డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ | హైదరాబాదీ డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ

స్పైసీగా తిన్న కొద్దీ తినాలనిపించే చికెన్ బిర్యానీ కోసం చూస్తున్నారా? అయితే నా స్టైల్ “హైదరాబాదీ డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ” చేయండి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది. రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

బిర్యానీ ప్రియులకి చికెన్ ధం బిర్యానీ అంటే ఒక పండుగలా అనిపిస్తుంది తింటున్న ప్రతీ సారి. అందులోనూ వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ చికెన్ ధం బిర్యానీ గురుంచి ప్రేత్యేకంగా చెప్పాలా.

బిర్యానీలు ఎన్నో రకాలుగా చేసినా, హైదరాబాదీ బిర్యానీ ఘాటు, పులుపు, రుచి, సువాసన ఎంతో ప్రేత్యేకం. నిజాముల బిర్యానీకి తెలుగు వారి మసాలాల ఘాటు, పులుపు తగిలి మరింత రుచిగా మారింది హైదరాబాదీ బిర్యానీ.

మిగిలిన బిర్యానీలతో పోలిస్తే హైదరాబాదీ బిర్యానీ ఘాటుగానే ఉంటుంది, కానీ బిర్యానీ చేసినప్పుడు చికెన్ తో పాటు ఉడికిన మసాలా సరిపోదు. వడ్డించేప్పుడు చాలా కొద్దిగానే వస్తుంది. కొంత బిర్యానీ అన్నం తెల్లగా మరికొంత మసాలతో ఉంటుంది ఆ కొద్దిగా మసాలా సరిపోదు. అందుకే బిర్యానీ “మిర్చి కా సాలాన్” పోసుకుని తిని తృప్తి పడుతుంటారు. ఈ డబుల్ మసాలా చికెన్ బిర్యానీలో అందరికీ సరిపోను మసాలా దొరుకుతుంది.

రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు “చికెన్ బిర్యానీ విత్ డబుల్ మసాలా” అని ప్రేత్యేకంగా ఆర్డర్ చేస్తే తప్ప ఎక్కువగా మసాలా ఉండదు బిర్యానీలో. ఆ మసాలా కూడా చికెన్తో పాటు కాక విడిగా వండినదే ఇస్తారు, కాబట్టి అంత రుచిగా ఉండదు ఆ మసాలా.

ఈ రెసిపీలో నేను డబుల్ మసాలాతో ఉండే చికెన్ ధం బిర్యానీ రెసిపీ చెప్తున్నా. డబుల్ మసాలా బిర్యానీ అనగానే కొత్త రెసిపీ అనుకోకండి. రెసిపీ దాదాపుగా హైదరాబాదీ చికెన్ బిర్యానీలాగే ఉంటుంది. కానీ మసాలాల ఘాటుని బాలన్స్ చేయడం, ఇంకా ధం చేసే సమయం పద్ధతుల్లో మార్పు అంతే.

మీకు తక్కువ స్పైస్ కావాలంటే హైదరాబాదీ చికెన్ ధం బిర్యానీ చూడండి.

Double Masala Chicken Dum Biryani Recipe | Homemade chicken Dum Biryani | How to make Chicken Dum Biryani

టిప్స్

బాస్మతి బియ్యం: గంట సేపు నాని సంవత్సరం కంటే పాత బాస్మతి బియ్యం ఎప్పుడూ చక్కగా పొడిపొడిగా ఉడుకుతుంది.

బిర్యానీలో చికెన్ ఎందుకు చప్పగా ఉంటుంది?

  1. చికెన్కి మసాలాలు బాగా రుద్ది పట్టించి కనీసం రాత్రంతా ఫ్రిజ్లో వదిలేస్తే మసాలాలూ చికెన్ పీల్చి ఎంతో రుచిగా ఉంటుంది చికెన్

  2. రాత్రంతా ఫ్రిజ్లో ఉంచే సమయం లేని వారు కనీసం 3 గంటలైనా మసాలాలు పట్టించి బయట లేదా ఫ్రిజ్లో ఉంచాలి.

