వైట్ చికెన్ బిర్యానీ | ఈ వైట్ చికెన్ బిర్యానీనే సోఫియాని బిర్యానీ అని కూడా అంటారు

బిర్యానీలు అనేకం, ప్రతీ బిర్యానీ దేనికి అదే ప్రేత్యేకం!అందులోనూ ఈ వైట్ చికెన్ బిర్యానీ ఇంకా ప్రేత్యేకం! ఘుమఘుమలాడే ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

ప్రతీ రోజుని ప్రేత్యేకంగా మార్చేయగల సామర్ధ్యం ఉన్న రెసిపీ ఏదైనా ఉందంటే అది కేవలం “బిర్యానీ” అనిపిస్తుంది. ఆలాంటి బిర్యానీలలో ఒకటి ఈ వైట్ చికెన్ బిర్యానీ. ఈ రెసిపీ ఎక్కడ పుట్టిందో నాకు తెలియదు, కానీ నేను మొదటగా గోవాలో ఒక రెస్టారెంట్లో తిన్నాను. అక్కడి చెఫ్ని అడిగితే ఇది గోవా స్పెషల్ అన్నాడు, తరువాత గూగుల్ లక్నో అని ఇంకో చెఫ్ ముంబాయ్ అని అన్నారు.

రెసిపీ ఎక్కడ పుట్టినా నేను తిన్నది గోవాలో, కాబట్టి గోవా అనే అంటాను. ఈ వైట్ చికెన్ బిర్యానీనే సోఫియాని బిర్యానీ అని కూడా అంటారు. ఈ వైట్ చికెన్ బిర్యానీ అన్నీ చికెన్ బిర్యానీలకి మల్లె కారంగా, ఘాటుగా ఉండదు. కమ్మగా ఎక్కువ సువాసనతో కమ్మగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే మృదువుగా అలా గొంతుకులోకి జారిపోతుంది.

ఈ చికెన్ బిర్యానీ కూడా దాదాపుగా అలాగే ఉంటుంది అలాగే ధం చేయాలి కూడా. కానీ చికెన్లో వేసే పదార్ధాలు భిన్నం. కారం తక్కువ ఉంటుంది మసాలాలు నెయ్యి ఎక్కువగా ఉంటుంది.

ఈ టేస్టీ వైట్ చికెన్ బిర్యానీకి ఈ టిప్స్ ధీ బెస్ట్ !

white chicken dum biryani

టిప్స్

చికెన్:

  1. బిర్యానీకి చికెన్ ఎప్పుడు బిర్యానీ కట్ ఉంటే బాగుంటుంది. నిజానికి ఎక్కువ మోతాదులో చేసే బిర్యానీలకి బియ్యం చికెన్ సమానం. నేను చేసే బిర్యానీ తక్కువ కాబట్టి బియ్యనికి డబుల్ చికెన్ తీసుకున్నాను.

  2. చికెన్లో మసాలాలు వేసి రెండు గంటలు ఫ్రిజ్లో పెడితే చికెన్కి ఫ్లేవర్స్ బాగా పడతాయ్.

రైస్:

  1. బాస్మతి బియ్యం ఎప్పుడూ మాంచి బ్రాండ్ లేదా సంవత్సరం కంటే పాత బియ్యంతో బిర్యానీ ఎప్పుడూ బెస్ట్గా వస్తుంది!

  2. బాస్మతి బియ్యం ఎప్పుడూ హై – ఫ్లేమ్ మీదే ఉడికించాలి, అప్పుడే రైస్ ధం చేశాక ముద్ద అవ్వదు. చక్కగా ఉడికినా పొడిపొడిగా ఉంటుంది.

  3. రైస్ 60% ఉడికించడం అంటే బియ్యం గింజ నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది సగం పైన ఉడికి ఇంకా కాస్త పలుకుగా ఉంటుంది.

  4. రైస్ ఉడికించేప్పుడు ఉప్పు ఎక్కువగా ఉంటేనే రైస్కి ఉప్పు పడుతుంది, లేదంటే ఇంకా ఏ స్టేజ్లో ఉప్పు అడ్జస్ట్ చేయలేరు. ఎసరు నీళ్ళు సముద్రపు ఉప్పు నీరంత ఉప్పగా ఉండాలి అని గుర్తుంచుకోండి.

