మామిడి అల్లం చారు
భోజనంలో ఎన్ని రకాలు తిన్నా చారుతో నాలుగు ముద్దలన్నా తినకపోతే తృప్తి ఉండదు దక్షిణ భారత దేశం వారికి. అందుకే మనకి ఎన్ని చారులో కదా. నాకూ చారన్నం అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పటిదాకా పది రకాల చారులు పైనే పోస్ట్ చేశా!
అల్లం చారు సాధారణంగా తెలుగు వారు చేస్తుంటారు, ఆ చారు కాచే తీరు, ఈ చారు చేసే తీరు పూర్తిగా భిన్నం. ఈ మమైడి అల్లం చారు రుచి, సువాసన చాలా బాగుంటుంది. నా పద్ధతిలో చేసే చారులకి నేను ఎక్కువగా మరగకూడదు అంటుంటాను. కానీ, ఈ చారు ఎంత మరిగితే అంత రుచి.
చారు చేయడం చాలా సింపుల్ కానీ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి చూడండి.

టిప్స్
-
మామిడి అల్లం ఏ మాత్రం ఎక్కువైనా చారు ఘాటుగా ఉంటుంది, కాబట్టి నేను చెప్పిన కొలతలోనే అల్లం వేసుకోండి.
-
ఒక వేళ పొరపాటున అల్లం ఘాటు ఎక్కువగా అనిపిస్తే కొంచెం చారు మరుతున్నప్పుడు చింతపండు పులుసు లేదా ఆఖరున నిమ్మరసం పిండుకోవచ్చు
-
చారులో కొద్దిగా బెల్లం వేస్తేనే అల్లం ఘాటుని, పులుపుని బాలన్స్ చేస్తుంది.
-
ఈ చారు బాగా మరగాలి అప్పుడే రుచి.
-
ఈ చారుకి నేతితో పెట్టె తాలింపు రుచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి కమ్మదనాన్ని ఇస్తుంది.

మామిడి అల్లం చారు - రెసిపీ వీడియో
Mango Ginger Rasam | Rasam recipe | Ginger rasam | Allam Charu recipe
Prep Time 5 mins
Cook Time 15 mins
Total Time 20 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
అల్లం పేస్ట్ కోసం
- 35 - 40 gms మామిడి అల్లం ముక్కలు
- 6 - 7 ఎండుమిర్చి
- 1 tsp జీలకర్ర
- 2 tsp ధనియాలు
- 1 tsp మిరియాలు
-
ఛాయారు కోసం
- 50 gm చింతపండు
- 3 పండిన టొమాటో
- ఒక కట్ట కొత్తిమీర కాడలు
- రాళ్ళ ఉప్పు
- 1.5 liter నీళ్ళు
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 1/4 tsp పసుపు
- 2 tsp బెల్లం
- 2 tbsp కొత్తిమీర
-
తాలింపు కోసం
- 2 tbsp నెయ్యి
- 1 tsp ఆవాలు
- 1/2 tsp జీలకర్ర
- 2 ఎండు మిర్చి
- 2 రెబ్బలు కరివేపాకు
- 3 tbsps పచ్చి కొబ్బరి
- ఇంగువ – చిటికెడు
- 5 దంచిన వెల్లులి (ఆప్షనల్)
విధానం
-
మిక్సీ జార్ లో అల్లం పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి .
-
చింతపండులో కాసిని నీళ్ళు పోసి పులసు తీయండి, అందులోనే టొమాటోలు, కొత్తిమీర కాడలు వేసి గట్టిగా పిండుతూ సారాన్ని తీసి పిప్పి పడేయండి.
-
గిన్నెలో చారుకి కావలసినవి అన్నీ టొమాటో పూలుసు, ఉప్పు, పచ్చిమిర్చీ, అల్లం పేస్ట్, నీళ్ళు అన్నీ పోసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి 15-20 నిమిషాలు మరగనివ్వాలి.
-
చారు పొంగుతున్నప్పుడు బెల్లం కొద్దిగా కొత్తిమీర వేసి మరిగించండి.
-
తాలింపు కోసం నెయ్యి వేడి అందులో తాలింపు సామానంతా వేసి వేపి చారులో కలిపేయండి.
-
ఈ చారు అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
2 comments