ఆలూ రైస్ మిగిలిపోయిన అన్నంతో గొప్ప రెసిపీ

మిగిలిపోయిన అన్నంతో ఎన్ని రకాల వంటకాలున్నా తక్కువ టైమ్లో తయారయ్యే ఈ ఆలూ రైస్ మాత్రం ఎంతో స్పెషల్. అందరికీ నచ్చే రెసిపీస్ చాలా తక్కువే ఉంటాయ్, ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకరికి అది నచ్చదు. కానీ ఈ ఆలూ రైస్ ఘుమఘుమలాడిపోతూ ఎంతో రుచిగా అందరికీ నచ్చేలా ఉంటుంది.

నిజానికి ఈ ఆలూ రైస్ మా చిన్నప్పటి నుండి మా అమ్మ చేసే రెసిపీని కాస్త మార్చాను. తాను వట్టి కొత్తిమీర వేసి చేసేది. నేను దాని ఇంకొంచెం మార్చి పుదీనా, రంగు మారకుండా కమ్మదనం కోసం పెరుగు వేసి చేశాను. ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ పంజాబీ హర్యాలీ చట్నీ లాంటిదే!

ఎంతో రుచిగా ఉండే ఈ రైస్తో చల్లని రైతా చాలా రుచిగా ఉంటుంది.

Aloo Rice | Easy Aloo rice with Leftover rice | Potato Rice

టిప్స్

ఆలూ :

  1. చెక్కు తీసిన బంగాళా దుంపలు మీడియం సైజు ముక్కలుగా కోసుకోండి.

  2. దుంపలు మరీ పాతవి లేదా మొలకలు వచ్చినవి వాడితే దుంప తియ్యగా ఉంటుంది. కాబట్టి తాజా బంగాళా దుంపలు వాడుకోండి.

ఇంకొన్ని టిప్స్:

  1. ఇదే రెసిపీ నచ్చితే బ్రౌన్ రైస్తో చేసుకోవచ్చు.

  2. ఇదే రైస్ మిగిలిన అన్నంతో లేదా వేడి అన్నంతోనూ చేసుకోవచ్చు. ఒకవేళ అన్నం బాగా బిరుసెక్కి ఉంటే పుదీనా పేస్ట్లో ఇంకా కాస్త నీరుగా ఉండగానే వేసి కలుపుకుంటే అన్నం మెత్తబడుతుంది.

  3. వేసే టొమాటో ముక్కలు కాస్త పెద్దవిగా ఉంటే నోటికి అందుతాయ్, లేదంటే అన్నంలో కలిసిపోతాయ్.

  4. రైస్ని హై ఫ్లేమ్ మీద టాస చేస్తేనే ఫ్లేవర్స్ బాగా పడతాయ్.

ఆలూ రైస్ మిగిలిపోయిన అన్నంతో గొప్ప రెసిపీ - రెసిపీ వీడియో

Aloo Rice | Easy Aloo rice with Leftover rice | Potato Rice

Flavored Rice | vegetarian
  • Prep Time 3 mins
  • Cook Time 10 mins
  • Total Time 13 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • పుదీనా కొత్తిమీర పేస్ట్
  • 1 పుదీనా
  • 1 కొత్తిమీర
  • 5 వెల్లులి
  • 1/2 inch అల్లం
  • 3 - 4 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • 3 tbsp పెరుగు
  • 1/2 నిమ్మరసం చెక్క
  • నీళ్ళు కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోడానికి
  • రైస్ కోసం
  • 3 tbsp నూనె
  • 150 gms ఆలూ
  • 1 ఉల్లిపాయ (చీలికలు )
  • 1 కరివేపాకు రెబ్బ
  • 1 టొమాటో ముక్కలు
  • 1/2 tsp జీలకర్ర పొడి
  • 1 tsp కారం
  • 1 cup ఉడికించుకున్న అన్నం (185 gm)

విధానం

  1. హర్యాలీ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. ముకుడులో నూనె వేడి చేసి అందులో బంగాళాదుంప ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక కలుపుతూ వేపుకోండి.
  3. వేగిన దుంపలలో ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడనివ్వాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి టొమాటో పైన తోలు ఊడే దాకా మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి.
  4. టొమాటో మెత్తబడ్డాక కారం జీలకర్ర పొడి వేసి నూనె పైకి తేలేదాక వేపుకోండి.
  5. వేగిన మసాలాలో పుదీనా పేస్ట్ వేసి నూనె పైకి టెలీ చిక్కబడే దాకా వేపుకోండి.
  6. చిక్కబడిన పుదీనా పేస్ట్లో ఉడికిన అన్నం వేసి హై ఫ్లేమ్ మీద కలుపుతూ పట్టించనది.
  7. హై ఫ్లేమ్ మీద అన్నం పొడిపొడిగా అయ్యేదాకా పట్టించాక దింపి సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • S
    Sabiya safrin
    Recipe Rating:
    Great recipe.thank a lot for sharing your awesome recipes sir.
  • M
    Mourya
    Recipe Rating:
    On weekly 2 times this will be in my lunch box annaya..loved it
Aloo Rice | Easy Aloo rice with Leftover rice | Potato Rice