మసాలా మాక్రోనీ | ఇన్స్టంట్ స్నాక్ లేదా టిఫిన్ ఎలాగైనా ఇష్టంగా తినాలనిపించే రెసిపీ
ఇన్స్టంట్ స్నాక్ లేదా టిఫిన్ ఎలాగైనా ఇష్టంగా తినాలనిపించే రెసిపీ దేశి పాస్తా రెసిపీ. ప్రతీ భారతీయుడి వంటింట్లో ఉండే పదార్ధాలతో తయారవుతుంది మసాలా మాక్రోనీ పాస్తా. మసాలా మాక్రోనీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
ఇటాలియన్ పాస్తాకి దేశి ట్విస్ట్ ఇచ్చిన రెసిపీనే ఈ మసాలా మాక్రోనీ. ఇటాలియన్ రెసిపీస్ చప్పగా ఉంటూ అందరికీ ఒకపట్టాన నచ్చేలా ఉండవు. కానీ ఈ మాక్రోనీ తప్పక నచ్చుతుంది. కారంగా ఘాటుగా పుల్లగా నోటికి కమ్మగా ఉంటుంది. అందుకే పెద్దలు కూడా పిల్లల ఇష్టంగా తినేస్తారు.
ఈ రెసిపీలో నేను చివరికి టొమాటో సాస్ కూడా వాడకుండా అన్నీ ప్రతీ ఇంట్లో ఉండే పదార్ధాలతోనే చేశాను, నచ్చితే ఇంకా ఏవేవి వేసుకోవచ్చో, ఎలా మార్పులు చేసుకోవచ్చో టిప్స్ చూడండి.

టిప్స్
1.మాక్రోనీ: నేను మాక్రోనీ పాస్తా వాడాను, మీరు పెన్నే పాస్తా లేదా ఇంకేదైనా పాస్తా కూడా వాడుకోవచ్చు. మాక్రోనీ 90% మాత్రమే ఉడికించి దింపి చాలార్చుకోండి. మిగిలినది మాసాలలో ఉడుకుతుంది.
2.కూరగాయలు:నచ్చితే కలర్ కాప్సికం, స్వీట్ కార్న్, మష్రూమ్స్, పనీర్ తురుము ఏదైనా వేసుకోవచ్చు. నేను ఫ్రొజెన్ బటానీ వాడాను కాబట్టి మాక్రోనీ వేసిన తరువాత బటానీ వేశాను. పచ్చివి తాజా బటానీ వాడేట్లయితే ఉల్లిపాయ మగ్గాక బటానీ వేసి, బాటానీ మగ్గిన తరువాత టొమాటో వేసి మిగిలిన పద్ధతిలో చేసుకోండి.
3.సాసులు:నేను ఏ సాసు వాడకుండా రుచిగా చేశాను, కావలంటే అందుబాటులో ఉంటే టొమాటో కేట్చాప్, పిజ్జా సాస్, చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడుకోవచ్చు.

మసాలా మాక్రోనీ | ఇన్స్టంట్ స్నాక్ లేదా టిఫిన్ ఎలాగైనా ఇష్టంగా తినాలనిపించే రెసిపీ - రెసిపీ వీడియో
Masala Macaroni | Desi Pasta Recipe | How to make Spicy Masala Pasta
Prep Time 2 mins
Cook Time 20 mins
Total Time 22 mins
Servings 2
కావాల్సిన పదార్ధాలు
- 1 cup మాక్రోనీ
- 3 tbsp నూనె/బటర్
- 1/2 tsp జీలకర్ర
- 3 వెల్లులీ సన్నని తరుగు
- 1/3 cup ఉల్లిపాయ తరుగు
- 2 tsp పచ్చిమిర్చి చీలికల తరుగు
- ఉప్పు
- పసుపు – చిటికెడు
- 3/4 tsp కారం
- 1/2 tsp జీలకర్ర పొడి
- 1/2 tsp ధనియాల పొడి
- 1/4 tsp గరం మసాలా
- 1/4 tsp మిరియాల పొడి
- 1/2 cup టొమాటో తరుగు
- 1/4 cup కాప్సికం తరుగు
- 1/4 cup బటానీ
- 2 tbsp కొత్తిమీర
- 1 tsp నిమ్మరసం
- 1/2 cup నీళ్ళు
విధానం
-
నీళ్ళని బాగా మరిగించి నీరు తెర్లుతున్నప్పుడు అందులో మాక్రోనీ వేసి 90% మాత్రమే ఉడికించి, వడకట్టి దింపి చల్లార్చుకోండి
-
పాన్లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, వెల్లులి, పచ్చిమిర్చి తరుగు వేసి వేపి తరువాత ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడే దాకా వేపుకోవాలి
-
ఉల్లిపాయ వేగాక, టొమాటో తరుగు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి టొమాటో మెత్తబడే దాకా ఉడికించుకోవాలి.
-
టొమాటో సగం పైన ఉడికిన తరువాత కాప్సికం తరుగు వేసి ఒక నిమిషం వేపి నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి
-
మరుగుతున్న ఎసరులో ఉడికించిన మాక్రోనీ, బటానీ వేసి నీరు ఇగిరిపోయేదాక ఉడికించుకోవాలి.
-
దింపే ముందు నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలిపి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment ×
14 comments