, సగం పైన ఉడికి ఇంకా పలుకుగా తగులుతుంది అది 70% కుక్ అవ్వడం అంటే.
ఆఖరుగా:
- ఈ ఆవకాయ బిర్యానీ సర్వ చేసేప్పుడు పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనీయన్ చల్లి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది.
ఆవకాయ చికెన్ ధం బిర్యానీ - రెసిపీ వీడియో
Aavakaya Chicken Biryani | Achari Chicken Biryani | How to cook Avakai Chicken Dum Biryani
Prep Time 5 mins
Soaking Time 2 hrs
Cook Time 25 mins
Resting Time 20 mins
Total Time 2 hrs 50 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
-
బిర్యానీ మసాలా కోసం
- 1 tsp జీలకర్ర
- 1.5 tbsp ధనియాలు
- ½ అనాసపువ్వు
- 3 లవంగాలు
- 3 యాలకలు
- 1/2 ఇంచ్ దాల్చిన చెక్క
- జాజి కాయ – చిన్న ముక్క
- 1/2 tsp మిరియాలు
- 1/2 జాపత్రి
-
చికెన్ నానబెట్టడానికి
- 1/2 kilo చికెన్
- 1.5 tbsp అల్లం వెల్లులి ముద్ద
- 1 tbsp అల్లం తరుగు
- బిర్యానీ మసాలా
- 1/2 cup పెరుగు
- 1/2 cup వేపిన ఉల్లిపాయలు
- ఉప్పు
- 1 tbsp కారం
- 2 tbsp నూనె
-
బిర్యానీ రైస్ ఉడికించుకోడానికి
- 2 liters నీళ్ళు
- 5 యాలకలు
- 1 అనాసపువ్వు
- 1 బిర్యానీ ఆకు
- 1.5 ఇంచ్ దాల్చిన చెక్క
- 1 tbsp నిమ్మరసం
- 2 cups బాస్మతి బియ్యం (300 gms)
- 3 tbsp ఉప్పు
- 4 చీరిన పచ్చిమిర్చి
-
బిర్యానీ కోసం
- 3 tbsp నూనె
- 2 tsp నెయ్యి
- 1 నల్ల యాలకల
- 3 యాలకలు
- 4 లవంగాలు
- 1 ఇంచ్ దాల్చిన చెక్క
- నానబెట్టిన చికెన్
- 1/4 cup నీళ్ళు
- 6 - 7 చీరిన పచ్చిమిర్చి
- 1/4 cup అన్నం ఉడికించుకున్న నీళ్ళు
- 3 tbsp వేపుకున్న ఉల్లిపాయ
- 2 tbsp నూనె
- 2 tsp రెడ్ ఫుడ్ కలర్
- ఉడికించుకున్న అన్నం
- 1/3 cup మామిడి ఆవకాయ పచ్చడి (60 gm)
విధానం
-
బిర్యానీ మసాలా కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేసుకోండి.
-
చికెన్ నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి చికెన్ని రుద్దుతూ బాగా పట్టించి ఫ్రిజ్లో రెండు గంటలు నానాబెట్టాలి.
-
అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె వేడి చేసి అందులో నల్ల యాలక యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క నానబెట్టుకున్న చికెన్ కొద్దిగా నీళ్ళు వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 10 నిమిషఅలౌ మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ మూతపెట్టి ఉడికించుకోవాలి.
-
15 నిమిషాలా తరువాత ఆవకాయ్ పచ్చడిలో కాసిని నీళ్ళు పోసి కలిపి పచ్చడిలో వేసుకోండి ఇంకా చీరయిన పచ్చిమిర్చి పావు కప్పు నీళ్ళు పోసి నూనె పైకి తేలేదాక చికెన్ కుక్ చేసుకోవాలి.
-
నూనె పైకి తేలాక చికెన్ పొయ్యి మీద నుండి దింపేసుకోవాలి.
-
నీళ్ళలో మసాలా దినుసులు ఉప్పు చీరిన పచ్చిమిర్చి వేసి మరగ కాగానివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యం నిమ్మరసం వేసి హై-ఫ్లేమ్ మీద 70% కుక్ చేసుకోవాలి.
-
70% ఉడికిన అన్నాన్ని ఉడికించుకున్న చికెన్ పైన వేసుకోవాలి.
-
అన్నం మీద రెడ్ ఫుడ్ కలర్, వేపుకున్న ఉల్లిపాయ తరుగు, నూనె, అన్నం ఉడికించుకున్న నీళ్ళు పోసి మైదా పిండి ముద్ద అంచున ఉంచి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ధం చేసి 20 నిమిషాలు వదిలేయాలి. లేదా ఆవిరి బయటకి వేగంగా వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయాలి అని గుర్తుంచుకోండి.
-
20 నిమిషాల తరువాత అడుగు నుండి బిర్యానీ తీసి పైన వేపుకున్న ఉల్లిపాయలు వేసి చల్లని రైతాతో సర్వ చేసుకోండి.

Leave a comment ×
6 comments