Curries
5.0 AVERAGE
3 Comments

వంకాయ బంగాళాదుంపా ములక్కాడ ముక్కలు వేపి చింతపండు పులుసు ఉల్లి తొంనతో గుజ్జులో ఉడికించి చేసే ఆలూ వంకాయ కూర తృప్తినిచ్చే సింపుల్ కర్రీ. ఈ సింపుల్ కర్రీ వేడి అన్నం రొట్టెలతో ఎంతో రుచిగా ఉంటుంది.

ఆలూ వంకాయ కర్రీ దేశం అంతటా చేసినా ఒక్కోరిదీ ఒక్కో తీరు. నేను పూర్తిగా మా ఇంటి తీరులో చేస్తున్నా. వంకాయ ఆలూ కర్రీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తుంటారు అందులోను తెలంగాణాలో చాలా ఎక్కువగా చేస్తారు.

ఈ కూర పులుసులా జారుగా ఇగురులా ముద్దగా కాక కాస్త పల్చగా అన్నంలో కలుపుకునేలా రొట్టెల్లోకి నంజుకునేలా ఉంటుంది. ఈ కూర బ్యాచిలర్స్కి ఇంకా లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.

ఎంత సింపుల్ కూరైనా తృప్తినిచ్చే కమ్మని కూరకి అనుసరించాల్సిన కొన్ని టిప్స్ ఇవి:

Try this recipes - Brinjal Peanut Stew & Rayalaseema Special Brinjal Curry

Aloo Baingan Subzi | Aloo Brinjal curry | Aloo Vankaya Curry

టిప్స్

వంకాయ:

  1. నేను తెల్ల వంకాయని నాలుగు సగాలుగా చీరినవి వాడాను, మీరు నీలం రంగువి లేదా పొడవు వంకాయలు ఇంకా మూళ్ళ వంకాయలు కూడా వాడుకోవచ్చు.

  2. వంకాయ తొడిమ దాదాపుగా కోసి ముచ్చికతో సహా నాలుగు ముక్కలుగా చీరుకుంటే వంకాయ ముక్క మెత్తగా ఉడికిన చిదురు అవ్వదు.

  3. వంకాయలు ముక్కలుగా కోసిన వెంటనే ఉప్పేసినా నీళ్లలో ముక్కలు మునిగేలా ఉంచితే నల్లబడవు.

మునక్కాడ:

  1. సాధారణంగా ఆలూ వంకాయ కూరలో మునక్కాడ ముక్కలు వేయరు మా ఇంటిలో 4-5 మునక్కాడ ముక్కలు వేస్తాము. మీరు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి

  2. మునక్కాడ ముక్కలు పూర్తిగా నారా తీస్తే కూర ఉడికి గుజ్జుగా అయిపోతాయ్, కాబట్టి కొద్దిగా నార తీసుకోండి.

  3. మునక్కాడ ముక్కలు లేతవి అయితే త్వరగా వేగి కూరలో మగ్గిపోతాయ్, ముదురువి అయితే కాస్త ఎక్కువ సేపు వేపుకోండి. మిగిలినది కూరలో మగ్గిపోతుంది.

ఆలూ:

నచ్చితే ఆలూ చెక్కుతో సహా వేసుకుంటేనే రుచి. నేను చెక్కు తీసి వేసాను. ఆలూని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి. ఆలూ పాతవి అయితే దుంప తీపోస్తుంది, అప్పుడు ఇంకొంత ఉప్పు కారం పులుపు అవసరం అవుతాయ్.

చింతపులుసు:

ఈ కూరకి కొద్దిగా చింతపులుసు అవసరమవుతుంది. అంటే చిన్న ఉసిరికాయ సైజు చింతపండు నుండి తీసిన పలుచని పులుసు చాలు.

కూర చిక్కదనం:

కూర కాస్త పలుచగా ఉండగానే దింపేసుకోవాలి. చల్లారాక ఆలూ వల్ల దగ్గర పడుతుంది. ఒకవేళ బాగా ముద్దగా అయిపోతే వేడి నీళ్లు చిటికెడు ఉప్పు వేసి సరిచేసుకోవచ్చు.

ఆలూ వంకాయ కూర - రెసిపీ వీడియో

Aloo Baingan Subzi | Aloo Brinjal curry | Aloo Vankaya Curry | How to Make Aloo Brinjal Curry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 250 gm వంకాయ ముక్కలు
  • 150 gm ఆలూ గడ్డ
  • 1 మునక్కాడ
  • 2 ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
  • 3 టమాటో - సన్నని తరుగు
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 2 tbsp కొత్తిమీర
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండు మిర్చి
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 1 tbsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp జీలకర్ర పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 1/4 cup నూనె
  • 1/2 liter చింతపండు నీళ్లు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో సగం నారా తీసిన మునక్కాడ ముక్కలు వేసి 3-4 నిమిషాలు వేపి తీసుకోండి.
  2. అదే నూనెలో వంకాయ ముక్కలు ఆలు గడ్డ ముక్కలు వేసి వంకాయ మెత్తబడి ఆలూ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని తీసుకోవాలి.
  3. మిగిలిన నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేపుకోవాలి, తరువాత ఉల్లిపాయ తరుగు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపుకోవాలి.
  4. మెత్తబడిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపుకోండి, తరువాత ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కొద్దిగా నీళ్లు పోసి కారాలు మాడకుండా వేపుకోవాలి.
  5. వేగిన కారంలో టమాటో తరుగు వేసి టమాటో ముక్కలు గుజ్జుగా అయ్యేదాకా వేపుకోవాలి.
  6. మగ్గిన టమాటోలో వేపిన ఆలూ వంకాయా మునక్కాడ ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి 4 నిమిషాలు మగ్గించుకోవాలి.
  7. నాలుగు నిమిషాలు మగ్గిన తరువాత పలుచని చింతపండు పులుసు పోసి మునక్కాడ మెత్తబడేదాకా మీడియం ఫ్లేమ్ మీద మూతపెట్టి ఉడికించుకోండి.
  8. మునక్కాడ మెత్తబడ్డాక కొత్తిమీర తరుగు గరం మసాలా వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • L
    Learning to cook
    Recipe Rating:
    Thanks! Turned out good. Followed recipe exactly as written minus the optional drumsticks.
  • S
    Shivani
    Recipe Rating:
    I love this recipe i will follow ur all recipes
  • S
    srimayyia
    Recipe Rating:
    This is an amazing roundup! I have loved all the recipes I have tried from your site, and am looking forward to trying more of these! Sri Mayyia Caterers dates back to 1953, a nostalgic era where traditional Indian fare was a clear favourite, and every feast or celebration was incomplete without the mouthwatering delicacies. for further details pls visit our official website https://www.srimayyiacaterers.co.in/, Contact us @ +91 98450 38235/ +91 98454 97222
Aloo Baingan Subzi | Aloo Brinjal curry | Aloo Vankaya Curry