చికెన్ కుండ బిర్యానీ | కుండ బిర్యానీ | స్పెషల్ రోజులని ఇంకా స్పెషల్గా మార్చేసే రెసిపీనే నా స్టైల్ “చికెన్ కుండ బిర్యానీ”

స్పెషల్ రోజులని ఇంకా స్పెషల్గా మార్చేసే రెసిపీనే నా స్టైల్ “చికెన్ కుండ బిర్యానీ”. ఘుమఘుమలాడే కుండ బిర్యానీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో వివరంగా ఉంది చూడండి.

బిర్యానీ అనగానే ప్రాణం లేచి వచ్చినట్లే ఉంటుంది, బిర్యానీ ప్రియులకి. అందుకే బిర్యానీలు ఎన్ని రకాలో. అలాగే కుండ బిర్యానీ రెసిపీ కూడా. పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్, లక్నో, ఇంకా తెలుగు రాష్ట్రాలలో కూడా. ఇలా దేశమంతటా అన్నీ చోట్లా కుండ బిర్యానీ చాలా ఫేమస్, కానీ ఒక్కోరిది ఒక్కో తీరు.

నా స్టైల్ కుండ బిర్యానీ ఘుమఘుమలాడిపోతూ, మెతుకు మెత్తగా ఉడికినా పొడిపొడిగా ఉంటుంది. ఉప్పు కారాలు బాలయన్స్డ్ గా ఎంత తిన్నా పొట్టకి తేలికగా అనిపిస్తుంది.

కాబట్టి నేను తప్పక చేసి తీరాలని చెప్తాను.

Chicken Pot Biryani | Pot Biryani | Matka Chicken Biryani | Kunda Biryani | How to prepare Pot Chicken Biryani

టిప్స్

బాస్మతి బియ్యం:

  1. బాస్మతి బియ్యం ఎప్పుడూ సంవత్సరం కంటే పాత బియ్యం వాడాలి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. బియ్యం గంట సేపు నానాబెట్టాలి.

  2. సోనా మసూరి వాడిన గంటసేపు నానాబెట్టాలి, కానీ ధం చేసేప్పుడు ఇంకాసిని నీళ్ళు అంటే 30ml ఎక్కువగా పోసుకోవాలి

  3. బాస్మతి బియ్యం 60%, 70%, 80% ఇలా అన్నాన్ని ఉడికించి చికెన్ మీద వేసి ధం చేయాలి. 60% అంటే మెతుకు మెదిపితే తెలుస్తుంది, సగం పైన ఉడికి ఇంకా కాస్త పలుకుగా ఉంటుంది.

చికెన్:

  1. చికెన్ వండడానికి ముందు గంటసేపు ఉప్పు వేసిన నీళ్ళలో నానాబెట్టాలి, అప్పుడు చికెన్ త్వరగా ఉడుకుతుంది

  2. చికెన్ 50% మాత్రమే ఉడికించాలి, మిగిలినది ధం మీద ఉడుకుతుంది. ఎక్కువగా చికెన్ ఉడికితే ధం చేశాక చిదురైపోతుంది ముక్క.

  3. 50% ఉడకడం అంటే చికెన్లోని నీరు వదిలి, నూనె కాస్త పైకి కనిపిస్తుంది

ఉప్పు:

బిర్యానీ రైస్ వండేప్పుడు ఎక్కువగా ఉప్పు వేసుకోవాలి, అంటే ఎసరు నీళ్ళు సముద్రపు నీరంత ఉప్పగా ఉండాలి, అప్పుడే అన్నానికి ఉప్పు పడుతుంది. ఈ స్టేజ్లో ఉప్పు రుచి చూసి వేయకపోతే ఇక ఉప్పు బిర్యానీలో కలవదు.

Chicken Pot Biryani | Pot Biryani | Matka Chicken Biryani | Kunda Biryani | How to prepare Pot Chicken Biryani

చికెన్ కుండ బిర్యానీ | కుండ బిర్యానీ | స్పెషల్ రోజులని ఇంకా స్పెషల్గా మార్చేసే రెసిపీనే నా స్టైల్ “చికెన్ కుండ బిర్యానీ” - రెసిపీ వీడియో

Chicken Pot Biryani | Pot Biryani | Matka Chicken Biryani | Kunda Biryani | How to prepare Pot Chicken Biryani

