అరటికాయతో ఎక్కువగా వేపుడు ఇంకా పులుసులే చేస్తుంటారు. అరటికాయ వేపుళ్ళలోనే బోలెడన్ని చేయవచ్చు. అలాగే ఈ అరటికాయ ముద్ద కూర మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. వేడిగా అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

మామూలు అరటికాయ కూరల మాదిరి కాక ఇది పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ అరటికాయ ముద్ద కూర చేయడం చాలా తేలిక కానీ కొన్ని టిప్స్ తో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ టిప్స్ అన్నీ వివరంగా ఉన్నాయి చూడండి.

Andhra Style Raw Banana Pulp Curry | Raw Plantain Curry | Aratikaya Curry

టిప్స్

అరటికాయ:

  1. అరటికాయని రెండు ముక్కలు చేసి 2 కూతలు హై ఫ్లేమ్ మీద రానిస్తే చాలు. ఎక్కువగా ఉడికిస్తే పేస్ట్ లా అయిపోతుంది కూర.

  2. ఉడికిన అరటికాయ పూర్తిగా చల్లారిన తరువాత కొద్దిగా మెదుపుకోవాలి. ఎక్కువగా మెదిపితే కూర తయారయ్యే పాటికి పేస్ట్ అయిపోతుంది.

చింతపండు:

  • చింతపండు నచ్చని వారు కూర తయారయ్యాక నిమ్మరసం పిండుకోవచ్చు.

పచ్చి కొబ్బరి:

  • పచ్చికొబ్బరి కమ్మగా ఉంటుంది కూరలో లేని వారు ఎండు కొబ్బరి వేసుకోండి.

ఎండు మిర్చి:

  • ఈ కూరలో ఎండు మిర్చి మీకు తగినట్లుగా వేసుకోవచ్చు. ఈ కూరలో ఉప్పు పులుపు తీపి అన్నీ సమపాళల్లో ఉంటేనే రుచి.
Andhra Style Raw Banana Pulp Curry | Raw Plantain Curry | Aratikaya Curry

అరటికాయ ముద్ద కూర - రెసిపీ వీడియో

Andhra Style Raw Banana Pulp Curry | Raw Plantain Curry | Aratikaya Curry | How to Make Raw Banana Curry

Curries | vegetarian
  • Prep Time 3 mins
  • Cook Time 20 mins
  • Total Time 23 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2 పచ్చి అరటికాయలు
  • పొడి కోసం
  • 2 tsp ధనియాలు
  • 2 tsp మినపప్పు
  • 10 ఎండు మిర్చి
  • 1 tsp జీలకర్ర
  • పేస్ట్ కోసం
  • 1/4 cup పచ్చి కొబ్బరి
  • చింతపండు – ఉసిరికాయంత
  • 2` tsp బెల్లం
  • ఉప్పు
  • కూర కోసం
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1 ఉల్లిపాయ చీలికలు
  • 1/4 cup పసుపు
  • 1/3 cup నీళ్ళు

విధానం

  1. అరటికాయని రెండు సగాలుగా చేసి కుక్కర్లో రెండు కూతలు వచ్చేదాకా ఉడికించి, తొక్క తీసి పూర్తిగా చల్లారచండి.
  2. పాన్ లో పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపి మెత్తని పొడి చేసుకోవాలి.
  3. పాన్లో పచ్చి కొబ్బరి ఓ నిమిషం వేపి మిక్సీలో వేసి అందులోనే చింతపండు, బెల్లం వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
  4. పచ్చి కొబ్బరి ముద్దలో ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉంచుకోండి. అవసరమైతే కాసిని నీళ్ళు పోసుకోవచ్చు.
  5. చల్లారిన అరటికాయని కొద్దిగా చిదుముకోవాలి.
  6. పాన్లో 2 tbsp నూనె వేడి చేసి అందులో ఆవాలు కరివేపాకు వేసి వేపుకోవాలి.
  7. తరువాత ఉల్లిపాయ, పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి.
  8. ఉల్లిపాయ మెత్తగా అయ్యాక మెదుపుకున్న అరటికాయ ముద్ద వేసి కలిపి 2 నిమిషాలు వేగనివ్వాలి.
  9. వేగిన ముద్దలో చింతపండు కొబ్బరి పేస్ట్ కొద్దిగా నీళ్ళు వేసి నిదానంగా పేస్ట్ పట్టించాలి, తరువాత కూర చెమ్మారి పొడి పొడిగా అయ్యేదాక వేపుకోవాలి.
  10. ఈ కూర అన్నం , రోటీలలోకి చాలా బాగుంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • Y
    Yamuna
    Awesome... I tried this recipe long ago and it was super perfect
Andhra Style Raw Banana Pulp Curry | Raw Plantain Curry | Aratikaya Curry