నెయ్యి-నూనె:ఈ బిర్యానీకి నూనె-నెయ్యి నేను వేసిన మోతాదులో ఉంటే రుచిగా ఉంటుంది.

కారం:ఈ బిర్యానీకి ఎండు కారం వేయకూడదు, కారం అంతా వేసిన ఆ నాలుగు పచ్చిమిర్చి నుండి వస్తుంది. బిర్యానీ మసాలాల ఘాటుతో సువసానతో ఉండాలి.

రోజ్ వాటర్:నా దగ్గర ఎండు గులాబీ రేకులు ఉన్నాయి కాబట్టి అవి వేశాను, మీరు కేర్ బ్యూటీలో వాడే రోజ్ వాటర్ 1 tsp దాకా వేసుకోవచ్చు.

కుంకుమపువ్వు:ఉంటే వేసుకోండి, వేస్తే చాలా మంచి పరిమళం ఇస్తుంది.

ధం :నేను ధం చేయడానికి టిష్యూ నాప్కీన్స్ వాడాను, మీరు అరిటాకు, విస్తరాకు ఏదైనా వాడి స్టీమ్ బయటకి పోకుండా గట్టిగా సీల్ చేసి ధం చేయాలి. అప్పుడు నేను చెప్పిన టైమ్లో పర్ఫెక్ట్గా తయారవుతుంది బిర్యానీ.

వేపిన ఉల్లిపాయలు:నా దగ్గర ముందుగానే ఉల్లిపాయ వేపి ఉంది కాబట్టి వేసేశాను, మీరు ఉల్లిపాయ వేపుకుని, ఉల్లిపాయ వేపగా మిగిలిన నూనె బిర్యానీ కోసం వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ.

వైట్ చికెన్ బిర్యానీ | ఈ వైట్ చికెన్ బిర్యానీనే సోఫియాని బిర్యానీ అని కూడా అంటారు - రెసిపీ వీడియో

White Chicken Biryani | Perfect Chicken Biryani Recipe | How to make White Chicken Dum Biryani | Sofiyani Biryani

Non Veg Biryanis | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Resting Time 2 hrs
  • Total Time 2 hrs 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ నానబెట్టడానికి
  • 1/2 kilo చికెన్
  • 1/2 cup వేపిన ఉల్లిపాయలు
  • 1 tsp అల్లం వెల్లులి ముద్దా
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp యాలకల పొడి
  • 1.5 tsp గరం మసాలా
  • 250 ml కమ్మని పెరుగు
  • 1/4 cup పాల మీగడ
  • 3 పచ్చిమిర్చి (ముక్కలు)
  • 2 tbsp నూనె
  • 2 tbsp జీడిపప్పు పేస్ట్
  • చిన్న కట్ట కొత్తిమీర తరుగు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • చికెన్ ఉడికించడానికి
  • 3 tbsp నెయ్యి
  • 4 యాలకలు
  • 5 లవంగాలు
  • 2 నల్ల యాలక
  • 1 బిరియానీ ఆకు
  • 1 tsp షాహీ జీరా
  • 2 inches దాల్చిన చెక్క
  • 1 tsp అనాస పువ్వు
  • 1/2 tsp సొంపు
  • 300 ml నీళ్ళు
  • రైస్ వండుకోడానికి
  • 2 liters నీళ్ళు
  • 1 tsp షాహీ జీరా
  • 6 యాలకలు
  • 2 inches దాల్చిన చెక్క
  • 6 లవంగాలు
  • 1 tsp షాహీ జీరా
  • 2 tbsp గులాబీ రేకులు / రోస్ వాటర్
  • 1 tsp అల్లం వెల్లులి ముద్దా
  • 3 tbsp ఉప్పు
  • 1 tsp నెయ్యి
  • 4 పచ్చిమిర్చి (తరిగిన ముక్కలు)
  • 1/2 tsp మిరియాలు
  • 1 జాపత్రీ
  • కుంకుమ పువ్వు – చిటికెడు
  • 1.5 cup బాస్మతి బియ్యం (గంట నానబెట్టినది)
  • ధం చేయడానికి
  • 2 tbsp నూనె
  • 1 tbsp నెయ్యి
  • 1/4 cup కుంకుమ పువ్వు పాలు (చిటికెడు కుంకుమ పువ్వు వేసి నానబెట్టిన పాలు)
  • 1/4 cup బియ్యం ఉడికించిన నీళ్ళు

