ఇన్స్టంట్ నూడుల్స్ రోల్ | స్ట్రీట్ ఫుడ్గా ఎంతో ఇష్టంగా తినే నూడుల్స్ రోల్స్

స్ట్రీట్ ఫుడ్గా ఎంతో ఇష్టంగా తినే నూడుల్స్ రోల్స్ రెసిపీ ఇప్పుడు చాలా సులభంగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. రెసిపీ టిప్స్తో స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

రోల్స్ ఇప్పుడు భారతదేశం అంతా ఎంతో ఇష్టంగా తింటోంది. ఏ వీధి చివరన చూసినా నూడుల్స్ తో పాటు రోల్స్ బండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రోల్స్ అంటే చపాతీని కాల్చి లోపల నచ్చిన వాటితో స్టఫ్ చేసి కొన్ని సాసులు వేసి చేసేది.

ఈ రెసిపీ కొట్టి చిట్కాలు తెలుసుకుని చేస్తే బెస్ట్ రోల్స్ వస్తాయ్.

Instant Noodles Rolls | How to make Instant Noodles Rolls | Quick and Easy Street Food Recipe

టిప్స్

రోటీ :

  1. రోటీ కోసం నేను మైదా, గోధుమ పిండి రెండూ వాడను, నచ్చితే అచ్చంగా గోధుమ పిండి లేదా మైదా పిండి వాడుకోవచ్చు. నిజానికి బజార్లో అచ్చంగా మైదాతోనే చేస్తారు.

  2. నీళ్ళతో వత్తుకున్న పిండి మెత్తగా మృదువుగా ఉండాలి. పిండి ఎంత ఎక్కువసేపు వత్తుకుంటే అంత మెత్తగా వస్తాయ్ రొటీలు.

  3. రొటీలు పెనం వేడెక్కాక మాత్రమే రోటీ వేసి కేవలం 15 సెకన్లు హై-ఫ్లేమ్ మీద ఒక్కోవైపు కాల్చి తిప్పి మళ్ళీ మరోవైపు 15 సెకన్లు కాల్చుకోవాలి. ఎక్కువసేపు కాల్చినా, పెనం వేడెక్కకుండా రోటీ కాల్చినా రోటీ గట్టిగా వస్తాయ్.

  4. రోటీ కాల్చిన వెంటనే కాటన్ క్లాత్ కప్పి ఉంచాలి అప్పుడు చల్లారినా మెత్తగా ఉంటాయ్.

పీకిల్డ్ వెజీస్:

  1. నేను వెజ్జిస్ని ఊరబెట్టడానికి ఫ్లేవర్లెస్ వెనిగర్ వాడాను, మీరు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా వాడుకోవచ్చు.

  2. వెజిటెబుల్స్ గంట నానితే వెనిగర్ పులుపు అంతా పడుతుంది. మిరపకాయ కారం కూడా తగ్గుతుంది.

నూడుల్స్:

  1. నూడుల్స్ ఉడికించడానికి అవసరానికి మించి ఎక్కువగా నీరు పోయకండి. అలా ఉడికిస్తే నూడిల్స్ చల్లారాక మెత్తగా, గుజ్జుగా అయిపోతాయ్.

  2. నూడుల్స్ 90% ఉడికాక దింపేయండి. పూర్తిగా నీరు ఇగిరిపోయే దాకా ఉడికిస్తే చల్లారాక గట్టిగా అవుతాయ్. ఇంకా కొంచెం అంటే 10% నీరు ఉండగానే దింపేస్తే చల్లారేలోగా మిగిన నీటితో తేమతో మృదువుగా ఉంటాయ్ నూడుల్స్.

ఉప్పు:

  1. ఇన్స్టంట్ నూడుల్స్ టేస్ట్ మేకర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు వేయలేదు, అవసరమూ లేదు.

చీస్:

నేను చీజ్ వాడాను, అందుబాటులో లేనట్లైతే వదిలేవచ్చు

ఇన్స్టంట్ నూడుల్స్ రోల్ | స్ట్రీట్ ఫుడ్గా ఎంతో ఇష్టంగా తినే నూడుల్స్ రోల్స్ - రెసిపీ వీడియో

Instant Noodles Rolls | How to make Instant Noodles Rolls | Quick and Easy Street Food Recipe