డబుల్ మసాలా బిర్యానీలో తెలుసుకోవలసిన కొన్ని టిప్స్:

  1. డబుల్ మాసాలా బిర్యానీ అంటే కారం ఘాటుగా ఉన్నా, తినగలిగేట్లు ఉండాలి. అంత కారాన్ని మసాలాలన్నీ కమ్మని పెరుగు, ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీగడ, నిమ్మరసం వేసి బాలన్స్ చేయాలి. అప్పుడే తిన్న కొద్ది తినాలనిపిస్తుంది.

  2. డబుల్ మసాలాలో మరుగుతున్న ఎసరు నీళ్ళు పోసి కలుపుకోవాలి, లేదంటే ధం చేసేప్పుడు మసాలా మాడిపోతుంది.

  3. చికెన్కి మసాలాలు పట్టించే ముందు ఉల్లిపాయాలని నలుపుతూ గట్టిగా 2-3 నిమిషాలు పిండుతూ కలుపుకోవాలి అప్పుడే మసాలాల్లోని సారమంతా చికెన్కి పడుతుంది.

నెయ్యి- నూనె:

  1. బిర్యానీలో నెయ్యి కాస్త ఎక్కువగా ఉండాలి, అప్పుడే రుచి. అన్నీ నేను చెప్పినట్లే మీరు చేసినా అనుకున్నంత రుచి రాలేదంటుంటారు కొందరు. దానికి వేయాల్సినంత నెయ్యి నూనె, మసాలాలూ వేయకపోతేనే అవుతుంది.

  2. మామూలు నూనె వాడే కంటే కూడా బిర్యానీలో ఉల్లిపాయలు వేపగా మిగిలిన నూనె వాడితే వచ్చే రుచి మామూలు నూనె వాడితే రాదు.

ఎండిన గులాబీ రేకులు:

  1. ఎండిన గులాబీ రేకులు ప్రేత్యేకమైన రుచినిస్తుంది. గులాబీ రేకులు లేని వారు రోజ్ వాటర్ వేసుకోవచ్చు. రోస్ వాటర్ అంటే కేర్ బ్యూటీలో వాడే రోస్ వాటరే.

బిర్యానీ అడుగు మాడకుండా ధం ఎలా చేసుకోవాలి:

  1. మామూలు చికెన్ ధం బిర్యానీ నలుగురుకి చేసే కొలతకి నేను హై – ఫ్లేమ్ మీద 8 నిమిషాలు లో- ఫ్లేమ్ మీద 7 నిమిషాలు ధం చేసి 20 నిమిషాలు వదిలేయండి అని చెప్తుంటాను. కానీ ఈ డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ కి బిర్యానీలోంచి ఆవిరులు తన్నుకొస్తుండే దాకా హై-ఫ్లేమ్ మీద వండుకోవాలి మీద ఆ తరువాత గిన్నె 4 అంచులు ఒక్కో వైపు రెండేసి నిమిషాలు సిమ్లో వండుకుంటే మసాలా మాడకుండా ఉడుకుతుంది. నాకు 16 నిమిషాలకి ఆవిరి వేగంగా వచ్చింది.

  2. బిర్యానీ వండడం అయ్యాక ధం చేసేప్పుడు నేల మీద పెడితే వేడి మొత్తం నేల లాగేసుకుంటుంది, అప్పుడు ధం మీద ఉడకాల్సినది సరిగా ఉడకదు. అందుకే బిర్యానీ కింద స్టవ్ ఆపేసి పొయ్యి మీదే వదిలేయాలి లేదా మరో స్టాండ్ మీద పెట్టి వదిలేయాలి.

