ఆలూ బటాని మసాలా కూర
అందరికీ తెల్సిన రెసిపీ అనే అయినా, కొన్ని టిప్స్ స్టెప్స్ మరింత రుచిగా మార్చేస్తుంది, ఆలాంటి రెసిపీనే ఆలూ బటానీ కుర్మా.
నాకు ఈ ఆలూ కుర్మా అన్నంలో కంటే రోటీ పూరీలలోకి చాలా రుచిగా అనిపిస్తుంది. ఈ కుర్మా చిక్కని గ్రేవీతో హోటల్లో ఇచ్చే కుర్మా రుచి వస్తుంది. వేసే ప్రతీ పదార్ధం బాచిలర్స్ కిచెన్లో కూడా ఉంటాయ్.
ఆలూ బటానీ కుర్మా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతీ ఊరులో ఒక్కో తీరుగా చేస్తారు. నేను నా విధానం చేస్తున్నాను. ఈ విధానం మా ఇంట్లో ఎక్కువగా చేస్తుంటాము. ఈ కూర్మ రోటీతో నంజుకు తింటే ఒక రుచి, రోటీ పైన కుర్మా పోసుకుని నానబెట్టుకుని తినే ఇంకో రుచి అనిపిస్తుంది. ఏది ఏమైనా తృప్తినిచ్చే సింపుల్ రెసిపీ. ఈ సింపుల్ రెసిపీ టిప్స్ ఫాలో అవుతూ చేయండి బెస్ట్ ఆలూ బటానీ కుర్మా ఎంజాయ్ చేయండి.

టిప్స్
చిక్కని గ్రేవీ కోసం:
-
ఉల్లిపాయాలు సన్నని తరుగు నూనెలో ఎర్రగా బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి, అప్పుడే కూర్మకి చిక్కదనం ఇంకా రుచి
-
కుర్మా దింపే ముందు 4-5 ఆలూ ముక్కలని కూర్మాలో చిదిమేస్తే కుర్మా నీరుగా లేకుండా చిక్కబడుతుంది. ఈ కుర్మా నీరుగా ఉంటే ఒక రుచి చిక్కగా ఉంటే మరో రుచి. నీరుగా కావాలంటే కాసిని నీరు ఎక్కువగా పోసుకుంటే చాలు.
-
కూర్మ రుచి అంతా సన్నని సెగ మీద నిదానంగా ఉడకడంలోనే ఉంది.
-
కుర్మా వేడి చల్లారాక ముద్దగా అనిపిస్తే మరిగే వేడి నీళ్ళు పోసుకుంటే పలుచన అవుతుంది.
ఇంకొన్ని టిప్స్:
-
ఆలూ మరీ మెత్తగా ఉడికిస్తే కూర్మలో చిదురుగా అయిపోతుంది.
-
నేను కనీసం 6-7 గంటలు నానబెట్టిన తెల్ల ఎండు బటానీ వాడాను, అలా నానబెడితేనే ఆలూతో పాటు ఉడికిపోతుంది. మీకు నచ్చితే తాజా బటానీ కూడా వేసుకోవచ్చు కానీ టొమాటో వేగిన తరువాత వేసి 2-3 నిమిషాలు వేపుకుని మిగిలిన పద్ధతి ఫాలో అవ్వండి.
-
కుక్కర్లో అయితే ఆలూ, ఎండిన బటానీ రెండూ విడిగా ఉడికించుని కూర్మలో వేసుకోవాలి.
-
నూనె తగ్గించి, ఉప్పు కారాలు సరిచేసుకుంటే హోమ్మేడ్ స్టైల్ అవుతుంది.
-
నచ్చకుంటే అల్లం వెల్లులి ముద్ద వేయకండి.
-
కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు.
ఆలూ బటాని మసాలా కూర - రెసిపీ వీడియో
Aloo Batani Kurma | Aloo Mutter Masala | Potato Peas Kurma | Aloo Curry
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 150 gm ఆలూ
- 1/2 cup బటానీ (కనీసం 6-7 గంటలు నానబెట్టినవి)
- 3 tbsp నూనె
- 1 tsp జీలకర్ర
- 2 ఉల్లిపాయ తరుగు (పెద్దవి)
- 2 టొమాటో పేస్ట్ (పెద్ద టొమాటోలది)
- 2 పచ్చిమిర్చి చీలికలు
- ఉప్పు
- 1 tbsp కారం
- 1 tsp అల్లం వెల్లులి ముద్ద
- 1/2 tsp పసుపు
- 1/2 tsp జీలకర్ర పొడి
- 1/2 tsp ధనియాల పొడి
- 1/4 tsp గరం మసాలా
- నీళ్ళు – ఆలూ బటానీ ఉడికించడానికి
- 350 ml నీళ్ళు (కూర్మ లోకి)
- కొత్తిమీర – కొద్దిగా
- 2 tsp నెయ్యి
విధానం
-
నీళ్ళలో చెక్కు తీసిన ఆలూ ముక్కలు, బటానీ, పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఆలూని మెత్తగా ఉడికించుకోవాలి.
-
నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి వేపి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిపాయలో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపి, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేపుకోవాలి.
-
తరువాత టొమాటో పేస్ట్ వేసి టొమాటోలోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
-
నూనె పైకి తేలిన తరువాత నీళ్ళు పోసి, మెత్తగా ఉడికిన ఆలూని చిదిమి వేసుకుని హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి
-
మరుగుతున్న కుర్మా పైన ఏర్పడే నురగని తీసేస్తే కూర్మ చూడడానికి బాగుంటుంది.
-
4-5 నిమిషాలు ఉడికిన కూర్మలో ఉడికించిన ఆలూ బటానీ వేసి కలిపి సన్నని సెగ మీద చిక్కబడనివ్వాలి
-
కూర్మ చిక్కబడ్డాక కొత్తిమీర తరుగు ఉప్పు రుచి చూసి నెయ్యి వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
1 comments