Street Food | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 15 mins
  • Resting Time 45 mins
  • Total Time 1 hr 10 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • రోటీ కోసం
  • 1 cup మైదా
  • 1/4 cup గోధుమ పిండి
  • 1/4 tsp ఉప్పు
  • 1 tsp పంచదార
  • 2 tbsp నూనె
  • గోరు వెచ్చని నీరు – తగినన్ని
  • పీకిలింగ్ కోసం
  • 1 cup ఉల్లిపాయ – పొడవుగా తరిగినది
  • 2 tbsp పచ్చిమిర్చి ముక్కలు
  • 1 tsp పంచదార
  • ఉప్పు – కొద్దిగా
  • 2 tbsp వెనిగర్
  • నూడుల్స్ కోసం
  • 2 tbsp నూనె
  • 1 ఉల్లిపాయ – సన్నగా పొడవుగా చీరుకున్నది
  • 1/2 cup కాప్సికం – పొడవుగా చీరుకున్నది
  • 1 tbsp వెల్లులి తరుగు
  • 1/2 tsp చాట్ మసాలా
  • 1/2 tsp కారం
  • 1 tsp వెనిగర్
  • 1 cup నీళ్ళు
  • 2 ఇన్స్టంట్ నూడుల్స్
  • రోల్ కోసం
  • నూనె – తగినంత రొటీలు కాల్చుకోడానికి
  • 1/2 cup పుదీనా చట్నీ
  • 1/4 cup శేజ్వాన్ సాస్/ రెడ్ చిల్లీ సాస్
  • 2 cups కేబేజ్ సన్నని తరుగు
  • 1 tbsp చాట్ మసాలా
  • 3 tsp టొమాటో కేట్చాప్

విధానం

  1. రొటీకి కావాల్సిన పదార్ధాలన్నీ వేసి పిండిని 7-8 నిమిషాల పైన మెత్తగా పగుళ్లు లేకుండా ఉండేలా వత్తుకోవాలి .
  2. వత్తుకున్న పిండిని గుడ్డ కప్పి గంట సేపు రెస్ట్ ఇవ్వాలి
  3. వెజ్జిస్ పికిలింగ్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ కలిపి గంట సేపు ఊరనివ్వాలి
  4. నూడుల్స్ కోసం నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు కాప్సికం చీలికలు, వెల్లులి తరుగు వేసి 2 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద వేపుకోవాలి
  5. కాస్త వేగిన ఉల్లిపాయాల్లో కారం, చాట్ మసాలా, వెనిగర్ వేసి 30 సేకన్లు టాస్ చేసుకోవాలి
  6. నీళ్ళు, ఇన్స్టంట్ నూడుల్స్ టెస్ట్ మేకర్ వేసి తెర్ల కాగనివ్వాలి. ఎసరు తెర్లుతున్నప్పుడు నూడుల్స్ వేసి హై-ఫ్లేమ్ మీద 90% కుక్ చేసి దింపేసుకోండి
  7. నానుతున్న వెజ్జిస్ని వడకట్టి పక్కనుంచుకోవాలి
  8. నానుతున్న పిండిని నిమ్మకాయ సైజు బాల్స్ చేసి పొడి పిండి చల్లుకుని పల్చగా వత్తుకోవాలి
  9. వేడి పెనం మీద వత్తిన రోటీ వేసి రెండు వైపులా రోటీ తెల్లగా అయ్యేదాక కాల్చుకుని తీసి క్లాత్ కప్పి ఉంచాలి
  10. సగం కాలిన రొటీలని వేడి పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి కాలుచుకుని తీసుకోండి
  11. కాల్చుకున్న రోటీ మీద పుదీనా చట్నీ స్ప్రెడ్ చేసుకోండి, దాని మీద షెజ్వాన్ సాస్ కొద్దిగా వేసి రోటీ అంతా పూయాలి
  12. రోటీ ఒక పక్క వడకట్టిన ఉల్లిపాయ తరుగు వేసుకోండి, దాని మీద చల్లారిన నూడుల్స్ కొన్ని పొడవుగా పెట్టుకోండి, నూడుల్స్ మీద కొద్దిగా కేబేజ్ తరుగు, పెట్టి ఆ పైన చాట్ మసాలా కొద్దిగా చిలకరించాలి.
  13. కేబేజ్ పైన కొద్దిగా చీస్ తురుము, ½ tsp టొమాటో కేట్చాప్ వేసి గట్టిగా రోల్ చేసుకోవాలి.
  14. ఈ రోల్స్ లంచ్ బాక్సులకి అయితే బటర్ పేపర్తో రోల్ చేస్తే సరిపోతుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • R
    Rajesh
    Recipe Rating:
    Sir I am good lover, we enjoy your recipes. My most favorite is Anna aram Prasadam. My request is I want to know the authentic irani chai recipe..
  • S
    SAGAR
    Recipe Rating:
    Super bro
Instant Noodles Rolls | How to make Instant Noodles Rolls | Quick and Easy Street Food Recipe