ఆలూని ఎర్రగా వేపి మిరియాలు అల్లం జీడిపప్పు తాలింపు పెట్టి చేసే ఆలూ రైస్ చేసినంత సేపు పట్టదు ఖాళీ అవ్వడానికి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

ఇది హ్యాపీ టమ్మీ సీరీస్ రెసిపీ. అంటే తిన్నాక పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. ఇందులో పొట్టని ఇబ్బంది పెట్టె మసాలాలు ఏవీ లేవు.

ఈ రెసిపీలో ఒక మంచి విషయం ఏంటంటే చల్లారిన ఈ ఆలూ రైస్ రుచిగా ఉంటుంది. లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్. కాబట్టి ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా ఈ విధంగా ఆలూ రైస్ చేసుకోవచ్చు.

కమ్మని కొబ్బరి జీడిపప్పు అక్కడక్కడ మిరియాల ఘాటుతో చాలా రుచిగా ఉంటుంది. ఈ సింపుల్ ఆలూ రైస్కి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు.

నేను ఇంతకముందు ఒక ఆలూ రైస్ చేసాను, ఆ రెసిపీ ఇదీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

Aloo Rice | Potato Rice

టిప్స్

ఆలూ:

ఆలూ కొత్తవి వాడుకుంటే కరకరలాడుతూ వేగుతాయ్. పాతవి అయితే బంగాళా దుంప తియ్యగా ఉంటుంది ఇంకా పిండిగా ఉంటుంది, ఇంకా అంత రుచిగా ఉండదు ఆలూ వేపుడు.

ఆలూని చెక్కు తీసి ముక్కలుగా కోసి చల్లని నీళ్లలో వేసి వదిలేయండి అప్పుడు ముక్క నల్లబడదు, పిండి పదార్ధం ఉంటె పోతుంది.

మిరియాలు:

నేను ¼ చెంచా మిరియాలు మరో ¼ చెంచా మిరియాల పొడి వేశాను, మీకు నచ్చితే అచ్చంగా మిరియాల పొడే వేసుకోవచ్చు. లేదా మీకు తగినట్లుగా మిరియాలు వేసుకోండి.

ఈ రెసిపీలో మిరియాల ఘాటు చాలా బాగుంటుంది, మిరపకాయల కారం కంటే

పచ్చిమిర్చి:

ఏదో కారం ఉండాలని నామ మాత్రంగా ఒక్క మిర్చి చీరి వేశాను. రెసిపీలో కారం అంత మిరియాలు ఇంకా సన్నని అల్లం ముక్కలదే!!!

మసాలాలు:

చెక్కా లవంగాలు కేవలం ఒకటి లేదా రెండు అంతే అది కూడా ఫ్లేవర్ కోసం!!!

పచ్చికొబ్బరి :

పచ్చికొబ్బరి రెసిపీలోని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడమే కాదు రైస్కి ఎంతో కమ్మదనాన్ని ఇస్తుంది.

జీలకర్ర- సోంపు:

రెండూ కొద్దిగా కొద్దిగా కూడా వేసుకోవచ్చు. నేను ఒక్క జీలకర్రె వేశాను

ఆలూ రైస్ - రెసిపీ వీడియో

Aloo Rice | Potato Rice | How to make potato rice with tips

Bachelors Recipes | vegetarian
  • Prep Time 30 mins
  • Cook Time 15 mins
  • Total Time 45 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బంగాళా దుంప ముక్కలు
  • 6 tbsp నూనె
  • 15 జీడీపప్పు
  • 1/4 inch దాల్చిన చెక్క
  • 1 - 2 లవంగాలు
  • 2 యాలకులు
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp జీలకర్ర
  • 1/2 tsp సోంపు (ఆప్షనల్)
  • 1/4 tsp మిరియాలు
  • 1 పచ్చిమిర్చి చీలికలు
  • 2 కరివేపాకు రెబ్బలు
  • 1 tsp అల్లం తురుము
  • 1.5 cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు
  • 1 cup బియ్యాన్ని పొడి పొడిగా వండుకున్నది
  • 1/4 cup పచ్చికొబ్బరి తురుము
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • 1/4 cup మిరియాల పొడి

విధానం

  1. నూనె వేడి చేసి ఆలూ ముక్కలు వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
  2. అదే నూనెలో చెక్కా లవంగాలు యాలకలు మిరియాలు జీలకర్ర వేసి వేపుకోండి.
  3. వేగిన మసాలాలో కరివేపాకు పచ్చిమిర్చి అల్లం తరుగు జీడిపప్పు వేసి వేపుకోండి.
  4. తరువాత ఉల్లిపాయ సన్నని తరుగు ఉప్పు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  5. ఉల్లిపాయ వేగిన తరువాత పొడి పొడిగా వండుకున్న అన్నం కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి తురుము, మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి.
  6. దింపే ముందు ఒక్క సారి ఉప్పు రుచి చూసి అవసరమైతే వేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

31 comments

Aloo Rice | Potato Rice