ఆలూ మేథీ పరాటా
ఉడికించిన ఆలూ మెంతికూర వాము ఉప్పు కారం గోధుమపిండి వేసి నీళ్లతో మెత్తగా తడిపి మడతలు వేసి కాల్చే పరాటా లంచ్ బాక్సులకి డిన్నర్లకి తిరుగులేని ఆప్షన్ అవుతుంది.
చిరు చేదుగా గంటల తరువాత కూడా మెత్తగా దూదిలా ఉండే పరోటా ఇది. ఆలూ పరాటా అనగానే ఆలూ ముద్దని గోధుమపిండి ముద్దలో కూరి వత్తె పరాటానే, కానీ ఇది పిండిలో ఆలూ ఇంకా మెంతికూర వేసి మెత్తగా కలిపి చేసే ఆలూ మెంతి కూర పరాటా.
ఆలూ పరోటా చేసేప్పుడు చాలా మందికి పగిలిపోతుంది లోపల కోరిన ఆలూ ముదా బయటికి వచ్చేస్తుంది. ఈ తీరులో ఆ ఇబ్బందే ఉండదు! కమ్మని పెరుగుతో నంజుకు తింటే చాలు .

టిప్స్
ఆలూ
ఆలు గడ్డ మెత్తగా ఉడికించి సన్నని రంధ్రాల వైపు తురిమి వాడుకుంటే రోటీలో గడ్డలు ఏర్పడవు.
మెంతి కూర:
నేను పెద్ద మెంతి ఆకు వాడను, మీరు చేదు ఇష్టపడే వారైతే సన్నని మెంతి కూర వాడుకోవచ్చు.
పిండి కలిపే తీరు:
గోధుమపిండి మెత్తగా అయ్యేదాకా కొద్దీ కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ ఎక్కువసేపు వత్తుకోవాలి, ఇంకా తడిపిన పిండి కచ్చితంగా నానాలి. అప్పుడే రోటీ మృదువుగా ఉంటుంది. లేకపోతే అప్పడంలా అవుతుంది.
పరాటాలు కాస్త ఎక్కువ నూనె వేసి కాలిస్తే చాలా రుచిగా ఉంటాయి అనే మాట ఒప్పుకోవాలి. నేను అలా తినడానికే ఇష్టపడతాను. ఇంకా పరాటా మెత్తగా కూడా ఉంటుంది. నూనెతో కాల్చుకోవడం నచ్చని వారు తగ్గించుకోండి
పరాటాలు మడతలు ఇలా వేసుకోవాలి:
వత్తుకున్న పిండి ప్రతీ పొరలో నాలుగు బొట్లు నూనె వేసి మడత వేసి నెమ్మదిగా వత్తితే అప్పుడు పొరలు ఒకదానికి మరొకటి అంటుకోదు.
పరాటా కాల్చే తీరు:
వేడెక్కిన పెనం మీద పరోటా వేసి ముందు రెండు వైపులా నూనె వేయకుండా రంగు మారే దాకా కాల్చి తరువాత నూనె పూసుకుంటూ కాల్చుకోవాలి. పెనం వేడెక్కకుండా పరోటా వేస్తే గట్టిగా అవుతాయి!
ఆలూ మేథీ పరాటా - రెసిపీ వీడియో
Aloo Methi Parata | Aloo Parata | How to Make Aloo Parata
Prep Time 20 mins
Cook Time 15 mins
Resting Time 30 mins
Total Time 1 hr 5 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 2 cups గోధుమపిండి
- 1 cup మెంతి కూర ఆకు తరుగు
- 2 ఉడికించిన ఆలూ
- 2 పచ్చిమిర్చి - తురుము /పేస్ట్
- 1/4 tsp నలిపిన వాము
- 5 వెల్లులి
- ఉప్పు
- కొత్తిమీర కొద్దిగా
- నీళ్లు పిండి తడుపుకోడానికి
- 1 tbsp పిండిలో కలుపుకోడానికి నూనె
- 3 tbsps మడతల్లో పూయడానికి నూనె
- 4 tbsp పరోటాలు కాల్చుకోడానికి నూనె
విధానం
-
మెత్తగా ఉడికించిన ఆలూని వెల్లులిని తురుముకోవాలి.
-
తురుముకున్న ఆలూలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి ముందు నీరు వేయకుండా పిండి గట్టిగా ఆకుని పిండుతూ కలుపుకుంటే తరువాత ఎంత నీరు అవసరం అవుతుందో తెలుస్తుంది.
-
మెత్తగా కలుపుకున్న పిండిలో కొద్దిగా నూనె వేసి మరో నిమిషం కలిపి తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-
నానిన పిండిని నాలు పెద్దవి లేదా చిన్న ఉండలుగా చేసుకోవాలి.
-
కాస్త నూనె రాసి పిండిని పలుచగా వత్తుకుని పైన కాస్త నూనె పూసి త్రిభుజాకారంలో మడత వేసి మళ్ళీ త్రిభుజాకారంలోకి పరోటా వత్తుకోవాలి.
-
వత్తుకున్న పరోటా వేడి పెనం మీద వేసి ముందు రెండు వైపులా కాలనిచ్చి కరువాత నూనె వేసుకుంటూ ఎర్రగా కాల్చి తీసుకోవాలి.
-
ఈ ఆలూ మేథీ పరోటా కమ్మని పెరుగు పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×