వాము చారు
వాము చారు తెలుగు రాశరాల్లోఅందులోనూ ముఖ్యంగా ఆందరులు చాలా ఎక్కువగా చేష్టఉంటారు. వాము చారు ఎంతో ఆరోగ్యం. పసిపిల్లల నుండి పెద్దవారి వరకు అందరు అన్నీ వేళలా తాగొచ్చు , అన్నం, ఇడ్లీతోనూ తినొచ్చు.
అజీర్తి చేసినా, వాతం చేసినా వాము చారుతో అన్నం తింటే పొట్ట లోని దోషాలు పోయి పొట్ట మెత్తబడుతుంది.
నాన్-వెజ్ తిన్నాక ఈ చారుతో 4 ముద్దలు తింటే చాలు ఆహరం త్వరగా అరిగి, పొట్ట తేలిక పడుతుంది. జలుబు చేసినప్పుడు కూడా టీ లా తాగుతున్నా త్వరగా పడిసం వల్ల వచ్చే ఇబ్బందులనుండి ఉపసమంనాన్ని ఇస్తుంది.
ఇది మా అమ్మమ్మ రెసిపీ. ఆవిడ తరుచూ చేస్తుండేవారు. మా ఇంట్లో నాన్-వెజ్ చేసిన రోజునా ఈ చారు లేదంటే వాము చారు తప్పకుండా ఉంటుంది.
టిప్స్
-
చారుకి వాము ఏమాత్రం ఎక్కువ వేసినా ఘాటుగా ఉండి రుచిగా అనిపించదు, కాబట్టి నేను చెప్పిన కొలతలోనే వేసుకోండి.
-
పొరపాటున చారు ఘాటుగా అనిపిస్తే పులుపు ఉప్పుతో బాలెన్స్ చేయండి
-
ఈ చారు ఘాటుగా ఉండాలి కారంగా ఉండకూడదు, అందుకే మీరపకాయాలు కొద్దిగా వేసుకోండి.
-
ఒకవేళ టీలా తాగాలనుకుంటే ఉప్పు కారం వాము అన్నీ కాస్త తగ్గించి వేసుకోండి. చారు సామగ్రి నేను అన్నంలోకి సరిపోయే మోతాదులో వేశాను.
-
చారులో కరివేపాకు కదలతో వేస్తే చాలా బాగుంటుంది.
-
కొందరు చారులో చిన్న ముక్క బెల్లం వేస్తారు నచ్చితే వేసుకోవచ్చు.
-
వెల్లూలీ నచ్చని వారు వదిలేవచ్చు.
వాము చారు - రెసిపీ వీడియో
Ajwain Rasam | Omam Rasam | Vaamu Charu | How to make Oma Rasam Recipe
Prep Time 2 mins
Cook Time 15 mins
Total Time 17 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
-
వాము చారు పొడికి
- 1 tsp వాము
- 2 ఎండు మిర్చి
- 1/2 tsp జీలకర్ర
- 1 tsp ధనియాలు
-
చారు కోసం
- 1 tsp నూనె
- 1 ఎండుమిర్చి
- 1 పచ్చిమిర్చి
- 5 వెల్లూలి దంచినవి
- 1/2 liter చింతపండు పులుసు (నిమ్మకాయంత చింతపండు నుండి తీసినది)
- 1/2 tsp ఆవాలు
- 1/4 tsp మెంతులు
- 2 కరివేపాకు
- రాళ్ళ ఉప్పు
- 1/4 tsp పసుపు
విధానం
-
చారు పొడికి కావలసిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పొడి చేసుకోండి.
-
మూకుడులో నూనె వేడి చేసి అందులో మెంతులు, ఆవాలు వేసి మెంతులని ఎర్రగా వేపుకోవాలి తరువాత జీలకర్ర, వెల్లూలి వేసి ఎర్రగా వేపుకోవాలి.
-
చింతపండు పులుసు, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు కాడలతో సహా, పసుపు, వాము పొడి అన్నీ వేసి మీడియం సెగ మీద 15 నిమిషాలు పాటు బాగా మరగనివ్వాలి.
-
15 నిమిషాల తరువాత దింపి వేడిగా తాగినా లేదా అన్నంతో, ఇడ్లి తో ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
87 comments