కాకరకాయ పొడి
కాకరకాయని సెనగపప్పు, ధనియాలు మిరపకాయల్ని ఎర్రగా వేపి చేసే కాకరకాయ పొడి చేదు ఉండదు, నెల రోజులకి పైగా నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
పచ్చళ్లు పొడులు చేయడంలో తెలుగువారు తరువాతే ఎవ్వరైనా...ఎన్నేసి పోరులో ఎన్ని రకాల పచ్చడులో. సాధారణంగా కాకరకాయ చేదని ఎక్కువగా ఇష్టపడరు, పిల్లలైతే అసలు తినరు. ఇలా పొడిగా చేస్తే ఎవ్వరైనా ఇష్టంగా తింటారు.
ముఖ్యంగా బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఫ్యామిలీస్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా కూరగాయలు లేనప్పుడు ఇలాంటి పొడులు ఉంటె ఆ పూట తృప్తిగా భోజనం చేయొచ్చు. ఈ పొడి వేడి అన్నంతోనే కాదు, ఇడ్లీ అట్టుతో నంజుకోడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది.
తెలుగు వారు కాకరకాయ కారం చాలా తీరులో చేస్తారు, కొందరు కాకరకాయ ముక్కలని ఎండకుపెట్టి ముక్కల్లోని చెమ్మ ఆరేదాకా ఎండించి పొడి చేస్తారు, ఇంకొందరు ముక్కలని నూనెలో వేపి పొడి చేస్తారు. నేను మా ఇంటి తీరులో కాకరకాయ తురిమి చేస్తున్నాను. ఈ పద్ధతి చాలా సులభం!!!

టిప్స్
కాకరకాయ:
- కాయలు లేతవి అయితే మంచిది. నచ్చితే కాకరలోని గింజలు తీసేయొచ్చు నేను తురిమేశాను.
- కాకరకాయని పెద్ద రంధ్రాలు ఉన్నవైపు తురుముకోండి. చిన్న రంధ్రాలు ఉన్న వైపు తురిమితే మరీ ఎక్కువగా వేగిపోతుంది. నచ్చితే మీరు సన్నని ముక్కలుగా కూడా తరుక్కుని ముక్కలు ఎర్రగా వేపుకోవచ్చు.
పప్పులు వేపే తీరు:
వేసిన సెనగ మినప ధనియాలు ఇవన్నీ సన్నని సెగ మీదే వేపుకోవాలి. అప్పుడే పప్పు లోపలిదాకా వేగి ఎంతో రుచిగా ఉంటుంది పొడి
మిరపకాయలు:
కారం మీకు తగినట్లుగా వేసుకోండి. పొడి చేసాక కారం తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొన్ని మిరపకాయలు వేపి పొడి చేసి కలుపుకోవచ్చు
వెల్లులి:
కొందరికి వెల్లులి పరిమళం నచ్చుతుందిఅలాంటి వారు వెల్లులి ఎక్కువగా వేసుకోండి.
బెల్లం:
వేసే ఆ కొంచెం బెల్లం చెడుని పిలుపుని బాలన్స్ చేస్తూ చాలా రుచిగా ఉంటుంది. నచ్చని వారు స్కిప్ చేసుకోవచ్చు.
కాకరకాయ పొడి - రెసిపీ వీడియో
Andhra Style Bittergourd podi for Rice | Kakarakaya karam | How to Make Kakarakaya Karam
Prep Time 5 mins
Cook Time 18 mins
Resting Time 30 mins
Total Time 53 mins
Servings 20
కావాల్సిన పదార్ధాలు
- 300 gms కాకరకాయ
- 2 tbsp పచ్చిశెనగపప్పు
- 2 tbsp మినపప్పు
- 1 tsp జీలకర్ర
- 2 tbsp ధనియాలు
- 7 - 8 వెల్లులి - రెబ్బలు
- చింతపండు - ఉసిరికాయంత
- 10 - 15 ఎండుమిర్చి
- 1 tbsp బెల్లం
- ఉప్పు - రుచికి సరిపడా
- 1/3 cup నూనె
విధానం
-
కాకరకాయని పెద్ద రంధ్రాల వైపు తురుముకోవాలి. తరువాత ఉప్పేసి కలిపి ముప్పై నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
-
ఒక స్పూన్ నూనె వేసి మినప సెనగ ధనియాలు జీలకర్ర ఒక్కోటిగా వేసుకుంటూ మాంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి.
-
పప్పులు వేగాక వెల్లులి, చింతపండు కూడా వేసి వేపి దింపి చల్లార్చుకోండి.
-
ఇంకో స్పూన్ నూనె వేసి ఎండుమిర్చిని ఎర్రగా వేపుకోవాలి. వేగిన మిర్చిని చల్లార్చుకోవాలి.
-
ఉప్పేసి కలిపి ఉంచుకున్న కాకరకాయ తురుముని గట్టిగా పిండి రసం తీసేయాలి.
-
మిగిలిన నూనె వేసి పిండిన కాకరకాయ ముద్ద వేసి మాంచి బంగారు రంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోవాలి. బంగారు రంగు వచ్చాక దింపి పూర్తిగా చల్లార్చాలి.
-
మిక్సీలో వేపుకున్న పప్పుల్ని మిర్చీని చింతపండు ఉప్పు బెల్లం వేసి మెత్తని పొడి చేసుకోండి.
-
తరువాత వేపుకున్న కాకరకాయ పొడి వేసి పల్స్ చేసి తీసుకోండి.
-
పొడిని గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే నెలకి పైగా నిల్వ ఉంటుంది. వేడిగా నెయ్యి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
1 comments