ఉప్పు:

  1. ఎసరు మరుగుతున్నప్పుడు వేసే ఉప్పె అన్నానికి పడుతుంది అందుకే ఎసరులో ఎక్కువగా ఉప్పు వేసి మరిగించాలి. ఎసరు రుచి చూస్తే సముద్రపు ఉప్పు నీరంత ఉప్పగా ఉండాలి. ఈ స్టేజ్లో ఉప్పు సరి చేయకపోతే ఇక ఆ తరువాత ఉప్పు బిర్యానీలో వేసి కలవదు, కరగదు. ధం గురుంచి కొన్ని టిప్స్:

  2. బాస్మతి రైస్ ఎసరు తెరల కాగుతునప్పుడు మాత్రమే వేసి 60% పెద్ద మంట మీద కుక్ వండుకోవాలి. 60% అంటే బియ్యం గింజ నోట్లో వేసుకుంటే తెలుస్తుంది సగం పైన ఉడికి ఇంకాస్త పలుకుగా ఉంటుంది.

  3. 60% ఉడికిన అన్నాన్ని చికెన్ పైన వేసుకోండి. మరో 5 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద వండితే 70% ఉడుకుతుంది దాన్ని 60% ఉడికిన అన్నం పైన వేసుకోవాలి అలాగే మరో 3-4 నిమిషాలు ఉడికిస్తే 80% ఉడుకుతుంది దాన్ని ఆఖరుగా వేసుకోవాలి. ఇలా వేస్తేనే బిర్యానీ పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉడుకుతుంది.

  4. ఉడికిన అన్నం చికెన్ మీద వేసే ముందు కచ్చితంగా గిన్నె అంచుల వెంట మసాలాలు తుడిచేయాలి. లేదంటే ధం చేసేప్పుడు మసాలాలు మాడిపోతాయ్.

Double Masala Chicken Dum Biryani Recipe | Homemade chicken Dum Biryani | How to make Chicken Dum Biryani

డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ | హైదరాబాదీ డబుల్ మసాలా చికెన్ ధం బిర్యానీ - రెసిపీ వీడియో

Double Masala Chicken Dum Biryani Recipe | Homemade chicken Dum Biryani | How to make Chicken Dum Biryani

Non Veg Biryanis | nonvegetarian
  • Cook Time 30 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr
  • Servings 7

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్కి డబుల్ మసాలా కోసం
  • 700 gm చికెన్
  • 250 ml పెరుగు (250 ml)
  • 1/4 cup పాల మీగడ
  • 2 tbsp నెయ్యి
  • 1/4 cup ఉల్లిపాయలు వేపుకున్న నూనె
  • ఉప్పు
  • 1 tbsp షాహీ జీరా
  • 10 లవంగాలు
  • 8 యాలకలు
  • 2 inches దాల్చిన చెక్క
  • 2 మరాటీ మొగ్గ
  • 1 బిర్యానీ ఆకు
  • 1 జాపత్రి
  • 1 tbsp యాలకల పొడి
  • 1 tbsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tbsp వేయించిన ధనియాల పొడి
  • 2 tbsp కారం
  • 1.5 tbsp ఉప్పు
  • 1 tbsp గరం మసాలా
  • 1/2 cup చిన్న కట్ట కొత్తిమీర తరుగు
  • 1/2 cup చిన్న కట్ట పుదీనా తరుగు
  • రెండు పెద్ద ఉల్లిపాయలు ఎర్రగా వేపుకున్నది
  • 2.5 tbsp రెండు నిమ్మకాయల రసం
  • 1.5 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • బిర్యానీ రైస్ వండుకోవడానికి
  • 2.5 cups బాస్మతి బియ్యం (375 gm)
  • 2.5 liters ఎసరు నీళ్ళు
  • 5 tbsp ఉప్పు
  • 1 tbsp షాహీ జీరా
  • 10 లవంగాలు
  • 6 యాలకలు
  • 2 inch దాల్చిన చెక్క
  • 1 జాపత్రి
  • 2 మరాటీ మొగ్గలు
  • 2 అనాస పువ్వులు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 3 tbsp కొత్తిమీర తరుగు
  • 3 tbsps పుదీనా తరుగు
  • 1 tbsp నిమ్మరసం
  • 3 tbsp ఎండిన గులాబీ రేకులు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • ధం చేసుకోడానికి
  • మైదా పిండి ముద్ద
  • 1/4 tsp గరం మసాలా
  • 1/2 cup నెయ్యి
  • 1/4 cup ఉల్లిపాయలు వేపుకున్న నూనె
  • 1/4 cup ¼ పాలల్లో నానబెట్టిన చిటికెడు కుంకుమ పువ్వు
  • 2 tbsp వేపుకున్న ఉల్లిపాయలు
  • కొద్దిగా కొత్తిమీర తరుగు
  • 1/3 cup ఎసరు నీళ్ళు