విధానం

  1. చికెన్ నానబెట్టడానికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి చికెన్ని బాగా మసాజ్ చేసి మూత పెట్టి 2 గంటలు ఫ్రిజ్లో ఉంచండి.
  2. పాన్లో నెయ్యి కరిగించి అందులో డ్రై మసాలా అన్నీ వేసి 30 సెకన్లు వేపి, 2 గంటలు నానబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక కుక్ చేసుకోండి.
  3. నూనె పైకి తేలాక 300 ml నీళ్ళు పోసి కలిపి మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలకి గ్రేవీ చిక్కబడుతుంది.
  4. రైస్ కుక్ చేయడానికి నీళ్ళు మరిగించాలి, మరిగే నీళ్ళలో బియ్యం తప్పా అన్నీ వేసి హై ఫ్లేమ్ మీద తెర్ల కాగనివ్వాలి.
  5. మసల కాగుతున్న నీళ్ళలో నానబెట్టిన బియ్యం వేసి హై ఫ్లేమ్ మీదే 60% కుక్ చేసుకోవాలి. 60% ఉడికిన బియ్యాన్ని బిర్యానీ వండే గిన్నెలో రెండు లేయర్స్గా వేసుకోవాలి.
  6. 60% ఉడికిన రైస్ మీద వండుకున్న చికెన్ కర్రీ వేసి సమంగా సర్దుకోవాలి. మరో ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద రైస్ ఉడికిస్తే 70% ఉడికిపోతుంది దాన్ని మరో లేయర్ గా వేసుకోవాలి.
  7. ఇంకో ఐదు నిమిషాలు హై-ఫ్లేమ్ మీద ఉడికిస్తే 80% ఉడికిపోతుంది రైస్, దాన్ని ఆఖరుగా వేసి అన్నాన్ని సమంగా సర్దుకోవాలి.
  8. బిర్యానీ రైస్ మీద నెయ్యి నూనె కలిపి పోసుకోవాలి, తరువాత కుంకుమ పువ్వు పాలు, రైస్ వండుకున్న ఎసరు నీళ్ళు గిన్నె అంచుల వెంట పోసుకోండి.
  9. రైస్ మీద టిష్యూ నాప్కీన్స్ పెట్టి నీళ్ళు చిలకరించి మూత పెట్టి హై –ఫ్లేమ్ మీద 8 నిమిషాలు లో- ఫ్లేమ్ మీద 7 నిమిషాలు ధం చేసి స్టవ్ ఆపేసి పొయ్యిమీదే 20 నిమిషాలు వదిలేయాలి. 20 నిమిషాల తరువాత అడుగునుండి నెమ్మదిగా కలుపుకోవాలి.
  10. ఈ బిర్యానీ మిర్చీ కా సాలన్ ఇంకా కమ్మని రైతాతో ఎంతో రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

13 comments

  • R
    Ravi Kumar
    Recipe Rating:
    Super 👌 undi anna recipe I like this Biryani
  • R
    Ravi Kumar
    Recipe Rating:
    Super 👌 undi anna recipe I like this Biryani
  • R
    Ravi Kumar
    Super 👌 undi anna recipe I like this Biryani
  • H
    Harika Pedaprolu
    Vey nice recipe... I tried it and it became my favourite food... 😋
  • R
    REVATHI
    hai teja garu am big fan of your videos i loved your videos and also i first see your video only after click you tube on my mobile...........thank u once again for your tips for any item.............i improved MY cooking skills thank you once again
  • N
    Neethu
    Recipe Rating:
    Very nice explanation sir ...can I know one cup how many ml
  • V
    Viv
    Recipe Rating:
    Looks soooo yummy.....
  • J
    Jyothi
    Recipe Rating:
    Super sir
  • S
    Sony
    Plz mention rice quantity sir.... Thank you....
  • S
    Saritha Gudavalli
    Recipe Rating:
    👌👌👌
  • A
    Aruna
    Recipe Rating:
    Hallo sir meeru post chesina details chaduvuthunte meeru matlaadinatlu anipistundi .....
  • D
    David
    Nice White Chicken Biryani super idea I Like it Thankyou Vismai food We learn and do it ourselves it's Good thank you
chicken dum biryani