Non Veg Biryanis | nonvegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 30 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr 10 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • చికెన్ వండుకోడానికి
  • 1/2 Kilo చికెన్
  • 1/4 cup నూనె
  • 1.5 inches దాల్చిన చెక్క
  • 2 నల్ల యాలకలు
  • 4 యాలకలు
  • 5 లవంగాలు
  • 1 అనాసపువ్వు
  • 1/4 tsp పసుపు
  • 1 tsp షాహీ జీరా
  • 1 tbsp కారం
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • ఉప్పు రుచికి సరిపడా
  • 1/2 cup ఉల్లిపాయ చీలికలు
  • 3 పచ్చిమిర్చి (చీలికలు)
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • పుదీనా చిన్న కట్ట
  • కొత్తిమీర చిన్న కట్ట
  • 1/2 cup పెరుగు
  • 1/4 cup నీళ్ళు
  • 1 tbsp నిమ్మరసం
  • అన్నం ఉడికించడానికి
  • 2 liters నీళ్ళు
  • 2 inches దాల్చిన చెక్క
  • 5 లవంగాలు
  • 3 నల్ల యాలకలు
  • 2 మారాటీ మొగ్గలు
  • 1/4 cup ఉప్పు
  • 1.5 cup బాస్మతి బియ్యం (150 gm)
  • పుదీనా పేస్ట్
  • 5 పచ్చిమిర్చి
  • పుదీనా- చిన్న కట్ట
  • కొత్తిమీర – చిన్న కట్ట
  • 1/4 cup పెరుగు
  • 1 inch అల్లం
  • 6 వెల్లులి
  • 1 tsp నిమ్మరసం
  • ధం కోసం
  • 1/3 cup ఎసరు నీళ్ళు
  • 1/4 cup నెయ్యి
  • కొత్తిమీర – కొద్దిగా
  • 2 tbsp వేపిన ఉల్లిపాయలు
  • 1/4 tsp గరం మసాలా
  • మైదా పిండి ముద్ద

విధానం

  1. కుండలో నూనె పోసి గరిటతో కుండ అంతా నూనెతో తడపండి.
  2. వేడెక్కిన నూనెలో చెక్కా, లవంగాలు ఇంకా మిగిలిన మసాలా దీనుసులన్నీ ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  3. సగం పైన వేగిన ఉల్లిపాయాలో చికెన్ ముక్కలు, అల్లం వెల్లులి ముద్ద వేసి 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
  4. తరువాత ఉప్పు కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా, పచ్చిమిర్చి వేసి మరో 2 నిమిషాలు ఉడకనిచ్చి తరువాత పుదీనా కొత్తిమీర పెరుగు, నిమ్మరసం అన్నీ వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
  5. పుదీనా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  6. ఎసరు కోసం నీళ్ళని మరిగించి అందులో మసాలా దీనుసులన్నీ, ఇంకా పుదీనా పేస్ట్, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి.
  7. మరుగుతున్న ఎసరులో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి హై-ఫ్లేమ్ మీద 60% ఉడికించాలి. 60% ఉడికిన అన్నాన్ని వడకట్టి సగం ఉడికిన చికెన్ పైన రెండు పొరలుగా వేసుకోవాలి.
  8. మరో 3 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద ఉడికిస్తే 70% ఉడుకుతుంది అది ఇంకో లేయర్ గా ఇంకో రెండు నిమిషాలు ఉడికిస్తే 80% ఉడుకుతుంది అప్పుడు దాన్ని ఆఖరు లేయర్ గా అన్నాన్ని వడకట్టి వేసుకోవాలి.
  9. బిర్యానీ పైన ఉడికిన ఎసరు నీళ్ళు పోసుకోవాలి, ఇంకా నెయ్యి బిర్యానీ పైన అంతా పోసుకోవాలి. వేపిన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, గరం మసాలా చల్లుకోవాలి
  10. కుండ అంచులకి మైదా పిండి ముద్ద పల్చగా పరిచి గట్టిగా మూత పెట్టి ఒక దగ్గర చిన్న రంధ్రం చేసుకోవాలి
  11. బిర్యానీ కుండని పొయ్యి మీద హై-ఫ్లేమ్ మీద చేసుకున్న రంధ్రం గుండా వేగంగా వచ్చేదాకా ఉడికించాలి.
  12. ఆవిరి వేగంగా వచ్చాక మంట తగ్గించి సిమ్లో మరో 3 నిమిషాలు ధం చేసి స్టవ్ ఆపేసి 30 నిమిషాలు వదిలేయాలి
  13. 30 నిమిషాల తరువాత అడుగు నుండి కలుపుకోవాలి. ఈ బిర్యానీ మిర్చి కా సాలన్, చల్లని పెరుగు పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • R
    RAMA MOHANA REDDY PEKETI
    Recipe Rating:
    Wonder full commens once more foods..
  • N
    Naidu Naidu
    Recipe Rating:
    Super sir
  • S
    Sravanthi Ch
    Recipe Rating:
    I tried this today . Super ga vachindi..thank u Vamsi garu ..
  • R
    Roja
    Recipe Rating:
    small mistake sir may typing Is it required 3/4 cup of salt in boiling rice Pls check
  • S
    SURYA PRAKASH
    Recipe Rating:
    Really good one
Chicken Pot Biryani | Pot Biryani | Matka Chicken Biryani | Kunda Biryani | How to prepare Pot Chicken Biryani