ఆరోగ్యమైనవి రుచిగా ఉండవు అనే మాట ఈ మిక్స్ వెజ్ బాదాం సూప్ తాగితే అనరేమో! అంత రుచిగా ఉంటుంది ఈ సూప్! ఈ సూప్ చేసుకోవడం కూడా చాలా తేలిక. డైట్లో ఉన్నవారు లేదా టీ కాఫీకి బదులు ఇంకేదైనా ఆరోగ్యంగా తాగలనుకున్నా! చిన్న పిల్లలకి హెల్తీ రెసిపీ కావాలనుకున్నా బెస్ట్ ఈ మిక్స్ వెజ్ బాదాం సూప్!!!

లైట్ సూప్లు హెవీ సూప్లు ఉంటాయి. లైట్ సూప్లు ఆకలి పెంచేవిగా హెవీ సూప్లు పొట్ట నింపేవిగా ఉంటాయ్. ఈ బాదాం సూప్ హెవీ సూప్. కానీ ఇందులో హెవీ సూప్లో ఉండే ఎక్కువెక్కువ కొవ్వు పదార్ధాలు ఉండవు. కేవలం ఒక చెంచా నూనె నచ్చితే కొద్దిగా వెన్న అంతే! ఈ బాదాం సూప్ బ్రేకఫాస్ట్గా లేదా లైట్గా డిన్నర్కి ఏమైనా తీసుకోవాలనిపించినప్పుడు పర్ఫెక్ట్!

Almond Soup | Mix Veg Badam Soup | Healthy and Thick Almond Soup

టిప్స్

బాదం:

  1. నేను బాదం ఉడికించి పొత్తు తీశాను. ఉంటే మీరు రాత్రంతా నానబెట్టినవి పొట్టు తీసి వాడుకోవచ్చు

వెజ్జీస్:

  1. కూరగాయలు ఉడికించెప్పుడు కొద్దిగా పంచదార వేస్తే కూరగాయలు నీళ్ళలో ఉడికినా రంగు మారవు

  2. నేను వేసినవే కాదు మీరు నచ్చితే బ్రొకోలి. మష్రూమ్స్, కొద్దిగా చిలకద దుంప, తీపి గుమ్మడి ముక్కలు ఇలా ఏదైనా వాడుకోవచ్చు

  3. నేను ఫ్రొజెన్ కార్న్ ఫరోజేన్ బటానీ వాడాను కాబట్టి పచ్చివే మిక్సీలో వేసేశాను. మీరు తాజావి వాడితే కేరట్తో పాటు కొద్దిసేపు ఉడికించుకోవాలి

  4. కూరగాయలు మరీ మెత్తగా గుజ్జులా కాక కాస్త బరకగా రుబ్బుకోవాలి

మిక్స్ వెజ్ బాదాం సూప్ - రెసిపీ వీడియో

Almond Soup | Mix Veg Badam Soup | Healthy and Thick Almond Soup | How to Make Almond Soup

Healthy Recipes | vegetarian
  • Cook Time 15 mins
  • Total Time 15 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • 15 బాదాం
  • 1/3 cup కేరట్
  • 1/3 cup బీన్స్
  • 2 tbsp స్వీట్ కార్న్
  • 2 tbsp బటానీ
  • 1/2 tsp నూనె
  • 1 tsp బటర్
  • ఉప్పు
  • 1 tsp మిరియాల పొడి
  • 1 tsp అల్లం తరుగు
  • 1 tsp వెల్లులి తరుగు
  • 1 tsp పచ్చిమిర్చి పేస్ట్
  • 400 ml నీళ్ళు

విధానం

  1. బాదం నీళ్ళలో వేసి 10 నిమిషాలు ఉడికిస్తే పైన పొట్టు సులభంగా ఊడిపోతుంది. ఉడికిన బాదాంని మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. నీళ్ళలో పంచదార కేరట్ బీన్స్ వేసి 3-4 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.
  3. మిక్సీలో ఉడికించిన బీన్స్ కేరట్ స్వీట్ కార్న్ బటానీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
  4. సూప్ కాచే గిన్నెలో నూనె వెన్న కరిగించి అందులో అల్లం వెల్లులి వేసి వెళ్ళి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
  5. వేగిన వెల్లులిలో బరకగా గ్రైండ్ చేసుకున్న వెజిటేబుల్ పేస్ట్ వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి.
  6. వేగిన వెజిటేబుల్స్లో నీళ్ళు పోసి మరిగిస్తే పైన నోరగా ఏర్పడుతుంది, దాన్ని తీసేయండి.
  7. తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్ ఉప్పు మిరియాల పొడి వేసి 3-4 నిమిషాలు చిక్కడనివ్వాలి.
  8. సూప్ చిక్కబడ్డాక వేడి వేడిగా సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

Almond Soup | Mix Veg Badam Soup | Healthy and Thick Almond Soup