విధానం

  1. చికెన్ మసాలా కశవం ఉంచిన పదార్ధాలన్నీ వేసి గట్టిగా పిండుతూ మసాలాల్ని కలుపుకోవాలి.
  2. మసాలాలు కలిపాక చికెన్ వేసి మసాలాని బాగా రుద్ది చికెన్కి పట్టించి రాత్రంతా లేదా కనీసం 3 గంటలైన ఫ్రిజ్లో ఉంచండి
  3. బాస్మతి బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టాలి
  4. ఎసరు మరిగించి అందులో ఎసరు వేసే మసాలా సామానంతా వేసి ఎసరుని మసల కాగనివ్వాలి.
  5. తరువాత నానిన బాస్మతి బియ్యం వేసి హై- ఫ్లేమ్ మీద 60% ఉడికించుకోవాలి.
  6. మరుగుతున్న ఎసరులోంచి 100 ml ఎసరుని నానబెట్టిన చికెన్లో కలుపుకోవాలి. గిన్నె అంచుల వెంట ఉన్న మసాలాలు శుభ్రంగా తుడిచేయాలి.
  7. 60% ఉడికిన అన్నాన్ని వడకట్టి చికెన్ మీద రెండు లేయర్స్ గా వేసుకోవాలి. దాని మీద 70% ఉడికిన అన్నాన్ని మరో లేయర్ గా దాని మీద ఆఖరుగా 80 % ఉడికిన అన్నం వేసుకుని అన్నాన్ని సమానంగా సర్దుకోవాలి.
  8. తరువాత ధం చేసుకునే పదార్ధాలన్నీ అన్నం మీద వేసుకోండి. నెయ్యి, నూనె, కుంకుమ పువ్వు పాలు బిర్యానీ అంతా పోసుకోండి. ఎసరు నీళ్ళు గిన్నె అంచుల వెంట పోసుకోండి.
  9. మైదా ముద్ద గిన్నె అంచుల వెంట పెట్టి గట్టిగా మూత బిగించి ఒక దగ్గర చిన్న రంధ్రం చేసుకుని పొయ్యి మీద హై-ఫ్లేమ్ మీద చేసుకున్న రంధ్రం నుండి వేగంగా వచ్చేదాకా హై-ఫ్లేమ్ వండుకోండి.
  10. స్టీమ్ వేగంగా వస్తున్నప్పుడు మంట తగ్గించి గిన్నె నాలుగు వైపులా అంటే ఒక్కో వైపు రెండేసి నిమిషాలు సన్నన్నీ సెగ మీద నాలుగు వైపులా వండుకుని. మళ్ళీ మధ్యలో మరో రెండు నిమిషాలు వండి స్టవ్ ఆపేసి 30 నిమిషాలు వదిలేయాలి.
  11. 30 నిమిషాల ధం మీద చికెన్ బాగా ఉడికి అన్నం పొడి పొడిగా ఉడికిపోతుంది. 30 నిమిషాల తరువాత అడుగు నుండి తీసి చల్లని రైతాతో సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

