దోసకాయ ఆవపెట్టిన ఇన్స్టంట్ పచ్చడి

దోసకాయ ఆవకాయ ఆంధ్రుల స్పెషల్ పచ్చడి. (దోసకాయ అంటే cucumber ఆవా అంటే మాస్టర్డ్ ) ఈ దోసకాయ ఆవపెట్టిన ఈ ఇన్స్టంట్ పచ్చడి ఆవాల ఘాటుతో ఘుమఘుమలాడిపోతూ ఎంతో రుచిగా ఉంటుంది. జస్ట్ 10 నిమిషాల్లో తయారైపోతుంది. ఈ ఆవపెట్టిన పచ్చడితో వేడి అన్నం నెయ్యి ఉంటే చాలు ఎంత తిన్నా ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది.

దోసకాయతో చేసే ఆవకాయ వేరు ఇలా ఇన్స్టంట్గా ఆవ పెట్టి చేసే పచ్చడి వేరు. ఈ పచ్చడి బయట ఒక రోజు ఫ్రిజ్లో 3-4 రోజులు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి నాకు తెలిసి ఎక్కువగా గోదావరి జిల్లాల వారు చేస్తుంటారు. నిజానికి నేను మొదటగా తిన్నది, నేర్చుకున్నది ఆక్కడే!

Andhra Style Cucumber Pickle

టిప్స్

దోసకాయ:

  1. దోసకాయ కచ్చితంగా గట్టిగా ఉండాలి. అప్పుడే దోసకాయ ముక్కలు కరకరలాడుతూ రుచిగా ఉంటుంది. నచ్చితే దోసకాయ గింజలు వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేశాను. మిగిలినవి తీసేశాను

  2. దోసకాయ నాటుకాయ అయితే కాస్త పుల్లగా ఉంటుంది.

ఆవాలు:

  1. కొందరు ఆవాల ఘాటు ఇష్టంగా తింటారు. కొందరు ఒక మోస్తరుగా ఇష్టపడతారు. నేను మధ్యస్థంగా ఆవాలు వాడాను. మీరు మీకు తగినట్లుగా ఆవాలు పెంచుకోండి తగ్గించుకోండి

తాలింపు:

  1. తాలింపు ఎర్రగా వేగితే రుచి. పప్పులు మెత్తగా మెదిగాక సువాసనతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా మెంతులు ఎర్రగా వేగకపోతే చేదుగా మిగిలిపోతాయ్, వేగితే సువాసన.

నూనె:

  1. ఉంటే నువ్వుల నూనె, లేదా సేనగనూనె రుచిగా ఉంటుంది పచ్చడికి.

ఆఖరుగా:

  1. పచ్చడి ఆవాల పేస్ట్లో బాగా నానాలి ఊరాలి అప్పుడు దోసకాయ ముక్కలు రుచిగా ఉంటాయి. కాబట్టి పచ్చడి చేసి ఒక గంట అయినా ఊరనివ్వాలి

దోసకాయ ఆవపెట్టిన ఇన్స్టంట్ పచ్చడి - రెసిపీ వీడియో

Andhra Style Cucumber Chutney | How to Make Cucumber Chutney

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 3 mins
  • Resting Time 10 mins
  • Total Time 15 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • తాలింపు కోసం
  • 1 tsp నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 1/2 tsp మెంతులు
  • 1 tsp మినపప్పు
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • 1/2 tsp జీలకర్ర
  • 2 ఎండు మిర్చి
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • 1 రెబ్బ కరివేపాకు
  • ఆవాల పేస్ట్ కోసం
  • 1.5 tsp ఆవాలు
  • 4 పచ్చిమిర్చి
  • 1.5 tbsp చింతపండు గుజ్జు
  • ఉప్పు
  • కొత్తిమీర – కొద్దిగా
  • 2 చిటికెళ్లు పసుపు
  • నీళ్ళు – గ్రైండ్ చేసుకోడానికి
  • 175 gm దోసకాయ ముక్కలు (చెక్కు తీసి గింజలు తీసేసినవి)
  • 2.5 tbsp నూనె

విధానం

  1. నూనె లో ఆవాలు మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి. తరువాత మినపప్పు శెనగపప్పు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపి మిగిలిన సమానంతా వేసి వేపుకోవాలి.
  2. వేగిన తాలింపుతో పాటు ఆవాల పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. దోసకాయ ముక్కల్లో మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆవాల పేస్ట్ నూనె వేసి కలిపి గంట సేపు వదిలేయండి ఆ తరువాత వేడి వేడి అన్నం నెయ్యి కలిపి తినండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • G
    geetha
    Recipe Rating:
    Tried it and it came out really delicious! But , one correction! the written recipe is missing the ingredient "Ginger" which is in the video. I followed the written recipe and missed the ginger but it still turned out great! Just pointing out so the written recipe can be fixed.
Andhra Style Cucumber Pickle