ఆంధ్రా స్టైల్ రసం పొడి | ఈ చారు పొడి మీకు కనీసం 6 నెలలు ఘుమఘుమలాడుతూ ఉంటుంది
ప్రతీ ఇంట్లో, ప్రతీ బ్యాచిలర్ దగ్గర ఉంటే చాలు 5 నిమిషాల్లో చారు రెడీ. సింపుల్ చారు పొడి రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
దక్షిణ భారత దేశంలో దాదాపుగా ప్రతీ రోజూ ప్రతీ ఇంట్లో చారు మరగని ఇల్లు ఉండదేమో, చారన్నంతో నాలుగు ముద్దలైనా తింటేగాని భోజనానికి పరిపూర్ణత ఉండదు.
చారు పొడి ఉంటే చారు చేయడం చాలా సింపుల్. ఈ పొడి తో ఎన్ని రకాల చారులన్న పెట్టుకోవచ్చు. ఏ చారు కైనా బేస్ ఇదే పొడి. మీకు నచ్చిన పదార్ధాలు ఇంకా చారు పొడి వేసి మరిగించుకుంటే చారు రెడీ. ఈ చారు పొడి స్టాండర్డ్ చారు పొడి. ఈ పొడి కి పక్కా కొలతలు ఇవి. ఈ పొడి చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే తాజాగా కనీసం 5 నెలలు నిలవుంటుంది.

టిప్స్
-
చారు పొడి కోసం వేపే పదార్ధాలు ఒక్కోటిగా నిదానంగా వేపుకుంటే ప్రతీ గింజ లోపలిదాకా వేగి మాంచి సువాసనతో చారు పొడి ఎంతో రుచిగా ఉంటుంది.
-
చారు పొడి చింతపండు పులుసులో ఉపపేసి ఒక పొంగు రాగానే చారు పొడి వేసి 2 నిమిషాలు మరిగించి, తాలింపు వేసుకోండి.
ఆంధ్రా స్టైల్ రసం పొడి | ఈ చారు పొడి మీకు కనీసం 6 నెలలు ఘుమఘుమలాడుతూ ఉంటుంది - రెసిపీ వీడియో
Andhra Style Rasam Powder | Perfect Rasam Podi | Authentic Charu Podi | How to make Authentic Rasam Podi
Prep Time 5 mins
Cook Time 15 mins
Resting Time 10 mins
Total Time 30 mins
కావాల్సిన పదార్ధాలు
- 1 cup ధనియాలు
- 1/4 cup జీలకర్ర
- 1/4 cup కందిపప్పు
- 1/4 cup మిరియాలు
- 15 ఎండుమిర్చి
- 1/4 cup కరివేపాకు (25 gm)
విధానం
-
అడుగు మందంగా ఉన్న మూకుడులో ధనియాలు వేసి కేవలం లో-ఫ్లేం మీద మాత్రమే మాంచి సువాసనోచ్చి రంగు మారేంత వరకు వేపుకోండి.
-
అలాగే మిగిలిన సామానంతా ఒక్కొటిగా వేసుకుంటూ లో-ఫ్లేం మీద అనీ వేపుకుని తీసి చల్లర్చుకోండి
-
కరివేపాకు కూడా ఆకులోని చెమ్మ పోయే దాక వేపుకుని తీసి చల్లార్చుకోండి
-
పూర్తిగా చల్లారాక కాస్త బరకగా పొడి చేసుకోండి
-
పొడి లో నచ్చితే 1 tbsp పసుపు ½ tsp ఇంగువ వేసి ఉంచుకోవచ్చు.
-
ఈ పొడి ని చింతపండు పులుసులో వేసి మరిగించి ఆవాలు మెంతులు కరివేపాకు తో తాలింపు పెట్టుకుంటే సింపుల్ చారు రెడీ.

Leave a comment ×
5 comments