చిక్కని కమ్మని చల్లని బాదం షేక్ వేసవిలో భారతీయుల ఫెవరెట్ డ్రింక్స్లో ఒకటి. కుంకుమపువ్వు సువాసనతో నానబెట్టిన బాదం పలుకులు తగులుతూ గ్లాసులు తాగేలా చేస్తుంది.

బాదాం పాలకి బాదం షేక్కి చిన్న వ్యత్యాసం ఉంది. బాదాం పాలు కాస్త పలుచగా ఉంటాయి, ఇంకా పాలు పంచదార కుంకుమపువ్వు లేదా యాలకులపొడి వేసి చేస్తారు. బాదాం షేక్ బాదం పేస్ట్తో పాటు చిక్కదనం కోసం కస్టర్డ్ పౌడర్ వాడి చేస్తారు.

బాదాం షేక్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ. నిజానికి బాదాం షేక్లో కూడా బాదాం పేస్ట్తో పాటు కాస్టర్ పౌడర్ వేసి మరిగించి చేయాలి. కానీ స్ట్రీట్ ఫుడ్లో అచ్చంగా కస్టర్డ్ పౌడర్ వేసి చిక్కబరిచి బాదం పలుకులు వేస్తారు. నేను ఆరోగ్యంగా రుచిగా అదే స్ట్రీట్ ఫుడ్లో మనకి నచ్చే బాదాం షేక్ రెసిపీ చెప్తున్నా!

Almond Shake | Badam Shake

టిప్స్

బాదాం:

నానబెట్టిన బాదాం తొక్క తీసి పాలతో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. దీనికి రాత్రంతా నానబెట్టినవి లేదా వేడి నీటిలో 2 గంటలు నానబెట్టిన పప్పు అయినా వాడుకోవచ్చు.

కుంకుమ పువ్వు:

బాదాం షేక్కి మాంచి పరిమళం రంగునిస్తుంది కుంకుమపువ్వు. లేని వారు కాస్త యాలకులపొడి, చిటికెడు పసుపు రంగు కోసం వేసుకోండి.

ఇలా చల్లబరిస్తే మరింత రుచిగా ఉంటుంది:

బాదం షేక్ తయారయ్యాక డీప్-ఫ్రీజర్లో 2-3 గంటలు ఉంచితే సగం పైన గడ్డ కడుతుంది. అప్పుడు 30 సెకన్లు హై-స్పీడ్ మీద బ్లెండ్ చేస్తే పళ్ళు జివ్వు మనిపించే బాదాం షేక్ తయారవుతుంది, మరింత రుచిగా ఉంటుంది. ఇది మీకు మామూలు ఫ్రిజ్లో పెట్టి చల్లబరిస్తే రాదు.

నానబెట్టిన బాదాం పలుకులు/బద్దలు:

బాదాం షేక్ సర్వ్ చేసేప్పుడు గ్లాసు అడుగున కొన్ని బాదాం పలుకులు వేసి షేక్తో నింపి బాదాం పలుకులు దండిగా పైనా వేస్తే తాగుతున్నప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది.

పంచదార:

పంచదార ఇష్టపడని వారు బెల్లాన్ని కరిగించి వడకట్టి మరిగిన పాలల్లో పోసి కలుపుకోవాలి. లేదా తేనె కూడా ఆఖరున కలుపుకోవచ్చు

బాదం షేక్ - రెసిపీ వీడియో

Almond Shake | Badam Shake | How to Make Badam Shake

Street Food | vegetarian
  • Prep Time 2 mins
  • Soaking Time 1 hr
  • Resting Time 2 hrs
  • Total Time 3 hrs 2 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 50 gms బాదం పప్పు
  • 1 liter పాలు
  • 1/3 cup పంచదార
  • 3 tbsp కుంకుమపువ్వు నీళ్లు
  • ఎల్లో ఫుడ్ కలర్ - ఒక్క చుక్క (అషనల్)
  • 2 tsp కస్ట్రర్డ్ పౌడర్

విధానం

  1. బాదాం పప్పుని వేడి నీళ్లలో నానబెట్టి తొక్క తీసి 200ml పాలతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  2. పాలని ఒక పొంగు వచ్చేదాకా మరిగించి అందులో బాదం పేస్ట్ వేసి 2-3 పొంగులు మీడియం ఫ్లేమ్ మీద రానివ్వాలి
  3. ¼ కప్పు పాలల్లో వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుని పక్కనుంచుకొంది
  4. పొంగిన బాదం పేస్ట్లో పంచదార, కుంకుమపువ్వు నీళ్లు, కస్టర్డ్ పౌడర్ పాలు, ఒక్క చుక్క రంగు వేసి సాంబారు అంత చిక్కగా అయ్యేదాకా మరగనివ్వాలి.
  5. చిక్కబడిన బాదాం షేక్ని ఫ్రీజర్లో రెండు గంటలు ఉంచాలి. రెండు గంటల తరువాత బ్లెండర్లో వేసి హాయ్ స్పీడ్ మీద 30-40 సెకన్లు బ్లెండ్ చేసుకోవాలి.
  6. సర్వింగ్ గ్లాసుల్లో 2 tsp బాదాం పలుకులు వేసి షేక్త్తో నిమ్పుకోండి పైన 1 tbsp బాదాం పలుకులు చల్లి సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

17 comments

Almond Shake | Badam Shake