27 comments

  • L
    Lakshman
    Recipe Rating:
    I have cooking double masala dum biryani Super recipe 🤘👌
  • S
    Suprajaraj
    Recipe Rating:
    Fanstatic bro I feel it ... Mi recipes nenu follow avutuntanu youtub loo superb anna chala perfect and delicious ga vastayi mi tips tho cooking cheste Thanks brother
  • U
    Ubaid ur Rahman
    Recipe Rating:
    Easy recipe to cook. Thanks for sharing it. With love ❤️ from https://mommyandkitchen.com/
  • A
    Ajit
    "Deliciously aromatic and flavorful Dum Biryani! Every bite is a burst of authentic spices and tender meat, truly a culinary delight." Also watch my recipe https://ajitrecipe99.blogspot.com/2023/07/dum-biryani-recipe.html
  • N
    Ni
    Can you give the brand or recipe for the garam masala used here?
  • N
    Nayomi
    Recipe Rating:
    Yummy 😋😋
  • S
    Satyanarayana
    Recipe Rating:
    Super recipe i tried this recipe Its just awesome Thanks
  • S
    Sai
    Should we increase the dum time Accordingly if we are increasing the quantity of chicken and rice.
  • S
    Samyuktha
    This is single handled the best recipe out here for authentic biryani. We made this for a party at our place and everyone loved it! Your clear instructions and very precise measurements made it a breeze to follow! We did the last part in the oven after layering at 400F for 55 minutes! Just perfevt! Thank you so much
  • A
    Abinash
    Recipe Rating:
    Simply superb chala Baga vachindi anna
  • Y
    Yamini
    Recipe Rating:
    Crazy....... I tried it came soo good I was wondering that will chicken cook in the time you have given, but really it was really yummy.... Thank you...🤗👍👏
  • M
    Mohan
    Recipe Rating:
    Good job anna, keep doing...
  • C
    CH PRADEEP KUMAR
    Recipe Rating:
    Sir, please provide quantity of ingredients required for 1kg chicken and rice.
  • S
    Swathi
    Sir chicken ni kodi sepu fry chesi dum cheyala lekuntey alaney dum cheyala
  • R
    Rukmandher
    Anni oka 1000 rupees Lo I pothadha recipe 1500 kavala
  • S
    Susanne
    This looks so delicious! I'm confused as to how you can see the steam come out if the Biryabi is being cooked in a such a tightly sealed pot? Thanks, Susanne
  • M
    Maria
    Recipe Rating:
    can you please send me the recipe of Chicken briyani step by step to my email address, i love Indian food and tell me how to cook balsam rice
  • V
    Vinod
    Recipe Rating:
    Followed steps as is , and the result is ************ Uzbek pilaf would like you to try this with your secret tips if you can share
  • M
    Moppie
    Recipe Rating:
    I’m reading this recipe as a native English speaker, but every time I feel confusion there is an explanation with both text and images. Thanks for the post, and I’m excited about making this biryani!
  • L
    Lavanya P
    Dum Chicken ni fridge lo nundi direct ga cook cheyala ledha bayata kodhisepu peti cook cheyala chepadi plz
  • S
    sowjanyap
    ilage same kolathalatjo instant pot lo cook cheyavacha after marination in differt kadai or bowl please tell me no
    • Vismai Food
      yes you can do, go with https://vismaifood.com/en/chicken-pot-biryani-pot-biryani-matka-chicken-biryani-kunda-biryani-how-prepare-pot-chicken-biryani#pagetop
  • S
    sowjanyap
    hi andi naku mee chicken biriyani and samya upma with curd recipe chala nachindhi appudu nenu chicken try chesthanu kani exact dum cheyataniki avvatamledhu but ur vieos are really clear and awesome
  • A
    Ashwitha
    Recipe Rating:
    Your channel is really osm.....the recipes of your channel are really perfect 🥰
  • S
    Suri
    Hi andi my family loves vismai food a lot we always follow up recipes. Please let me know the brand of basmati rice you guys used to cook biryani
Double Masala Chicken Dum Biryani Recipe | Homemade chicken Dum Biryani | How to make Chicken Dum Biryani