మిర్యాలచారు 5 నిమిషాల్లో | ఈ టిప్స్ తో చారు పెడితే అన్నమంతా ఈ చారుతోనే | పర్ఫెక్ట్ మిరియాల చారు
ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ మిరియాల చారు కావాలంటే ఈ టిప్స్ కొలతల్లో చేయండి. ఈసీ మిరియాల చారు జస్ట్ 5 నిమిషాల్లో తయారు. ఈ రెసిపి స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
దక్షిణ భారత దేశంలో దాదాపుగా ప్రతీ ఇంట్లో మిరియాల చారు తప్పక చేస్తారు. కానీ ప్రాంతాన్ని బట్టి రుచి రూపం మారుతుంది. నేను ఆంధ్రా స్టైల్ నీళ్ళ మిరియాల చారు రెసిపి పోస్ట్ చేస్తున్న. ఇది జస్ట్ 5 నిమిషాల్లో తయారవుతుంది. ఈ చారుతో బంగాళాదుంప, చేమగడ్డ, అరటికాయ వేపుళ్ళు నంజుడుగా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా చికెన్ మటన్ వేపుళ్ళతో కూడా సూపర్.
ముందు నేను చెప్పినట్లు చారు రుచి ఇంటికి చేతికి ప్రాంతానికి మారిపోతుంది. నేను చాలా సింపుల్ విధానం చెబుతున్నాను. ఈ చారు నీళ్లగా ఉంటుంది. సాధారణంగా రుచి పెంచడానికని ఇంకా కలుపుకోడానికి వీలుగా ఉండాలని కొద్దిగా ఉడికించిన కందిపప్పు లేదా పెసరపప్పు వేస్తారు, నేను అవేవీ వేయడం లేదు. నచ్చితే మీరు వేసుకోండి కానీ ఉప్పు పులుపు రుచి చూసి ఇంకొంచెం వేసుకోండి. కర్ణాటక, తమిళనాడు, ఇంకా ఆంధ్రాలోని కోనసీమ ప్రాంతం వారు చారులో కొద్దిగా బెల్లం వేస్తారు, నేను వేయలేదు నచ్చితే ఆఖరున వేసుకోండి.

టిప్స్
-
చారులో మిరియాలు, వెల్లూలీ, జీలకర్రని మిక్సీలో వేసే దానికంటే దంచి వేస్తేనే చారు రుచి బాగుంటుంది.
-
చారులో కరివేపాకు, కొత్తిమీరా కాడలతో సహా వేస్తేనే చారు ఘుమఘుమలాడుతూ ఉంటుంది.
-
చారు ఒక్క పొంగు రాగానే దింపేసుకోవాలి, ఎక్కువగా మరిగిస్తే చారు సువాసన పోతుంది.
-
చారు దింపే ముందు ఒక్క సారి రుచి చూసి ఉప్పు సరి చేసుకోవడం మర్చిపోకండి

మిర్యాలచారు 5 నిమిషాల్లో | ఈ టిప్స్ తో చారు పెడితే అన్నమంతా ఈ చారుతోనే | పర్ఫెక్ట్ మిరియాల చారు - రెసిపీ వీడియో
Easy Pepper Rasam | Miriyala Charu | How to make Pepper Rasam in 5minutes | Quick and Easy Recipe
Prep Time 1 min
Cook Time 5 mins
Total Time 6 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 tbsp మిరియాలు
- 10 - 12 వెల్లూలీ
- 1 tbsp జీలకర్ర
- 600 ml చింతపండు పులుసు (పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
- 1 టొమాటో ముక్కలు
- 1 tbsp నూనె
- 1/4 tsp పసుపు
- 3 ఎండు మిర్చి
- 1 tsp ఆవాలు
- 3 - 4 కరివేపాకు (కాడలతో సహ)
- కొత్తిమీరా తరుగు – చిన్న కట్ట
- ఉప్పు
- 2 pinches ఇంగువ
విధానం
-
మిరియాలు, వెల్లూలీ, జీలకర్ర రోట్లో వేసి బరకగా దంచుకోండి.
-
గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేపుకోండి.
-
బాగా పండిన టొమాటో ముక్కలు వేసి టొమాటోలు గుజ్జుగా అయ్యేదాక మగ్గించండి.
-
మగ్గిన టొమాటోలో చింతపండు పులుసు, దంచుకున్న మిరియాల ముద్ద, ఉప్పు, కరివేపాకు కొత్తిమీరా, ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసి దింపేసుకోండి.
-
ఈ చారు అన్నం, ఇడ్లీ, వడ ల్లోకి చాలా బాగుంటుంది. ఇంకా జలుబు చేసినప్పుడు వడకట్టి “టీ” లా కూడా తీసుకోవచ్చు.

Leave a comment ×
14 comments