గోంగూర రొయ్యలు కర్రీ | ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ

ఆంధ్ర స్టైల్ గోంగూర రొయ్యలు కర్రీ రొయ్యలు మగ్గించి నూనెలో వేపిన గోంగూరలో కలిపి చేసే ఆంధ్రుల స్పెషల్ గోంగూర రొయ్యలు పుల్లగా కారంగా వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.

తెలుగు వారు అందులోను గోదావరి జిల్లాల స్పెషల్ రెసిపీ ఈ గోంగూర రొయ్యలు. నేను రెస్టారెంట్స్ తీరులో గోంగూర రొయ్యలు చేస్తున్నాను. సాధారణంగా ఇళ్లలో చేసుకునే తీరు ఇంటికో తీరులో ఉంటుంది, కొందరు కొన్ని వేస్తే ఇంకొందరు ఇంకొన్ని వేయరు. నేను పూర్తిగా రెస్టారెంట్స్ లో అందరికి నచ్చే తీరులో చేస్తున్నాను.

ఈ రెసిపీ చాలా సింపుల్, చేసే ముందు కింద టిప్స్ని అర్ధం చేసుకుంటే ఏ కొలతకి చేసిన ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు.

టిప్స్

రొయ్యలు:

మీకు గోదావరి తీరు గోంగూర రొయ్యలు కావాలంటే అక్కడ దొరికే చిన్న రొయ్యలు వాడుకుంటే అసలైన రుచి. నాకు హైదరాబాద్లో గోదావరి రోయ్య్లు దొరకలేదు అందుకే నేను ఆన్లైన్లో దొరికే మీడియం సైజు రొయ్యలు వాడేశాను.

రోయ్యలు వేపే తీరు:

రోయ్యలు నూనెలో ఉప్పు పసుపు వేసి కేవలం రొయ్యల్లోనుంచి నీరు ఆవిరయ్యదాకా మాత్రమే వేపుకుని తీసుకుంటే సరిపోతుంది. మిగిలినది కూరలో మగ్గిపోతుంది. అలా కాక నూనెలోనే ఎర్రగా వేపితే రొయ్యలు కూరలో రబ్బరులా అయిపోతాయి.

గోంగూర:

•గోంగూర రొయ్యలకి గోంగూర రొయ్యలు సమానం కొలత అయితే బాగుంటుంది. •గోంగూర ఆకులు మాత్రమే ఒలిచి బాగా కడగాలి లేదంటే ఇసుక ఉంటుంది.

ఇంకొన్ని విషయాలు:

•గోంగూరకి కాస్త నూనె ఉండాలి అప్పుడే రుచి, లేదంటే జిగురుగా ఉంటుంది కూర. •ఇంకా పుల్లని గోంగూరాలి కాస్త ఉప్పు కారాలు మోతాదు ఎక్కువే, కాబట్టి రుచి చూసి వేసుకోండి.

గోంగూర రొయ్యలు కర్రీ | ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ - రెసిపీ వీడియో

Andhra Style Gongura Prawns | sorrel leaves prawns curry | Gongura Prawns Curry

Bachelors Recipes | nonvegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 25 mins
  • Total Time 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • రొయ్యలు వేపుకోడానికి:
  • 250 gms రొయ్యలు
  • 2 tbsp నూనె
  • ¼ tsp పసుపు
  • ఉప్పు - కొద్దిగా
  • కూర కోసం:
  • 4 tbsp నూనె
  • 1 inch దాల్చిన చెక్క
  • 4 లవంగాలు
  • 4 యాలకులు
  • ½ బిర్యానీ ఆకు
  • ¼ tsp జీలకర్ర
  • 3 sprigs కరివేపాకు
  • 3 slit పచ్చిమిర్చి ((చీరుకున్నవి))
  • ½ cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ½ tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • ½ cup టమాటో
  • ¼ tsp పసుపు
  • 1 ½ tsp కారం
  • 1 tsp వేపిన ధనియాల పొడి
  • 1 tsp వేపిన జీలకర్ర పొడి
  • 4 tbsp నీళ్లు
  • 250 gms గోంగూర ఆకులు
  • ½ cup నీళ్లు
  • ½ tbsp గరం మసాలా
  • 1 tbsp పచ్చిమిర్చి తరుగు
  • 2 sprigs కరివేపాకు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో రొయ్యలు ఉప్పు పసుపు వేసి రొయ్యల్లోనుంచి నీరు ఆవిరయ్యేదాకా వేపి తీసి పక్కనుంచుకోండి.
  2. కూర కోసం నూనె వేడి చేసి అందులో మసాలా దినుసులు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేపుకోండి.
  3. వేగిన మసాలాల్లో ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి.
  4. వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లులి ముద్ద వేసి వేపండి. అది వేగిన తరువాత టమాటో తరుగు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యాయేదాకా వేపుకోండి.
  5. ఆ తరువాత కారం పసుపు ధనియ జీలకర్ర పొడి నీరు వేసి మసాలాలూ మాడకుండా నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  6. గోంగూర ఆకులు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా వేపుకోండి. వేగిన గోంగూరలో రొయ్యలు నీరు వేసి కలిపి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  7. నూనె పైకి తేలాక దింపే ముందు గరం మసాలా, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • V
    Vasudha
    Recipe Rating:
    I'm in love with this super yumm recipe! The only change I will make is to chop up the Gongura leaves, since here in the US, we get large leaves.
  • P
    Pkamal
    Recipe Rating:
    Igdam mast.sir