ఉసిరికాయ పప్పు | ఉసిరికాయ పప్పు రెసిపి

ఉసిరికాయ పప్పు మెత్తగా ఉడికించిన ఉసిరికాయలని పచ్చిమిర్చిని మెత్తుగా రుబ్బి ఉడికించుకున్న అకందిపప్పులో కలిపి చేసే ఈ పప్పు వింటర్ స్పెషల్ రెసిపీ. విటమిన్ సి పుషకాలంగా దొరికే ఉసిరికాయని పచ్చడే కాదు ఇలా పప్పు చేసుకున్నా ఎంతో రుచిగా ఉంటుంది.

మా ఇంట్లో శీతాకాలంలో చాలా ఎక్కువగా చేసుకుంటాము, అందరికి చాలా ఇష్టం ఈ పప్పు. అదే రెసిపీని మీతో పంచుకుంటున్నాను, తప్పాకా మీరు ప్రయత్నించి ఎలా నచ్చిందో కామెంట్ చేయండి.

ఇంకా ఈ రెసిపీలో చిన్న మార్పులతో ఎలా చేసుకోవచ్చో కూడా కింద వివరంగా రాసి ఉంచాను చుడండి.

టిప్స్

ఉసిరికాయలు:

*ఈ కొలత పప్పుకి 5-6 ఉసిరికాయలు సరిపోతాయి, ఉసిరికాయలు మరీ మెత్తగా గుజ్జుగా కాకుండా కాస్త పలుకుగా ఉంటేనే పప్పులో నోటికి అందుతుంది, పంటికింద నలుగుతుంది.

పప్పు:

*నేను ఈ పప్పు కందిపప్పు వాడి చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే పెసరపప్పు వాడి కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు వాడుకుంటే నెయ్యి తాలింపు పెట్టుకోండి ఇంకా రుచిగా ఉంటుంది.

*పెసరపప్పు వాడేట్లైతే కాస్త పలుచగా చేసుకుంటే చల్లారిన తరువాత బిరుసెక్కదు పప్పు. లేదంటే గట్టిగా అయిపోతుంది.

కారం:

*ఈ పప్పులో ఎండు కారం ఉండదు, కారమంతా మనకి పచ్చి మిర్చి కారమే కాబట్టి మీరు వాడే మిరపకాయల కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు.

ఉసిరికాయ పప్పు | ఉసిరికాయ పప్పు రెసిపి - రెసిపీ వీడియో

Amla Dal | Usirikaya Pappu | Amla Dal Recipe | Vismai Food

Veg Curries | vegetarian
  • Prep Time 2 mins
  • Soaking Time 1 hr
  • Cook Time 30 mins
  • Total Time 1 hr 32 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • ఉసిరికాయ ముద్ద కోసం:
  • 6 ఉసిరికాయలు
  • 1 ½ cups నీరు
  • 5 - 7 పచ్చిమిర్చి
  • పప్పు ఉడికించుకోడానికి:
  • ½ cup కందిపప్పు
  • 2 పచ్చిమిర్చి
  • ¼ tsp పసుపు
  • 1½ cups నీళ్లు
  • పప్పు కోసం:
  • ½ cup నూనె
  • ¼ tsp మెంతులు
  • 1 tbsp ఆవాలు
  • 2 ఎండుమిర్చి
  • 1 tbsp పచ్చిశెనగపప్పు
  • 2 pinches ఇంగువ
  • ½ tsp జీలకర్ర
  • 10-12 cloves దంచిన వెల్లులి
  • 3 sprigs కరివేపాకు
  • ½ cup ఉల్లిపాయ సన్నని తరుగు
  • 2 పెద్ద టమాటో తరుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు

విధానం

  1. కందిపప్పు ని కడిగి నానబెట్టుకోండి.
  2. ఉసిరికాయలని నీరు పోసి ఉడికించుకోండి. ఉడికిన ఉసిరిని తీసి చల్లార్చండి. మిగిన నీరు పక్కనుంచండి.
  3. నానిన పప్పులో పసుపు పచ్చిమిర్చి నీరు వేసి మెత్తగా ఉడికించుకోండి.
  4. ఉడికిన ఉసిరికాయలలోని గింజలు తీసేసి ముక్కలుగా కోసుకోండి అందులో పచ్చిమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి.
  5. నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి రంగు మారనివ్వండి, ఆ తరువాత ఆవాలు ఎండుమిర్చి సెనగపప్పుతో మిగిలిన తాలింపు సామాగ్రీ అంతా వేసేసి తాలింపు వేపుకోండి.
  6. వేగిన తాలింపులో ఉల్లిపాయ సన్నని తరుగు వేసి మెత్తబడే వరకు వేపుకోండి.
  7. మెత్తబడిన ఉల్లిపాయలో, టమాటో తరుగు, ఉప్పు, పసుపు వేసి గుజ్జుగా అయ్యేదాకా మగ్గించుకోండి.
  8. గుజ్జుగా ఉడికిన టమాటోలో, మెత్తగా ఉడికించుకున్న పప్పు వేసి కలిపి 5-6 నిమిషాలు ఉడికించుకోండి.
  9. ఆ తరువాత బరకగా రుబ్బుకున్న ఉసిరి పేస్ట్, ఉసిరిని ఉడికించుకున్న నీరు అవసరం మేరకు పోసి కలిపి మూతపెట్టి ఇంకో 3-4 నిమిషాలు ఉడికిస్తే ఉసిరిలోని సారమంతా పప్పులోకి దిగుతుంది.
  10. దింపబోయే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • A
    Alekhya
    Recipe Rating:
    Actually it is better when we are watching in you tube than studying here