ఆంధ్రా కరివేపాకు పచ్చడి
కరివేపాకు, పచ్చిమిర్చి వేపైకి బెల్లం చింతపండు గుజ్జులో ఉడికించి చేసే ఈ పచ్చడి కనీసం నెల రోజుల పైన నిల్వ ఉంటుంది. పచ్చి మిర్చి కరివేపాకు వేసి చేసే ఈ పచ్చడి తియ్యగా కారంగా పుల్లగా వేడిగా నెయ్యి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
ఇంట్లో ఏ కూర ఉన్నా లేకున్నా ఈ ఒక్క కరివేపాకు పచ్చడి చాలు అంటారు ఆంధ్రాలోని కోనసీమ వారు. కరివేపాకు పచ్చడిలోనే ఎండుమిర్చి వేసే చేసే తీరు పచ్చడి మరొకటి ఉంది. ఆ తీరులో చేసే పచ్చడి కనీసం 6-8 నెలలు నిల్వ ఉంటుంది. అది నేను తొందర్లో పోస్ట్ చేస్తా.
ఈ సింపుల్ పచ్చడి పర్ఫెక్ట్ రుచి కోసం కింద టిప్స్ కొలతలు జాగ్రత్తగా పాటిస్తే పచ్చడి ఎక్కువకాలం నిల్వ ఉండే తీరు తెలుస్తుంది.

టిప్స్
కరివేపాకు:
-
కరివేపాకు ముదురు ఆకు తీసుకోవాలి. లేత ఆకు వాడితే గ్రైండింగ్లో పచ్చడి పేస్ట్లా అయిపోతుంది. అదే ముదురు కరివేపాకు వాడితే ఆకులో నార కారణంగా పచ్చడి అన్నంలో కలిపినా నోటికి తెలుస్తుంది.
-
కరివేపాకు కడిగి చెమ్మ ఆర్ దాక నీడన ఆరబెట్టుకోవాలి.
చింతపండు:
-
పచ్చడికి వాడే చింతపండు వేడి నీళ్లలో చింతపండు మునిగేదాకా నీరు పోసి, చిక్కని గుజ్జు తీసుకోండి. ఎక్కువగా నీరు పోయకండి, ఆలా చేస్తే పలుచని పులుసు అవుతుంది, మరగడానికి చాలా సమయం పడుతుంది.
-
నానబెట్టిన చింతపండు నుండి తీసిన గుజ్జు సుమారు 100 గ్రాములు
బెల్లం:
-
బెల్లం 50 గ్రాములు సరిపోతుంది. బెల్లం తీపి తగ్గించుకున్నా పర్లేదు.గోదావరి జిల్లాల వారు ఇంకా తీపి వేసి చేస్తారు.
-
బెల్లం నచ్చని వారు తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా బెల్లం వేయకుండా మిరపకాయలు, ఉప్పుతో సరిపెట్టుకోవచ్చు.
పచ్చిమిర్చి:
-
నేను ఈ పచ్చడికి మీడియం కారం గల పచ్చిమిర్చి 100 గ్రాములు వాడాను. మీడియం కారంగల మిరపకాయల వలన పచ్చడి ఎక్కువ వస్తుంది.
-
ఒక వేళా మీరు కారం మిరపకాయలు వాడితే 75 గ్రాములు చాలు
తాలింపు:
నేను ఆఖరున పచ్చడికి ఎలాంటి తాలింపు వేయలేదు, నచ్చితే మీరు ఆవాలు జీలకర్ర ఇంగువ తాలింపు పెట్టుకోవచ్చు.
ఆంధ్రా కరివేపాకు పచ్చడి - రెసిపీ వీడియో
Andhra Curry Leaves Pickle | Karivepaku Nilva pacchadi | How to Make curry Leaves Pickle
Prep Time 30 mins
Cook Time 20 mins
Resting Time 1 hr
Total Time 1 hr 50 mins
Servings 12
కావాల్సిన పదార్ధాలు
- 50 gms కరివేపాకు
- 90 - 100 gms చింతపండు గుజ్జు
- 100 gm పచ్చిమిర్చి
- 2 tbsp ఉప్పు
- 1/4 cup నూనె
- 1 tsp ఆవాలు
- 1/4 tsp మెంతులు
- 1 tsp జీలకర్ర
- 1 tbsp మినపప్పు
- 1 tbsp సెనగపప్పు
- 2 tsp ధనియాలు
- 10 వెల్లులి
- 1/2 tsp పసుపు
విధానం
-
మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రబడే దాకా వేపుకోవాలి.
-
వేగిన మెంతుల్లో సెనగపప్పు మినపప్పు వేసి రంగు మారే దాటాక వేపుకోవాలి, ఆ తరువాత మెంతులు వేసి వేపుకోవాలి
-
వేగిన తాలింపులో వెల్లులి జీలకర్ర పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చిని నిదానంగా పూర్తిగా మగ్గనివ్వాలి నూనెలో.
-
పమగ్గిన పచ్చిమిర్చిలో కడిగి నీడన ఆరబెట్టినా కరివేపాకు వేసి ఆకులో చెమ్మారి కారకరలాడేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి
-
వేగిన తాలింపుని మీకేసీ జార్లోకి తీసి నీరు వేయకుండా కాస్త బరకగా రుబ్బుకోవాలి
-
కరివేపాకు వేపిన మూకుడులోనే చిక్కని చింతపండు గుజ్జు బెల్లం వేసి తేనేలాంటి చిక్కని పేస్ట్ అయ్యేదాకా ఉడికించాలి (బెల్లం చింతపండులోని గుజ్జుతో కరిగిపోతుంది)
-
చిక్కని చింతపండు పేస్టులో ఉప్పు పసుపు గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడి వేసి స్టవ్ ఆపేసి బాగా కలిపి పూర్తిగా చల్లారానివ్వాలి.
-
చల్లారిన పచ్చడిని గాజు సీసాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే నెల రోజుల పైన బైట అయితే 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

Leave a comment ×
2 comments